Raadhika Sarathkumar
-
నటీమణులపై లైంగిక దాడులు జరిగితే బాధ్యత వారిదే: రాధిక శరత్‌కుమార్
మలయాళ 'చిత్రపరిశ్రమ'లో మహిళలపై వేధింపుల గురించి జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదికపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో సీనియర్ స్టార్ హీరోయిన్ రాధిక శరత్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నటీమణులకు కేటాయించిన కారవాన్లలో కొందరు సీక్రెట్ కెమెరాలు పెట్టారనే విషయాన్ని చెప్పుకొచ్చింది. ఈ విషయం పెద్ద దుమారాన్ని రేపింది. దీంతో తాజాగా ఆమె మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.సిట్ అధికారులు ప్రశ్నించారురాడాన్ సంస్థ నిర్మిస్తున్న 'తాయమ్మ కుటుంబంతార్' సిరీస్ గురించి నటి రాధిక శరత్‌కుమార్, నటీనటులు ఈరోజు చెన్నైలోని సైదాపేటలోని సీఐటీ నగర్‌లోని ఓ ప్రైవేట్ స్టూడియోలో మీడియాతో ఇలా మాట్లాడారు. 'హేమ కమిటీకి సంబంధించి 4 రోజుల క్రితం నేను చేసిన ఆరోపణలు నిజమా కాదా అని సిట్ నన్ను ఫోన్లో ప్రశ్నించింది. వాటికి సమాధానం కూడా చెప్పాను. కానీ, నేను ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఆ సంఘటన ఘతంలో జరిగింది. కానీ, ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువ మంది విద్యావంతులు వచ్చారు. దీంతో సినీ పరిశ్రమలో సమస్యలు కాస్త తగ్గుముఖం పట్టాయి.కేరళ మాదిరి తమిళ ఇండస్ట్రీలో కూడా హేమ కమిటీ ఉండాలని కోరుతున్నాను. ఇండస్ట్రీలో ఏమైన సమస్యలు ఎదురైనప్పుడు కొందరు హీరోలు మనతో పాటు నిలబడితే.. కొందరు పట్టించుకోరు. సినిమా ఇండస్ట్రీ మహిళల కోసం మేము కొన్నేళ్లుగా పోరాడుతూనే ఉన్నాం.' అని రాధిక అన్నారు.కేరళ సంఘటన గురించి ఎందుకు ఫిర్యాదు చేయలేదని రాధికను ప్రశ్నించగా.. 'దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ప్రజలతో, మీడియాతో మాట్లాడినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే కోర్టును ఆశ్రయించేందుకు కూడా నేను సిద్ధంగా లేను. అక్కడ కూడా న్యాయం జరగాలంటే చాలా రోజులు పడుతుంది. నిర్భయ కేసు 2012లో మొదలైతే.. 2020లో మాత్రమే దోషులకు శిక్ష పడింది. అని రాధిక గుర్తుచేశారు.లైంగిక దాడులు జరిగితే నిర్మాతలదే బాధ్యత సినీ నటీమణులపై లైంగిక దాడులు సమస్యలకు ఎవరు బాధ్యులన్న ప్రశ్నకు రాధికా ఇలా చెప్పుకొచ్చారు. ‘దీనికి నిర్మాతలే బాధ్యత వహించాలి. నటీమణులను సురక్షితంగా కాపాడాల్సిన బాధ్యత వారిదే. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎక్కడైనా పొరపాట్లు జరగొచ్చు. ఈ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చాలామంది నటీనటులు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. కానీ మహిళలకు అండగా ఎవరూ నిలబడటంలేదు. లైంగిక ఆరోపణల విషయంలో పురుషుల తప్పులేదని ఈ సమాజం మాట్లాడుతోంది. కానీ, నిందంతా మహిళలపైనే మోపుతున్నారు. మహిళల పట్ల సోషల్ మీడియాలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. తప్పుడు వ్యాఖ్యలను ప్రచురించే మీడియా సంస్థలను నిషేధించాలని నా విన్నపం. వారు ఎలాంటి విలేకరుల సమావేశానికి హాజరుకాకుండా బాయ్‌కాట్ చేయాలి. నిర్మాతల సంఘం, నటీనటుల సంఘం మధ్య నెలకొన్న సమస్యపై నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్‌తో కూడా ఇదే మాట్లాడాను. అని రాధిక అన్నారు. -
కారవాన్లలో సీక్రెట్ కెమెరాలతో వీడియోలు: రాధిక శరత్‌కుమార్
మలయాళ 'చిత్రపరిశ్రమ'లో మహిళలపై వేధింపుల గురించి జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదికపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఎందరో నటీనటులు తమ అభిప్రాయాన్ని కూడా పంచుకున్నారు. ఈ క్రమంలో తాజాగా సీనియర్ స్టార్ హీరోయిన్ రాధిక శరత్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా చాలా ఇండస్ట్రీల్లో ఇలాంటి ఇబ్బందులనే మహిళలు ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపారు.నటీమణులకు కేటాయించిన కారవాన్లలో కొందరు సీక్రెట్ కెమెరాలు పెట్టి ఆపై వారి ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించిన సందర్భాలు కూడా ఇండస్ట్రీలో ఉన్నాయని రాధిక ఆరోపించారు. ' ఒక సినిమా షూటింగ్లో భాగంగా నేను కేరళ వెళ్లాను. అప్పుడు సెట్లో జరిగిన ఒక సంఘటన నేను ఇప్పటికీ మర్చిపోలేను. షూట్ ముగించుకుని నేను అటుగా వెళ్తున్న సమయంలో కొంతమంది మగవాళ్లు ఒకచోట గుమికూడి ఫోన్లో ఏదో చూస్తూ నవ్వుకుంటున్నారు. కానీ, వారందరూ ఒక వీడియో చూస్తున్నారని నాకు అర్థమైంది. వెంటనే సినిమా యూనిట్లో పనిచేస్తున్న సిబ్బందిలో కొందరిని పిలిచి.. వారు ఏం చేస్తున్నారో చూడమని పంపాను. అయితే, అప్పుడు నాకు షాకింగ్ విషయం తెలిసింది. కారవాన్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి ఆపై మహిళల వ్యక్తిగత వీడియోలను చిత్రీకరించి ఫోన్లో చూస్తున్నారని తెలిసింది. అప్పుడు వెంటనే అక్కడ చిత్ర యూనిట్‌కు ఫిర్యాదు చేశాను. ఆ సంఘటన జరిగి చాలా ఏళ్లు అయింది. అయినా, ఇప్పటికీ ఆ సంఘటన గుర్తు చేసుకుంటే నాకు భయం. ఆరోజు నుంచి నేను కారవాన్ ఉపయోగించాలంటే భయపడుతాను. అని రాధిక అన్నారు. -
మీనాపై చాలా నీచంగా దుష్ప్రచారం చేశారు: శరత్‌కుమార్
కోలీవుడ్ సీనియర్ హీరో శరత్‌కుమార్ పలు యూట్యూబ్ ఛానళ్లపై ఫైర్ అయ్యారు. సినీ సెలబ్రిటీల గురించి యూట్యూబ్ ఛానళ్లలో చెడుగా మాట్లాడటం, ట్రోల్ చేయడం చాలా తప్పు అంటూ ఆయన మండిపడ్డారు. కొద్దిరోజుల క్రితం టాలీవుడ్లో కూడా ఇలాంటి వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మా అధ్యక్షులు మంచు విష్ణు సుమారు 20కి పైగా యూట్యూబ్ ఛానళ్లను నిషేధించేలా చర్యలు తీసుకున్నారు. అందుకు మీనా కూడా మంచు విష్ణును అభినందించారు.మీనాపై దుష్ప్రచారం చాలా తప్పు: శరత్ కుమార్ సౌత్ ఇండియాలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా కొనసాగిన మీనా గురించి కూడా పలు యూట్యూబ్ ఛానళ్లు తప్పుగా వీడియోలు చేశాయి. ఆమె మరో పెళ్లి చేసుకోనుందంటూ తీవ్రంగా ప్రచారం చేశాయి. దీంతో ఆమె పలుమార్లు మండిపడ్డారు కూడా. తాజాగా శరత్‌కుమార్ ఈ అంశం గురించి మాట్లాడారు. నటి మీనాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం చాలా దారుణం. ఒక ఆడబిడ్డ గురించి ఇలా తప్పుగా మాట్లాడం ఏంటి అంటూ ఆయన ప్రశ్నించారు. మీనా గురించి తప్పుగా మాట్లాడే అధికారం వీళ్లకు ఎవరిచ్చారని ఫైర్ అయ్యారు. యూట్యూబ్ ఛానళ్లలో కూర్చొని అలా మాట్లాడేవారి దగ్గర ఏదైనా రుజువు ఉందా..? ఏది కావాలంటే అది మాట్లాడటం చాలా నీచమైన చర్య అంటూ ఆయన మండిపడ్డారు. ప్రభుత్వాలు తలచుకుంటే రాత్రికి రాత్రే ఇలాంటి వాటిని అదుపు చేయవచ్చని శరత్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు.వాళ్లు పురుగులతో సమానం: రాధికయూట్యూబ్ ఛానళ్లలో సినీ సెలబ్రిటీల గురించి హీనంగా మాట్లాడే వారు పురుగులతో సమానమని రాధికా శరత్‌కుమార్ అన్నారు. కోలీవుడ్‌లో కూడా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తినంటూ చెప్పుకుంటున్న బైల్వాన్ రంగనాథన్ లాంటి వారు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం చాలా తప్పని అన్నారు. -
వరలక్ష్మి శరత్‌కుమార్ - నికోలయ్ సచ్దేవ్ సంగీత్ వేడుకల్లో ప్రముఖులు (ఫోటోలు)
-
వరలక్ష్మి శరత్ కుమార్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ (ఫొటోలు)
-
ఎన్నికల ప్రచారం నుంచి తప్పుకున్న ఖుష్బూ.. కారణం ఇదేనా?
బరువెక్కిన హృదయంతో ఎన్నికల ప్రచారం నుంచి తప్పుకుంటున్నానని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సినీ నటి, ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఖుష్బూ లేఖ రాశారు. తమిళనాడు నుంచి లోక్‌సభ ఎన్నికలలో ఖుష్బూ సీటును ఆశించిన విషయం తెలిసిందే. అయితే ఆమెకు బీజేపీ సీటు ఇవ్వలేదు. దీంతో కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు, ఎన్నికల ప్రచారాలకు ఆమె దూరంగా ఉంటూ రావడం చర్చకు దారి తీసింది. దీనికి ముగింపు పలికే విధంగా అధిష్టానం ఆదేశాల మేరకు కొద్దిరోజు క్రితమే ఎన్నికల ప్రచారానికి కుష్భు సిద్ధమయ్యారు. కొన్ని చోట్ల మమా అనిపించే విధంగా ప్రచారం కూడా చేశారు. శనివారం దక్షిణ చైన్నె అభ్యర్థి తమిళి సై సౌందర రాజన్‌కు మద్దతుగా కుష్బూ ప్రచారం కూడా చేశారు. అయితే హఠాత్తుగా ఏం జరిగిందో ఏమో గానీ ఎన్నికల ప్రచారం నుంచి బరువెక్కిన హృదయంతో తాను తప్పుకుంటున్నట్లు జేపీ నడ్డాకు ఆమె లేఖ రాయడం గమనార్హం. కారణం ఇదేనా..? 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఖుష్బూకు సీటు ఇవ్వకుండా బీజేపీ దూరం పెట్టిన విషయం తెలిసిందే.. ఇదే సమయంలో తాజాగా పార్టీలో చేరిన మరో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్‌కు బీజేపీ సీటు ఇచ్చింది. ఈ విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారని తమిళనాట భారీగా ప్రచారం జరుగుతుంది. ఈసారి తప్పకుండా సీటు దక్కుతుందని ఆశలు పెట్టుకున్న ఖుష్బూకు సీటు దక్కకపోవడంతో తీవ్రమైన నిరాశకు గురైయారని వినికిడి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో అన్నామలై, ఎల్.మురుగన్, తమిళిసై సౌందర్‌రాజన్, రాధికా శరత్‌కుమార్ వంటి ముఖ్యులకు సీటు కేటాయించిన విషయం తెలిసిందే. పార్టీలో సీనయర్ల అందరికీ సీటు కేటాయించిన బీజేపీ.. ఖుష్బూకు మొండి చేయి చూపించింది. వాస్తవంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖుష్బూ పోటీ చేసి ఓడిపోయారనే విషయం తెలిసిందే. దీంతో ఈ లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ ఆమెకు కేటాయిస్తారని అక్కడి నేతలు అందరూ భావించారు. ఖుష్బూకు ఎందకు సీటు దక్కలేదనే విషయంపై తమిళనాడు బీజేపీ నేతలు కూడా పలు కామెంట్లు చేస్తున్నారు. ఖుష్బూకు ఎక్కడ ఏం మాట్లాడాలో ఇంకా తెలియలేదని వారు చెబుతున్నారు. తమిళనాడు ప్రభుత్వం మహిళలకు ప్రతి నెలా ఇస్తున్న రూ.1000ను భిక్షగా ఆమె కామెంట్ చేసి తప్పుచేశారని పేర్కొంటున్నారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీకి నష్టాన్ని తెచ్చాయని చెబుతున్నారు. అది కాస్త అధిష్ఠానానికి ఆగ్రహం తెప్పించాయంటున్నారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్రంలోని మహిళలు కూడా ఖుష్బూ పట్ల సానుకూలంగా లేరని గుర్తుచేశారు. అందువల్ల ఆమెకు సీటు ఇస్తే ఓడిపోతారన్న భావనతో కేటాయించలేదని బీజేపీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఫైనల్‌గా ఆమెకు సీటు దక్కకపోవడం.. రీసెంట్గా పార్టీలో చేరిన రాధికా శరత్ కుమార్‌కు ప్రధాన్యత ఇచ్చి సీటు ఇవ్వడంతో ఖుష్బూలో వ్యతిరేఖత వచ్చిందని అందుకే ఇక ఎన్నికల ప్రచారానికి ఆమె గుడ్‌బై చెప్పారని ప్రచారం జరుగుతుంది. -
రాధిక శరత్‌కుమార్‌కు ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా?
ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో బాలీవుడ్‌తో పాటు దక్షిణాది హీరోయిన్లు సైతం పోటీ పడుతున్నారు. ఇటీవలే కంగనా రనౌత్‌కు సైతం బీజేపీ లోక్‌సభ సీటును కేటాయించింది. అంతకుముందే సీనియర్ నటి రాధికా శరత్ కుమార్‌కు బీజేపీ అధిష్టానం ఎంపీ టికెట్ ఇచ్చింది. ఆమె తమిళనాడులోని విరుధునగర్ నుంచి పోటీలో నిలిచారు. ఈ నేపథ్యంలో రాధిక శరత్‌కుమార్ ఆస్తులపై చర్చ మొదలైంది. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేసేవారు అఫిడవిట్లో తప్పనిసరిగా ఆస్తులు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే తొలి దశ పోలింగ్‌కు నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో అభ్యర్థులు నామపత్రాలను సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా విరుధునగర్ నుంచి పోటీ చేస్తున్న రాధిక నామినేషన్ దాఖలు చేసింది. ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తులను ప్రస్తావించారు. తన మొత్తం ఆస్తుల విలువను రూ.53.45 కోట్లుగా పేర్కొన్నారు. తన వద్ద ప్రస్తుతం రూ.33.01 లక్షల నగదు, 75 తులాల బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలు, ఇతర వస్తువులతో కలిపి రూ.27.05 కోట్ల చరాస్తులున్నట్లు రాధిక నామినేషన్ పత్రాల్లో వెల్లడించారు. రూ.26.40 కోట్ల స్థిరాస్తులతో పాటు రూ.14.79కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె రాడాన్ మీడియా వర్క్స్ ఇండియా లిమిటెడ్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా.. రాధిక భర్త, నటుడు ఆర్. శరత్ కుమార్ తన పార్టీ ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చిని భాజపాలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. -
ఎన్నికల బరిలో టాలీవుడ్ హీరోయిన్.. ఎక్కడ నుంచంటే?
ప్రముఖ సీనియర్ నటి, హీరోయిన్ రాధిక శరత్‌కుమార్ లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచారు. తాజాగా బీజేపీ ప్రకటించిన లిస్ట్‌లో నటి రాధిక స్థానం దక్కించుకుంది. తమిళనాడులోని విరుధునగర్ నుంచి ఆమె పోటీ చేయనుంది. తాజాగా ప్రకటించిన జాబితాలో తమిళనాడులో 14 స్థానాలతో సహా పుదుచ్చేరి సీటుకు కూడా అభ్యర్థులను బీజేపీ ఖరారు చేసింది. కాగా.. ఇటీవల ఆమె భర్త శరత్ కుమార్ తన పార్టీ ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చిని (AISMK) బీజేపీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. రాధిక శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్లో అగ్ర హీరోల సరసన హీరోయిన్గా నటించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో మెప్పించింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో కనిపించింది. అంతే కాకుండా పలు రియాలిటీ షోలకు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించారు. -
దర్శకుడిగా ధనుష్.. అక్క కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ..
హీరో ధనుష్ మూడవ చిత్రాన్ని ప్రారంభించారు. ఏంటీ ఆయన అర్ధ సెంచరీ కొడితే మూడవ చిత్రం అంటారేం అనుకుంటున్నారా? ధనుష్ 50వ చిత్ర షూటింగ్ ఇటీవల పూర్తి చేశారు. ఇందులో ఎస్జే సూర్య, నిత్యామీనన్, అపర్ణ బాలమురళి, వరలక్ష్మి శరత్‌కుమార్, దర్శకుడు సెల్వరాఘవన్, కాళిదాస్ జయరాం తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని, ఓం ప్రకాష్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం ఉత్తర చైన్నె నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ కథా చిత్రం అని సమాచారం. డైరెక్షన్ పనుల్లో ధనుష్ విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి స్వయంగా ధనుషే దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ధనుష్ ఎక్స్ మీడియా వేదికగా ఓ ట్వీట్ చేశారు. అందులో తనకు అన్ని విధాలుగా సహకరించిన నటీనటులకు, ముఖ్యంగా సన్ పిక్చర్స్ సంస్థకు, నిర్మాత కళానిధి మారన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇకపోతే ధనుష్ కథానాయకుడిగా నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రం పొంగల్ సందర్భంగా విడుదల కానుంది. అక్క కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ.. కాగా పవర్‌పాండి చిత్రంతో దర్శకుడిగా అవతారమెత్తిన ధనుష్ తాజాగా తన 50వ చిత్రానికి సైతం డైరెక్షన్ చేశారు. తాజాగా ముచ్చటగా మూడవసారి మెగాఫోన్ పట్టారు. ఈ చిత్రం ద్వారా తన అక్క కొడుకు వరుణ్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తున్నారు. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రంలో ధనుష్ అతిథి పాత్రలో మెరవనున్నట్లు సమాచారం. అదేవిధంగా నటి రాధిక శరత్‌కుమార్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారట. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ధనుష్‌తో ఉన్న తమ ఫ్యామిలీ ఫొటోను పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Radikaa Sarathkumar (@radikaasarathkumar) చదవండి: గడ్డకట్టే చలి.. బికినీలో కనిపించి షాకిచ్చిన నటి! -
ఆరుదైన ఫీట్ చేరుకున్న రాధిక శరత్‌కుమార్
నటి రాధిక నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన బహుభాషా నటి ఆమె. ఆమె నిర్మాతగా పలు చిత్రాలు, సీరియళ్లు నిర్మించారు. ఆరుపదుల వసంతాలను దాటిన ఈమె ఇప్పటికీ నాట్ అవుట్‌గా నటిస్తూనే ఉన్నారు. నటిగా 45 వసంతాలను పూర్తి చేసుకున్నారు. (ఇదీ చదవండి: హన్సిక సంగతేంటి నెల్సన్..?) 1978లో దర్శకుడు భారతీ రాజా కిళక్కే పోగుమ్ రయిల్ అనే తమిళ చిత్రం ద్వారా రాధికను కథానాయకిగా పరిచయం చేశారు. అది ఇప్పటికీ ఎవర్ గ్రీన్ చిత్రంగా నిలిచిపోయింది. ఆ చిత్రంలోని పూవరసంపు పూత్తాచ్చు అనే పాట ఇప్పటికీ తమిళనాడులో వాడ వాడలా మారుమోగుతూనే ఉంది. ఆ తర్వాత తమిళంలో వరుసగా చిత్రాలు చేస్తూ తెలుగు, హిందీ భాషల్లోనూ తన సత్తాను చాటారు రాధిక శరత్ కుమార్. సుమారు 100కు పైగా చిత్రాల్లో నటించారు. పలు జాతీయ, రాష్ట్ర అవార్డులను గెలుచుకున్నారు. ఆమె నిర్మించి, నటించిన ఒరుకాదల్ కథై చిత్ర దర్శకుడికి ఇందిరాగాంధీ అవార్డు వరించింది. కాగా ఈమె నటిగా 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం తన భర్త శరత్ కుమార్‌తో కలిసి కేక్ కట్ చేసి వేడుక జరుపుకున్నారు. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: బాహుబలి కట్టప్ప కుటుంబంలో తీవ్ర విషాదం) -
శరత్‌బాబుకు తమిళ సినీ ప్రముఖుల నివాళులు (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో ‘కళాతపస్వికి కళాంజలి’ కార్యక్రమం (ఫొటోలు)
-
చిరంజీవిని 23 సార్లు కొట్టాను, ఎందుకంటే?: రాధిక
మెగాస్టార్ చిరంజీవి, అలనాటి హీరోయిన్ రాధికా శరత్‌కుమార్ జంటగా ఎన్నో సినిమాలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పలు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అందుకున్నాయి. ప్రస్తుతం తల్లి పాత్రలు చేస్తున్న రాధిక చిరంజీవి సినిమాలో విలన్‌గా చేయడానికైనా రెడీ కానీ ఆయనకు మదర్‌గా మాత్రం నటించనని ఇటీవలే తెగేసి చెప్పింది. తాజాగా ఓ షోకు విచ్చేసిన ఆమె ఒక సినిమాలో చిరంజీవిని కొట్టానని చెప్పుకొచ్చింది. 'న్యాయం కావాలి సినిమా నా లైఫ్ టర్నింగ్ పాయింట్. అందులో చిరంజీవిని కొట్టికొట్టి మాట్లాడే సన్నివేశం ఉంటుంది. 23 టేక్స్ తీసుకున్నాను. ఆ తర్వాత చిరంజీవి ముఖం చూస్తే మొత్తం రెడ్ కలర్ అయిపోయింది. అంత గట్టిగా కొట్టేశాను. ఇండస్ట్రీలో హీరోయిన్గా ఉంటే తర్వాత తల్లిపాత్రలు చేయాలనే ఫార్మాట్ ఉంది. అది ఫాలో అవడం నాకిష్టం లేదు. అందుకే బుల్లితెరపై సీరియల్స్ చేశాను' అని రాధిక చెప్పుకొచ్చింది. కాగా రాధిక ఇటీవల విడుదలైన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాలో ముఖ్యపాత్రలో కనిపించిన విషయం తెలిసిందే! చదవండి: గని సినిమా ఫెయిల్యూర్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్ దటీజ్ రామ్‌చరణ్, ఆయన వ్యక్తిత్వానికి ఇదే ఎగ్జాంపుల్! -
ఆ విషయంపై కోర్టుకు వెళ్తా: రాధిక
నటి రాధికకు కరోనా సోకిందంటూ సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా ఈ వార్తలను ఖండించిన రాధిక తనకు కరోనా రాలేదని స్పష్టం చేసింది. సెకండ్ డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కాస్త ఒళ్లునొప్పులతో బాధపడ్డానని తెలిపింది. తన ఆరోగ్యం గురించి, చెక్ బౌన్స్ కేసు గురించి అసత్యవార్తలు రాస్తున్న వారి మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. తన బాగోగుల గురించి ఆరా తీస్తున్నవారి ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలియజేసింది. అలాగే చెక్ బౌన్స్ కేసు విషయంలో ఉన్నత కోర్టులో పోరాడతానని పేర్కొంటూ ట్వీట్ చేసింది. ఈ కేసులో రాధిక దంపతులకు ఏడాది జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. నటుడు శరత్ కుమార్, రాధిక భాగస్వాములుగా ఉన్న మేజిక్ ఫ్రేమ్స్ సంస్థ 'ఇదు ఎన్న మాయం' సినిమా నిర్మాణం కోసం రాడియన్స్ సంస్థ నుంచి 2014లో రూ.15 కోట్లు అప్పు తీసుకుంది. దీన్ని 2015 మార్చిలో చెల్లిస్తామని వారు మాటిచ్చారు. ఒకవేళ అప్పు తీర్చకపోతే టీవీ ప్రసార హక్కులు లేదా తర్వాత నిర్మించే సినిమా హక్కులు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. దీనికి తోడు అదనంగా కోటి రూపాయలు అప్పు తీసుకుని చెన్నై టీనగర్‌లోని ఆస్తిని తాకట్టుపెట్టారు. ఈ డబ్బుతో మరో సినిమా నిర్మించారు. అయితే ఇక్కడ ఒప్పందాన్ని ఉల్లంఘించడంలో తమకు రావాల్సిన రూ.2.50 కోట్లను వడ్డీతో సహా చెల్లించేలా ఆదేశాలివ్వాలని, టీ నగర్ ఆస్తులు అమ్మకుండా నిషేధం విధించాలని రాడియన్స్ సంస్థ కోర్టులో పిటిషన్ వేసింది. దీంతో డబ్బు చెల్లించాల్సిందే అని కోర్టు తీర్పు వెలువరించడంతో రాధిక దంపతులు 7 చెక్కులు సదరు సంస్థకు అందజేశారు.. శరత్‌కుమార్ దంపతుల బ్యాంకు ఖాతాలో డబ్బు లేకపోవడంతో వీటిలో ఒక చెక్కు బౌన్స్ అయింది. ఈ కారణంగా శరత్‌కుమార్ దంపతులపై, మరో భాగస్వామి స్టీఫెన్‌పై రాడియన్స్ సంస్థ చెన్నై సైదాపేట కోర్టులో క్రిమినల్ కేసు పెట్టింది. ఈ కేసును ఎమ్మెల్యేల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో బుధవారం విచారణకు రాగా, శరత్‌కుమార్, రాధిక దంపతులకు, స్టీఫెన్‌కు తలా ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే అప్పీలు కోసం శరత్‌కుమార్, స్టీఫెన్‌లకు అవకాశం ఇస్తూ శిక్షను నిలిపివేసింది. కోర్టుకు హాజరుకానందున రాధికపై పిటీ వారెంట్ జారీచేసింది. Thanks everyone for the love and affection, I am not down with corona virus, just body ache after second vaccine. On line press are just filing rubbish about health and case.We will fight it in higher courts. I am back at work, have a good day ❤️❤️❤️ — Radikaa Sarathkumar (@realradikaa) April 9, 2021 చదవండి: రాధిక, శరత్‌కుమార్ దంపతులకు షాక్ కమల్ హాసన్, అజిత్ ద్రోహం చేశారు: నటుడి ఆవేదన -
రాధిక, శరత్‌కుమార్ దంపతులకు ఏడాది జైలు శిక్ష
సాక్షి, చెన్నై: తమిళ నటుడు, రాజకీయ నాయకుడు శరత్‌కుమార్, అతడి భార్య, నటి, నిర్మాత రాధికలకు కోర్టులో చుక్కెదురైంది. 2018 నాటి చెక్ బౌన్స్ కేసులో ఇరువురికీ న్యాయస్థానం ఏడాది కాలం పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే.. 2015లో 'ఇదు ఎన్న మాయం' సినిమా కోసం రాధికా, శరత్‌కుమార్‌లు రేడియంట్ గ్రూప్ అనే కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నారు. అయితే సకాలంలో ఆ అప్పును తీర్చలేదు. తర్వాత వీరు ఇచ్చిన చెక్ కాస్త బౌన్స్ అయింది. దీంతో రేడియంట్ గ్రూప్ 2018లో కోర్టును ఆశ్రయించింది. నాలుగేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం చెన్నై స్పెషల్ కోర్టు ఈ దంపతులకు జైలు శిక్ష విధిస్తున్నట్లు తాజాగా తీర్పు వెలువరించింది. చదవండి: రజనీకి అమ్మగా చేయమంటారని తెలుసు! -
కమల్ సీఎం కావడం ఖాయం : నటి రాధిక
-
సోషల్ మీడియా కథనాలపై నటి రాధిక
సాక్షి, చెన్నై: సోషల్ మీడియా పుణ్యామాని మంచితోపాటు.. అదే స్థాయిలో అడ్డగోలుగా ఫేక్ వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి. సెలబ్రిటీలకు ఆ కథనాలు పెద్ద తలనొప్పిగా మారాయి. తాజాగా సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆమె బ్లడ్ కాన్సర్‌తో బాధపడుతున్నారంటూ కొన్ని వెబ్ సంస్థలు ప్రచురించాయి. దీంతో ఆ వార్త వైరల్ అయ్యింది. దీనిపై ఓ అభిమాని ట్విటర్ వేదికగా రాధికను ప్రశ్నించారు. దానికి సింపుల్‌గా ఆమె ‘అది నిజం కాదు.. కల్పితం’ అంటూ సమాధానమిచ్చారు. గతేడాది రవితేజ రాజా ది గ్రేట్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆమె.. ప్రస్తుతం తమిళం, మళయాళంలో ఒక్కో చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. Not true, some imagination. https://t.co/DN1n3cCvaB — Radikaa Sarathkumar (@realradikaa) 21 May 2018 -
నా అకౌంట్ హ్యాక్ అయింది: నటి
సాక్షి, చెన్నై: టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతున్న కొద్దీ వాటి దుర్వినియోగం సెలబ్రిటీలకు చిక్కులు తెచ్చిపెడుతోంది. సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లు హ్యాకింగ్ చేసి వాటి నుంచి అసభ్యకర పోస్టులు, లేక తమను గిట్టని వర్గంపై ట్వీట్లు చేస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా దక్షిణాది ప్రముఖ సినీనటి రాధికా శరత్‌కుమార్ ట్వీటర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. దీనిపై ఆమె ఆందోళన వ్యక్తం చేయగా.. నెటిజన్లు ఆమెకు మద్ధతుగా నిలుస్తున్నారు. ‘నా ట్వీటర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ సమస్య నుంచి బయటపడేదాక నాకు మద్ధతుగా నిలవాలంటూ’ నటి రాధిక ట్వీట్ ద్వారా విజ్ఞప్తిచేశారు. డోంట్ వర్రీ మేడమ్ అంటూ ఆమె ఫాలోయర్లు రీ-ట్వీట్లు చేస్తున్నారు. కాగా, ఇటీవల పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి, ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్, బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, రాజ్యసభ సభ్యుడు స్వపన్ దాస్‌గుప్తాల ట్వీటర్ అకౌంట్లు హ్యాకింగ్‌కు గురైన విషయం తెలిసిందే. హ్యాకింగ్ వెనక టర్కీ కేంద్రంగా పనిచేస్తున్న, పాక్ అనుకూల అయిల్దిజ్ టిమ్ బృందం ఉన్నట్లు గుర్తించారు. అంతకుముందు సచిన్ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. తన కుమరుడు అర్జున్, కూతురు సారా టెంటూల్కర్లకు సోషల్ మీడియా అకౌంట్లు లేవని.. ఆ పేర్లతో ఏవైనా పోస్టులు కనిపిస్తే నమ్మవద్దని సచిన్ కోరారు. సారా పేరుతో ట్వీటర్ ఖాతా తెరిచి ట్వీట్లు చేస్తున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. My Twitter account is hacked .please bear with me while I get this sorted — Radikaa Sarathkumar (@realradikaa) 26 February 2018 -
సినిమా రివ్యూ: ట్రాఫిక్
నటీనటులు: ప్రకాశ్ రాజ్, రాధిక, శరత్ కుమార్, సూర్య (గెస్ట్ అప్పియరెన్స్) చెరన్, ప్రసన్న, పార్వతి మీనన్, ఇనియా నిర్మాత: రాధిక శరత్ కుమార్, లిసిన్ స్టిఫెన్ కథ: బాబీ సంజయ్ ఫోట్రోగ్రఫి: షెహనాద్ జలాల్ మ్యూజిక్: మేజో జోసెఫ్ దర్శకత్వం: షాహిద్ ఖాదర్ ఓ యాక్సిడెంట్ సంఘటనకు అనేక ట్విస్ట్ లను జోడించి ప్రకాశ్ రాజ్, రాధిక, శరత్ కుమార్, చెరన్, ప్రసన్నలతో కలిసి రూపొందించిన చిత్రం ట్రాఫిక్. తమిళంలో విజయవంతమైన చెన్నాయిల్ ఓరు నాల్ చిత్రం తెలుగులో 'ట్రాఫిక్'గా ఫిబ్రవరి 14న విడుదలైంది. అన్ని దానాలలో అవయవ దానం గొప్పదనే ఓ సందేశంతో రూపొందిన కథేంటో ముందు చూద్దాం. యాంకర్ గా రాణించాలనే కార్తీక్ (సచిన్) కు ఓ టెలివిజన్ చానెల్ లో అవకాశం లభిస్తుంది. ఉద్యోగంలో చేరిన కార్తీక్ కు టాలీవుడ్ సూపర్ స్టార్ గౌతమ్ కృష్ణ (ప్రకాశ్ రాజ్)ను ఇంటర్వ్యూ చేసే అవకాశం వస్తుంది. కానీ కార్తీక్ ఓ యాక్సిడెంట్ కు గురై.. అతని బ్రెయిన్ డెడ్ అవుతుంది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న గౌతమ్ కృష్ణ కూతురుకు గుండె మార్పిడి చికిత్స అవసరమవుతుంది. బ్రెయిన్ డెడ్ అయిన కార్తీక్ తల్లి తండ్రులను గుండె మార్పిడికి ఒప్పించడంలో వైద్యులు సఫలమవుతారు. కోదాడలో విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్న గౌతమ్ కృష్ణ కూతురుకు గంటన్నరలోనే గుండెను అమర్చాలి. స్వల్ప వ్యవధిలో గుండె మార్పిడి జరిగిందా? హైదరాబాద్ నుంచి కోదాడకు గంటన్నరలో ఎలా చేరుకున్నారు?. మార్గమధ్యంలో ఎదురైన సంఘటనలు ఏంటి? ప్రయాణంలో ట్రాఫిక్ ఇబ్బందులను ఎలా అధిగమించారు? అనే ప్రశ్నలకు సమాధానమే ట్రాఫిక్ చిత్రం. సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న గౌతమ్ కృష్ణ పాత్రలో ప్రకాశ్ రాజ్, ఆయన భార్యగా రాధిక, పోలీస్ ఆఫీసర్ గా శరత్ కుమార్, ట్రాఫిక్ కానిస్టేబుల్ గా చెరన్ లు తమ పాత్రలను గొప్పగా పోషించారు. క్లైమాక్స్ లో సూర్య ఎంట్రీ ప్రేక్షకులను మరింత ఆలరించింది. విశ్లేషణ: పరిమితమైన సమయంలో గమ్యం చేరుకోవాలనే ఓ టార్గెట్ ను ప్రేక్షకులకు ముందే నిర్దేశించి.. ముందే కథలో లీనమయ్యేలా చేయడంలో సఫలమయ్యారు దర్శకులు షాహిద్ ఖాదర్. తొలి భాగంలో పాత్రలు వాటి స్వరూపాలను చక్కగా చిత్రీకరించిన దర్శకుడు.. రెండో భాగంలో తన నైపుణ్యానికి పనిచెప్పారు. హైదరాబాద్ - కోదాడ ప్రయాణంలో ఓ టెంపోను క్రియేట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ఈ ప్రయాణంలో ఎదురయ్యే సంఘటనలు, అడ్డంకులు సహజంగా ఉండటంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపింది. హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అమ్మాయికి గుండె మార్పిడి జరుగుతుందా లేదా అనే ఆసక్తిని రేకెత్తించడం దర్శకుడి ప్రతిభకు అద్దంపట్టింది. దర్శకుడి టేకింగ్ కు మేజో జోసెఫ్ బ్యాంక్ గ్రౌండ్ స్కోరు అదనపు అకర్షణగా మారింది. ప్రేక్షకుడికి చక్కటి ఫీల్ తోపాటు చిత్రాన్ని అందంగా, ఉత్కంఠను రేపే ఫొటోగ్రఫితో హెహనాద్ జలాల్ ఆకట్టుకున్నారు. రాధిక శరత్ కుమార్, లిసన్ స్టిఫెన్ నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. ఈ చిత్రంలో ఇగో ఉన్న నటుడిగా ప్రకాశ్ రాజ్, పోలీస్ ఆఫీసర్ గా శరత్ కుమార్, డ్రైవర్ పాత్రను పోషించిన చెరన్ లు అతి కీలకమైన పాత్రలు. వైద్యుడుగా ప్రసన్న కటుంబ వ్యవహారాలు, ట్రాఫిక్ కానిస్టేబుల్ చెరన్ జీవితం, కార్తీక్ ప్రేమకథ, కార్తీక్ తల్లితండ్రుల భావోద్వేగం, కూతురు రక్షించుకోవాలనే బాధతో గౌతమ్ కృష్ణ గా ప్రకాశ్ రాజ్ లాంటి అంశాలు, పలు కోణాలు ఈ కథకు మరింత బలాన్నిచ్చాయి. చక్కటి ఫీల్, భావోద్వేగం, ఓ సామాజిక నేపథ్యమున్న అంశాలను జోడించి నిర్మించిన ట్రాఫిక్ చిత్రం ప్రేక్షకులకు ఓ మంచి చిత్రం చూశామనే భావన కలిగిస్తుంది. ప్రస్తుతం వస్తున్న రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఓ మంచి చిత్రాన్ని చూడాలనుకునే ప్రేక్షకులకు కేరాఫ్ అడ్రస్ ట్రాఫిక్ అని చెప్పవచ్చు.