check fraud
-
రాధిక, శరత్‌కుమార్ దంపతులకు ఏడాది జైలు శిక్ష
సాక్షి, చెన్నై: తమిళ నటుడు, రాజకీయ నాయకుడు శరత్‌కుమార్, అతడి భార్య, నటి, నిర్మాత రాధికలకు కోర్టులో చుక్కెదురైంది. 2018 నాటి చెక్ బౌన్స్ కేసులో ఇరువురికీ న్యాయస్థానం ఏడాది కాలం పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే.. 2015లో 'ఇదు ఎన్న మాయం' సినిమా కోసం రాధికా, శరత్‌కుమార్‌లు రేడియంట్ గ్రూప్ అనే కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నారు. అయితే సకాలంలో ఆ అప్పును తీర్చలేదు. తర్వాత వీరు ఇచ్చిన చెక్ కాస్త బౌన్స్ అయింది. దీంతో రేడియంట్ గ్రూప్ 2018లో కోర్టును ఆశ్రయించింది. నాలుగేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం చెన్నై స్పెషల్ కోర్టు ఈ దంపతులకు జైలు శిక్ష విధిస్తున్నట్లు తాజాగా తీర్పు వెలువరించింది. చదవండి: రజనీకి అమ్మగా చేయమంటారని తెలుసు! -
చెల్లని చెక్కిచ్చిన ఫ్యాషన్ డిజైనర్ అరెస్ట్
బంజారాహిల్స్: చెల్లని చెక్కు ఇచ్చి కొనుగోలు చేసిన బైక్‌తో ఉడాయించిన నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్‌కు చెందిన ఇమ్రాన్ అనే వ్యక్తి గత నెల 20వ తేదీన ఓఎల్ఎక్స్లో తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ విక్రయిస్తున్నట్లు వివరాలు ఉంచాడు. దానిని కొనుగోలు చేసేందుకు కేపీహెచ్‌బీ నిజాంపేట రోడ్డులో నివాసముండే ములగాడ రవికుమార్(30) అనే ఫ్యాషన్ డిజైనర్ ముందుకు వచ్చాడు. ఆ బైక్‌ను తీసుకుని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వద్ద ఓ అపార్ట్‌మెంట్‌కు రావాలని ఇమ్రాన్‌ను ఫోన్లో కోరాడు. ఆ మేరకు బైక్ తీసుకురాగా రూ.75 వేలకు బేరం కుదుర్చుకున్న రవికుమార్, ఇమ్రాన్‌కు చెక్కు ఇచ్చాడు. అనంతరం బైక్ తీసుకుని వెళ్లిపోయాడు. తనకు ఇచ్చిన చెక్కు చెల్లనిదిగా తేలటంతో బాధితుడు.. రవికుమార్‌కు ఫోన్ చేశాడు. అతడు స్పందించక పోవడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కాల్‌డేటా ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసి బైక్‌ను స్వాధీనం చేసుకొని బుధవారం రిమాండ్‌కు తరలించారు.