మలయాళ 'చిత్రపరిశ్రమ'లో మహిళలపై వేధింపుల గురించి జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదికపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఎందరో నటీనటులు తమ అభిప్రాయాన్ని కూడా పంచుకున్నారు. ఈ క్రమంలో తాజాగా సీనియర్ స్టార్ హీరోయిన్ రాధిక శరత్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా చాలా ఇండస్ట్రీల్లో ఇలాంటి ఇబ్బందులనే మహిళలు ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపారు.
నటీమణులకు కేటాయించిన కారవాన్‌లలో కొందరు సీక్రెట్ కెమెరాలు పెట్టి ఆపై వారి ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించిన సందర్భాలు కూడా ఇండస్ట్రీలో ఉన్నాయని రాధిక ఆరోపించారు. ' ఒక సినిమా షూటింగ్‌లో భాగంగా నేను కేరళ వెళ్లాను. అప్పుడు సెట్‌లో జరిగిన ఒక సంఘటన నేను ఇప్పటికీ మర్చిపోలేను. షూట్ ముగించుకుని నేను అటుగా వెళ్తున్న సమయంలో కొంతమంది మగవాళ్లు ఒకచోట గుమికూడి ఫోన్‌లో ఏదో చూస్తూ నవ్వుకుంటున్నారు. కానీ, వారందరూ ఒక వీడియో చూస్తున్నారని నాకు అర్థమైంది. వెంటనే సినిమా యూనిట్‌లో పనిచేస్తున్న సిబ్బందిలో కొందరిని పిలిచి.. వారు ఏం చేస్తున్నారో చూడమని పంపాను.
అయితే, అప్పుడు నాకు షాకింగ్ విషయం తెలిసింది. కారవాన్‌లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి ఆపై మహిళల వ్యక్తిగత వీడియోలను చిత్రీకరించి ఫోన్‌లో చూస్తున్నారని తెలిసింది. అప్పుడు వెంటనే అక్కడ చిత్ర యూనిట్‌కు ఫిర్యాదు చేశాను. ఆ సంఘటన జరిగి చాలా ఏళ్లు అయింది. అయినా, ఇప్పటికీ ఆ సంఘటన గుర్తు చేసుకుంటే నాకు భయం. ఆరోజు నుంచి నేను కారవాన్ ఉపయోగించాలంటే భయపడుతాను. అని రాధిక అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment