![Raadhika, Sarathkumar Sentenced 1 Year Imprisonment In Check Bounce Case - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/7/Radhika.jpg.webp?itok=xdJ3z2gt)
సాక్షి, చెన్నై: తమిళ నటుడు, రాజకీయ నాయకుడు శరత్‌కుమార్, అతడి భార్య, నటి, నిర్మాత రాధికలకు కోర్టులో చుక్కెదురైంది. 2018 నాటి చెక్ బౌన్స్ కేసులో ఇరువురికీ న్యాయస్థానం ఏడాది కాలం పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
వివరాల్లోకి వెళితే.. 2015లో 'ఇదు ఎన్న మాయం' సినిమా కోసం రాధికా, శరత్‌కుమార్‌లు రేడియంట్ గ్రూప్ అనే కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నారు. అయితే సకాలంలో ఆ అప్పును తీర్చలేదు. తర్వాత వీరు ఇచ్చిన చెక్ కాస్త బౌన్స్ అయింది. దీంతో రేడియంట్ గ్రూప్ 2018లో కోర్టును ఆశ్రయించింది. నాలుగేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం చెన్నై స్పెషల్ కోర్టు ఈ దంపతులకు జైలు శిక్ష విధిస్తున్నట్లు తాజాగా తీర్పు వెలువరించింది.
చదవండి: రజనీకి అమ్మగా చేయమంటారని తెలుసు!
Comments
Please login to add a commentAdd a comment