క్రితిక దర్శకత్వంలో విజయ్‌ఆంటోని | Kritika directed vijay antoni | Sakshi
Sakshi News home page

క్రితిక దర్శకత్వంలో విజయ్‌ఆంటోని

Published Wed, Jan 25 2017 1:40 AM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM

క్రితిక దర్శకత్వంలో విజయ్‌ఆంటోని

క్రితిక దర్శకత్వంలో విజయ్‌ఆంటోని

సంగీత దర్శకుడు విజయ్‌ఆంటోని వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు.సంగీతదర్శకుడుగా, కథానాయకుడిగా జోడు గుర్రాల సక్సెస్‌ స్వారీ చేస్తున్న ఈయన పిచ్చైక్కారన్  చిత్రంతో అసాధారణ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ తరువాత నటించిన సైతాన్  ప్రేక్షకులను బాగానే అలరించింది. ప్రస్తుతం యమన్ గా తెరపైకి రావడానికి రెడీ అవుతున్న విజయ్‌ఆంటోని తదుపరి రెండు చిత్రాల్లో నటించడానికి సిద్ధం అవుతున్నారు. విశేషం ఏమిటంటే ఇప్పటి వరకూ స్వంత నిర్మాణ సంస్థలోనే నటించిన ఈయన తొలిసారిగా బయట సంస్థల్లో నటించనున్నారు.అందులో ఒకటి రాధిక, శరత్‌కుమార్‌ నిర్మించనున్న చిత్రం.

ఇది త్వరలో సెట్‌పైకి వెళ్లనుందని సమాచారం. తాజాగా మరో చిత్రానికి విజయ్‌ఆంటోని  సైతాన్  చేశారని తెలిసింది.ఇంతకు ముందు శివ, ప్రియఆనంద్‌ జంటగా వణక్కంచెన్నై వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాన్ని తెరకెక్కించిన క్రితిక ఉదయనిధిస్టాలిన్  చిన్న గ్యాప్‌ తరువాత మళ్లీ మెగాఫోన్  పట్టడానికి రెడీ అవుతున్నారన్నది కోలీవుడ్‌ వర్గాల సమాచారం.ఇందులో విజయ్‌ఆంటోని కథానాయకుడిగా నటించనున్నారట.ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement