ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో బాలీవుడ్‌తో పాటు దక్షిణాది హీరోయిన్లు సైతం పోటీ పడుతున్నారు. ఇటీవలే కంగనా రనౌత్‌కు సైతం బీజేపీ లోక్‌సభ సీటును కేటాయించింది. అంతకుముందే సీనియర్ నటి రాధికా శరత్ కుమార్‌కు బీజేపీ అధిష్టానం ఎంపీ టికెట్ ఇచ్చింది. ఆమె తమిళనాడులోని విరుధునగర్ నుంచి పోటీలో నిలిచారు.
ఈ నేపథ్యంలో రాధిక శరత్‌కుమార్ ఆస్తులపై చర్చ మొదలైంది. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేసేవారు అఫిడవిట్‌లో తప్పనిసరిగా ఆస్తులు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే తొలి దశ పోలింగ్‌కు నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో అభ్యర్థులు నామపత్రాలను సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా విరుధునగర్ నుంచి పోటీ చేస్తున్న రాధిక నామినేషన్ దాఖలు చేసింది. ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తులను ప్రస్తావించారు. తన మొత్తం ఆస్తుల విలువను రూ.53.45 కోట్లుగా పేర్కొన్నారు.
తన వద్ద ప్రస్తుతం రూ.33.01 లక్షల నగదు, 75 తులాల బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలు, ఇతర వస్తువులతో కలిపి రూ.27.05 కోట్ల చరాస్తులున్నట్లు రాధిక నామినేషన్ పత్రాల్లో వెల్లడించారు. రూ.26.40 కోట్ల స్థిరాస్తులతో పాటు రూ.14.79కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె రాడాన్ మీడియా వర్క్స్ ఇండియా లిమిటెడ్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా.. రాధిక భర్త, నటుడు ఆర్. శరత్ కుమార్ తన పార్టీ ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చిని భాజపాలో విలీనం చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment