Radhika Sarathkumar Celebrate Her 45 Years Journey In Film Industry - Sakshi
Sakshi News home page

Radhika Sarathkumar: ఆరుదైన ఫీట్‌ చేరుకున్న రాధిక శరత్‌కుమార్‌

Published Sat, Aug 12 2023 8:04 AM | Last Updated on Sat, Aug 12 2023 10:20 AM

Radhika Sarathkumar Celebrate Her 45 Years Journey In Movie Industry - Sakshi

నటి రాధిక నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన బహుభాషా నటి ఆమె. ఆమె నిర్మాతగా పలు చిత్రాలు, సీరియళ్లు నిర్మించారు. ఆరుపదుల వసంతాలను దాటిన ఈమె ఇప్పటికీ నాట్‌ అవుట్‌గా నటిస్తూనే ఉన్నారు. నటిగా 45 వసంతాలను పూర్తి చేసుకున్నారు.

(ఇదీ చదవండి: హన్సిక సంగతేంటి నెల్సన్‌..?)

1978లో దర్శకుడు భారతీ రాజా కిళక్కే పోగుమ్‌ రయిల్‌ అనే తమిళ చిత్రం ద్వారా రాధికను కథానాయకిగా పరిచయం చేశారు. అది ఇప్పటికీ ఎవర్‌ గ్రీన్‌ చిత్రంగా నిలిచిపోయింది. ఆ చిత్రంలోని పూవరసంపు పూత్తాచ్చు అనే పాట ఇప్పటికీ తమిళనాడులో వాడ వాడలా మారుమోగుతూనే ఉంది. ఆ తర్వాత తమిళంలో వరుసగా చిత్రాలు చేస్తూ తెలుగు, హిందీ భాషల్లోనూ తన సత్తాను చాటారు రాధిక శరత్‌ కుమార్‌.

సుమారు 100కు పైగా చిత్రాల్లో నటించారు. పలు జాతీయ, రాష్ట్ర అవార్డులను గెలుచుకున్నారు. ఆమె నిర్మించి, నటించిన ఒరుకాదల్‌ కథై చిత్ర దర్శకుడికి ఇందిరాగాంధీ అవార్డు వరించింది. కాగా ఈమె నటిగా 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం తన భర్త శరత్‌ కుమార్‌తో కలిసి కేక్‌ కట్‌ చేసి వేడుక జరుపుకున్నారు. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: బాహుబలి కట్టప్ప కుటుంబంలో తీవ్ర విషాదం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement