బరువెక్కిన హృదయంతో ఎన్నికల ప్రచారం నుంచి తప్పుకుంటున్నానని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సినీ నటి, ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఖుష్బూ లేఖ రాశారు. తమిళనాడు నుంచి లోక్‌సభ ఎన్నికలలో ఖుష్బూ సీటును ఆశించిన విషయం తెలిసిందే. అయితే ఆమెకు బీజేపీ సీటు ఇవ్వలేదు. దీంతో కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు, ఎన్నికల ప్రచారాలకు ఆమె దూరంగా ఉంటూ రావడం చర్చకు దారి తీసింది. దీనికి ముగింపు పలికే విధంగా అధిష్టానం ఆదేశాల మేరకు కొద్దిరోజు క్రితమే ఎన్నికల ప్రచారానికి కుష్భు సిద్ధమయ్యారు.
కొన్ని చోట్ల మమా అనిపించే విధంగా ప్రచారం కూడా చేశారు. శనివారం దక్షిణ చైన్నె అభ్యర్థి తమిళి సై సౌందర రాజన్‌కు మద్దతుగా కుష్బూ ప్రచారం కూడా చేశారు. అయితే హఠాత్తుగా ఏం జరిగిందో ఏమో గానీ ఎన్నికల ప్రచారం నుంచి బరువెక్కిన హృదయంతో తాను తప్పుకుంటున్నట్లు జేపీ నడ్డాకు ఆమె లేఖ రాయడం గమనార్హం.
కారణం ఇదేనా..?
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఖుష్బూకు సీటు ఇవ్వకుండా బీజేపీ దూరం పెట్టిన విషయం తెలిసిందే.. ఇదే సమయంలో తాజాగా పార్టీలో చేరిన మరో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్‌కు బీజేపీ సీటు ఇచ్చింది. ఈ విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారని తమిళనాట భారీగా ప్రచారం జరుగుతుంది. ఈసారి తప్పకుండా సీటు దక్కుతుందని ఆశలు పెట్టుకున్న ఖుష్బూకు సీటు దక్కకపోవడంతో తీవ్రమైన నిరాశకు గురైయారని వినికిడి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో అన్నామలై, ఎల్.మురుగన్, తమిళిసై సౌందర్‌రాజన్, రాధికా శరత్‌కుమార్ వంటి ముఖ్యులకు సీటు కేటాయించిన విషయం తెలిసిందే.
పార్టీలో సీనయర్ల అందరికీ సీటు కేటాయించిన బీజేపీ.. ఖుష్బూకు మొండి చేయి చూపించింది. వాస్తవంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖుష్బూ పోటీ చేసి ఓడిపోయారనే విషయం తెలిసిందే. దీంతో ఈ లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ ఆమెకు కేటాయిస్తారని అక్కడి నేతలు అందరూ భావించారు. ఖుష్బూకు ఎందకు సీటు దక్కలేదనే విషయంపై తమిళనాడు బీజేపీ నేతలు కూడా పలు కామెంట్లు చేస్తున్నారు. ఖుష్బూకు ఎక్కడ ఏం మాట్లాడాలో ఇంకా తెలియలేదని వారు చెబుతున్నారు. తమిళనాడు ప్రభుత్వం మహిళలకు ప్రతి నెలా ఇస్తున్న రూ.1000ను భిక్షగా ఆమె కామెంట్ చేసి తప్పుచేశారని పేర్కొంటున్నారు.
ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీకి నష్టాన్ని తెచ్చాయని చెబుతున్నారు. అది కాస్త అధిష్ఠానానికి ఆగ్రహం తెప్పించాయంటున్నారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్రంలోని మహిళలు కూడా ఖుష్బూ పట్ల సానుకూలంగా లేరని గుర్తుచేశారు. అందువల్ల ఆమెకు సీటు ఇస్తే ఓడిపోతారన్న భావనతో కేటాయించలేదని బీజేపీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఫైనల్‌గా ఆమెకు సీటు దక్కకపోవడం.. రీసెంట్‌గా పార్టీలో చేరిన రాధికా శరత్ కుమార్‌కు ప్రధాన్యత ఇచ్చి సీటు ఇవ్వడంతో ఖుష్బూలో వ్యతిరేఖత వచ్చిందని అందుకే ఇక ఎన్నికల ప్రచారానికి ఆమె గుడ్‌బై చెప్పారని ప్రచారం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment