piccaikkaran
-
క్రితిక దర్శకత్వంలో విజయ్‌ఆంటోని
సంగీత దర్శకుడు విజయ్‌ఆంటోని వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు.సంగీతదర్శకుడుగా, కథానాయకుడిగా జోడు గుర్రాల సక్సెస్ స్వారీ చేస్తున్న ఈయన పిచ్చైక్కారన్ చిత్రంతో అసాధారణ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ తరువాత నటించిన సైతాన్ ప్రేక్షకులను బాగానే అలరించింది. ప్రస్తుతం యమన్ గా తెరపైకి రావడానికి రెడీ అవుతున్న విజయ్‌ఆంటోని తదుపరి రెండు చిత్రాల్లో నటించడానికి సిద్ధం అవుతున్నారు. విశేషం ఏమిటంటే ఇప్పటి వరకూ స్వంత నిర్మాణ సంస్థలోనే నటించిన ఈయన తొలిసారిగా బయట సంస్థల్లో నటించనున్నారు.అందులో ఒకటి రాధిక, శరత్‌కుమార్ నిర్మించనున్న చిత్రం. ఇది త్వరలో సెట్‌పైకి వెళ్లనుందని సమాచారం. తాజాగా మరో చిత్రానికి విజయ్‌ఆంటోని సైతాన్ చేశారని తెలిసింది.ఇంతకు ముందు శివ, ప్రియఆనంద్ జంటగా వణక్కంచెన్నై వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన క్రితిక ఉదయనిధిస్టాలిన్ చిన్న గ్యాప్ తరువాత మళ్లీ మెగాఫోన్ పట్టడానికి రెడీ అవుతున్నారన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం.ఇందులో విజయ్‌ఆంటోని కథానాయకుడిగా నటించనున్నారట.ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. -
నా మదర్ సంస్థలో నటిస్తా!
ఆదిలో ఒక్క అవకాశం అంటూ దర్శక నిర్మాతల చుట్టూ చెప్పులరిగేలా, కాళ్లు నెప్పులు పుట్టేలా తిరిగిన వారు ఇచ్చిన అవకాశంతో ఎదిగి ఆ తరువాత వారిని గుర్తించుకునేవారెందరు అన్నది ప్రశ్నార్థకమే. అయితే ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు విజయ్‌ఆంటోని లాంటి కొద్ది మంది గతాన్ని మరిచిపోవడానికి చిన్న ఉదాహరణ చెప్పాలి. విజయ్‌ఆంటోని ప్రముఖ సంగీతదర్శకుడు మాత్రమే కాదు, మినిమమ్ గ్యారెంటీ కథానాయకుడు కూడా. ఈయన హీరోగా నటించిన ప్రతి చిత్రం నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. ఇక ఆ మధ్య విడుదలై పిచ్చైక్కారన్ చిత్రం తమిళంలోనే కాకుండా తెలుగు నిర్మాతలను, బయ్యర్లను ధనవంతుల్ని చేసింది. ఇటీవల తెరపైకి వచ్చిన సైతాన్ చిత్రం సైతం విజయబాట పట్టింది. దీంతో విజయ్‌ఆంటోని కథానాయకుడిగా చిత్రాలు చేయడానికి పలువురు నిర్మాతలు క్యూలో ఉన్నారనడం అతిశయోక్తి కాదు. అలాంటిది ప్రముఖ నటుడు శరత్‌కుమార్, రాధిక శరత్‌కుమార్‌లకు తన తాజా చిత్రాన్ని చేయడానికి విజయ్‌ఆంటోని సిద్ధమయ్యారు. దీనికి కారణం లేకపోలేదు. రాడాన్ సంస్థ తనకు మదర్ సంస్థ అంటున్నారు విజయ్‌ఆంటోని. దీని గురించి ఆయన తెలుపుతూ సంగీతదర్శకుడిగా తనకు అవకాశం ఇచ్చి, ఆశీస్సులందించిన సంస్థ రాడాన్ అని తెలిపారు. అలాంటి సంస్థ అధినేతలకు చిత్రం చేయడం సంతోషంగా ఉందన్నారు. తన చిత్రాలకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఆదరణ లభిస్తోందన్నారు. దీంతో ఈ ఇరు భాష ప్రేక్షకులను అలరించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అందువల్ల తాన చిత్రాల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని అన్నారు. అయితే అలాంటి మంచి చిత్రాన్ని శరత్‌కుమార్, రాధికశరత్‌కుమార్ నిర్మించగలరన్న నమ్మకం తనకుందని పేర్కొన్నారు. నవ దర్శకుడు సీను వాస్ చెప్పిన కథ తనను చాలా ఇంప్రెస్ చేసిందని చెప్పారు. ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రారంభం కానుందని తెలిపారు. ఈ చిత్రం టైటిల్ తన గత చిత్రాల మాదిరిగానే ఆసక్తికరంగా ఉంటుందని, అదేమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అని అన్నారు. ఈ చిత్రాన్ని శరత్‌కుమార్, రాధికశరత్‌కుమార్ ఐ పిక్చర్స్ పతాకంపై తమిళం, తెలుగు భాషల్లో భారీ ఎత్తున నిర్మించనున్నారు. ప్రస్తుతం విజయ్‌ఆంటోని చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. -
4న పిచ్చైకారన్
పిచ్చైక్కారన్ చిత్ర విడుదల తేదీ ఖరారైంది. సంగీత దర్శకుడు విజయ్ఆంటోనీ కథానాయకడిగా నటించి తన విజయ్‌ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం పిచ్చైకారన్. నవ నటి సత్నాటైట్స్ కథానాయకిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని శశి నిర్వహిస్తున్నారు. ఈ చిత్ర విడుదల హక్కుల్ని స్కైలార్క్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థతో కలిసి కేఆర్ ఫిలింస్ అధినేతలు పొందారు. ఆ పంపిణీదారుల్లో ఒకరైన శరవణన్ చిత్ర విడుదల గురించి వెల్లడిస్తూ ప్రస్తుతం తమిళ చిత్రపరిశ్రమ టైమ్ బాంగుందన్నారు. మంచి కథా చిత్రాలు విడుదలై విజయం సాధిస్తున్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది తమ లాంటి డిస్ట్రిబ్యూటర్లకు ప్రోత్సాహకరమైన పరిస్థితి అని పేర్కొన్నారు. పిచ్చైక్కారన్ వంటి కథాబలం ఉన్న చిత్రం కచ్చితంగా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం తమకుందన్నారు. ఈ చిత్ర కథానాయకుడు విజయ్‌ఆంటోనికి ఇటు ప్రేక్షకుల్లోనూ అటు థియేటర్ల యజమానుల్లోనే ఆదరణ ఉందన్నారు. అది ఈ పిచ్చైకారన్ విజయానికి తోడ్పడుతుందనే నమ్మకం ఉందన్నారు. శశికి దర్శకుడిగా మంచి పేరుందని అది ఈ చిత్రంతో రెట్టింపు అవుతుందన్నారు. ఈ చిత్రాన్ని మార్చి 4న రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర డిస్ట్రిబ్యూటర్ శరవణన్ వెల్లడించారు.