మీనాపై చాలా నీచంగా దుష్ప్రచారం చేశారు: శరత్‌కుమార్‌ | Radhika And Sarathkumar Comments On Meena Issue | Sakshi
Sakshi News home page

మీనాపై చాలా నీచంగా దుష్ప్రచారం చేశారు: శరత్‌కుమార్‌

Published Thu, Aug 1 2024 6:43 PM | Last Updated on Thu, Aug 1 2024 7:29 PM

Radhika And Sarathkumar Comments On Meena Issue

కోలీవుడ్‌ సీనియర్‌ హీరో శరత్‌కుమార్ పలు యూట్యూబ్‌ ఛానళ్లపై ఫైర్‌ అయ్యారు. సినీ సెలబ్రిటీల గురించి యూట్యూబ్ ఛానళ్లలో  చెడుగా మాట్లాడటం, ట్రోల్‌ చేయడం చాలా తప్పు అంటూ ఆయన మండిపడ్డారు. కొద్దిరోజుల క్రితం టాలీవుడ్‌లో కూడా ఇలాంటి వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మా అధ్యక్షులు మంచు విష్ణు సుమారు 20కి పైగా యూట్యూబ్‌ ఛానళ్లను నిషేధించేలా చర్యలు తీసుకున్నారు. అందుకు మీనా కూడా మంచు విష్ణును అభినందించారు.

మీనాపై  దుష్ప్రచారం చాలా తప్పు: శరత్‌ కుమార్‌  
సౌత్‌ ఇండియాలో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగిన మీనా గురించి కూడా పలు యూట్యూబ్‌ ఛానళ్లు తప్పుగా వీడియోలు చేశాయి. ఆమె మరో పెళ్లి చేసుకోనుందంటూ తీవ్రంగా ప్రచారం చేశాయి. దీంతో ఆమె పలుమార్లు మండిపడ్డారు కూడా. తాజాగా శరత్‌కుమార్‌ ఈ అంశం గురించి మాట్లాడారు. నటి మీనాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం చాలా దారుణం. 

ఒక ఆడబిడ్డ గురించి ఇలా తప్పుగా మాట్లాడం ఏంటి అంటూ ఆయన ప్రశ్నించారు.  మీనా గురించి తప్పుగా మాట్లాడే అధికారం వీళ్లకు ఎవరిచ్చారని ఫైర్‌ అయ్యారు. యూట్యూబ్‌ ఛానళ్లలో కూర్చొని అలా మాట్లాడేవారి దగ్గర ఏదైనా రుజువు ఉందా..? ఏది కావాలంటే అది మాట్లాడటం చాలా నీచమైన చర్య అంటూ ఆయన మండిపడ్డారు. ప్రభుత్వాలు తలచుకుంటే రాత్రికి రాత్రే  ఇలాంటి వాటిని అదుపు చేయవచ్చని శరత్‌కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు.

వాళ్లు పురుగులతో సమానం: రాధిక
యూట్యూబ్ ఛానళ్లలో సినీ సెలబ్రిటీల గురించి హీనంగా మాట్లాడే వారు పురుగులతో సమానమని రాధికా శరత్‌కుమార్‌ అన్నారు. కోలీవుడ్‌లో కూడా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తినంటూ చెప్పుకుంటున్న బైల్వాన్ రంగనాథన్‌ లాంటి వారు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం చాలా తప్పని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement