Virudhunagar
-
రాధిక శరత్‌కుమార్‌కు ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా?
ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో బాలీవుడ్‌తో పాటు దక్షిణాది హీరోయిన్లు సైతం పోటీ పడుతున్నారు. ఇటీవలే కంగనా రనౌత్‌కు సైతం బీజేపీ లోక్‌సభ సీటును కేటాయించింది. అంతకుముందే సీనియర్ నటి రాధికా శరత్ కుమార్‌కు బీజేపీ అధిష్టానం ఎంపీ టికెట్ ఇచ్చింది. ఆమె తమిళనాడులోని విరుధునగర్ నుంచి పోటీలో నిలిచారు. ఈ నేపథ్యంలో రాధిక శరత్‌కుమార్ ఆస్తులపై చర్చ మొదలైంది. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేసేవారు అఫిడవిట్లో తప్పనిసరిగా ఆస్తులు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే తొలి దశ పోలింగ్‌కు నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో అభ్యర్థులు నామపత్రాలను సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా విరుధునగర్ నుంచి పోటీ చేస్తున్న రాధిక నామినేషన్ దాఖలు చేసింది. ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తులను ప్రస్తావించారు. తన మొత్తం ఆస్తుల విలువను రూ.53.45 కోట్లుగా పేర్కొన్నారు. తన వద్ద ప్రస్తుతం రూ.33.01 లక్షల నగదు, 75 తులాల బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలు, ఇతర వస్తువులతో కలిపి రూ.27.05 కోట్ల చరాస్తులున్నట్లు రాధిక నామినేషన్ పత్రాల్లో వెల్లడించారు. రూ.26.40 కోట్ల స్థిరాస్తులతో పాటు రూ.14.79కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె రాడాన్ మీడియా వర్క్స్ ఇండియా లిమిటెడ్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా.. రాధిక భర్త, నటుడు ఆర్. శరత్ కుమార్ తన పార్టీ ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చిని భాజపాలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. -
Lok sabha elections 2024: మాణిక్కం ఠాగూర్ వర్సెస్ రాధిక
సాక్షి, న్యూఢిల్లీ: డీఎంకేతో పొత్తులో భాగంగా తమిళనాడులో పోటీ చేస్తున్న తొమ్మిది స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తును కాంగ్రెస్ వేగవంతం చేసింది. శుక్రవారం జరిగిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో విరుధునగర్ సహా నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. విరుధునగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ మరోసారి బరిలో దిగుతున్నారు. మరోవైపు ఈ స్థానాన్ని సినీ నటి రాధికా శరత్‌కుమార్‌కు కేటాయిస్తూ బీజేపీ కూడా శుక్రవారమే నిర్ణయం తీసుకుంది! దాంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. 2009లో కూడా ఇక్కడ మాణిక్కం నెగ్గారు. 2014లో డీఎంకే, కాంగ్రెస్ విడిగా పోటీ చేయడంతో అన్నాడీఎంకే అభ్యర్థి టి.రాధాకృష్ణ భారీ గెలుపొందారు. 2019లో కాంగ్రెస్, డీఎంకే కలిసి పోటీ చేయడంతో మాణిక్కం ఠాగూర్ మరోసారి నెగ్గారు. డీఎంకే మద్దతుతో ఈసారీ సునాయాసంగా నెగ్గుతామని కాంగ్రెస్ భావిస్తోంది. -
Tamil Nadu: బాణసంచా పరిశ్రమలో పేలుడు
సాక్షి, చెన్నై: ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టుచప్పుడు కాకుండా బాణసంచా తయారు చేస్తుండడం అమాయకుల ప్రాణాలను హరిస్తోంది. బాణసంచా ఇంట్లో అక్రమంగా బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు సంభవించి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఉదయం తమిళనాడులోని సాత్తూరులో జరిగిన ఈ ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడగా, పేలుడు ధాటికి ఐదు ఇళ్లు నేలమట్టమయ్యాయి. విరుదునగర్ జిల్లా శివకాశి, సాత్తూరు పరిసరాల్లోని అనేక గ్రామాల్లో కుటీర పరిశ్రమగా ఇళ్లలోనే బాణసంచా తయారీ జరుగుతోంది. సాత్తూరు సమీపంలోని కయాల్పట్టి కలైంజర్ నగర్లో అన్నదమ్ముళ్లయిన సూర్య, ప్రభాకరన్, అబ్బు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇంట్లోనే టపాసులు తయారుచేస్తున్నారు. సోమవారం ఉదయం ముడిసరుకు సిద్ధం చేస్తున్న సమయంలో పేలుడు చోటు చేసుకుంది. ఈ ధాటికి పక్కనే ఉన్న ఐదు ఇళ్లు నేలమట్టమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది 4 గంటలు శ్రమించారు. ఓ ఇంట్లోని శివమణి(35, అతని కుమారుడు రవి(5), శిథిలాలపై పడడంతో సంఘటనా స్థలంలోనే మరణించారు. కర్పగం అనే మహిళ శరీరం చిద్రమైంది. సూర్య, ప్రభాకరన్ స్వల్ప గాయాలతో అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఆస్పత్రికి తరలించే క్రమంలో సెల్వమణి మృతి చెందాడు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. కేసు నమోదు చేసిన పోలీసులు అబ్బులును అరెస్టు చేయగా, ప్రభాకరన్, సూర్య కోసం గాలిస్తున్నారు. మరో ఘటన కడలూరు జిల్లా పల్లడంపేటకు చెందిన సెంథిల్ ఎలాంటి అనుమతి లేకుండా ఇంట్లో టపాసుల తయారీలో నిమగ్నమై ఉన్నాడు. సోమవారం వేకువజామున ఆ ఇంట్లో పేలుడు చోటు చేసుకుంది. నాలుగు ఇళ్లు పాక్షింగా దెబ్బతిన్నాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పరారీలో ఉన్న సెంథిల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. Tamil Nadu: An explosion took place at an illegal firecracker manufacturing factory, in Thaiyilpatti near Sivakasi in Virudhunagar district. Two dead, two injured. Rescue operations underway. pic.twitter.com/bXRXwS1vRr — ANI (@ANI) June 21, 2021 -
దారుణం: ప్రియుడి కామవాంఛకు ఐదేళ్ల కుమార్తె బలి
సాక్షి ప్రతినిధి, చెన్నై: వివాహేతర సంబంధం మోజులో కట్టుకున్న భర్తను, సొంతూరును వదిలి పొరుగు రాష్ట్రానికి చేరుకుంది. ప్రియుడి కామవాంఛకు ఐదేళ్ల కుమార్తె బలైపోగా ఊరుకాని ఊరులో ఆ తల్లి ఒంటరిగా మిగిలింది. తమిళనాడు రాష్ట్రం విరుదునగర్ జిల్లా రాజపాళయంకు చెందిన ఒక యువతికి వివాహమై భర్త, ఐదు ఏళ్లు, మూడేళ్ల వయసునన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆ వివాహితకు అదే ప్రాంతానికి చెందిన అలెక్స్ (26) అనే యువకుడితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ వ్యవహారం భర్తకు తెలిసి మందలించినా భార్య పట్టించుకోలేదు. దీంతో విసుగుచెందిన భర్త మూడేళ్ల కుమార్తెను తీసుకుని వేరుగా వెళ్లిపోయారు. భార్య తన ఐదేళ్ల కుమార్తెతో అలెక్స్ వద్దకు చేరుకుని కేరళ రాష్ట్రం పత్తనంతిట్టా జిల్లాలో అద్దె ఇల్లు తీసుకుని ఉంటోంది. ఇద్దరూ కూలీ పనికి వెళ్లేవారు. ఆరో తేదీన యువతి కూలీ పనికి వెళ్లగా అలెక్స్ మద్యం, గంజాయి సేవించి ఇంటికి చేరుకుని ఒంటరిగా ఉన్న యువతి కూతురిపై అత్యాచార యత్నం చేశాడు. బాలిక ప్రతిఘటించి కేకలు వేయడంతో కత్తితో విచక్షణారహితంగా ఒళ్లంతా పొడిచి తన కామవాంఛను తీర్చుకున్నాడు. తర్వాత ఇంట్లోంచి వెళ్లిపోయారు. ఒళ్లంతా కత్తి గాయాలతో ఆ బాలిక స్పృహ కోల్పోయింది. సాయంత్రం కూలీ పనిముగించుకుని ఇంటికి వచ్చిన ఆ తల్లి నిస్తేజంగా రక్తపుమడుగులో పడి ఉన్న కుమార్తెను చూసి నిర్ఘాంతపోయింది. బాలికను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలిక మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పరారీలో ఉన్న అలెక్స్‌ను పోలీ సులు పట్టుకుని విచారించగా లైంగికదాడికి పాల్పడినట్లు నేరం అంగీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసి అలెక్స్‌ను అరెస్ట్‌చేశారు. -
అమ్మ అంత్యక్రియలు కూడా వీడియో కాల్లో..
సాక్షి, చెన్నై : ‘అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.. అమ్మ గురించి ఎంత చేసినా స్వల్ప మే...అమ్మను ఎంత తలచినా మధురమే’ అయితే, ఈ ఆధునిక యుగంలో తల్లిని వృద్ధాశ్రమాల్లోకి నెట్టే తనయలు ఎందర్నో చూశాం. అలాగే, దేవుడితో సమానంగా పూజించే వారిని చూశాం.’ ఆ దిశగా ఇక్కడ రెండో కోవకు చెందిన తనయులు లాక్డౌన్ వేళ అమ్మ కోసమే జీవితం అనిపించుకున్నారు. (నాన్నా.. అమ్మ ఏది?) అనారోగ్యంతో ఉన్న తల్లికి వైద్య చికిత్స అందించడం కోసం ఓ తనయుడు గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నుంచి మోటార్ సైకిల్ పయనం చేశాడు. విరుదు నగర్ జిల్లా వైద్య్రా ఇరుప్పుకు చెందిన చంద్రమోహన్ అహ్మదాబాద్‌లో ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. ఉద్యోగ రీత్యా చంద్ర మోహన్ అక్కడే ఉన్నా, తల్లి కస్తూర్తి మాత్రం వైద్య్రా ఇరుప్పులో నివాసం ఉంటున్న ఆమె గత వారం అనారోగ్యం బారిన పడ్డారు. ఆప్తులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించినా, తనయుడిని చూడాలన్న వేదనతో ఆ తల్లి పరితపించింది. (అయ్యో ! కరోనా ఎంత పని చేసింది) సమాచారం అందుకున్న చంద్రమోహన్ తల్లి అనారోగ్యంతో ఉన్న విషయాన్ని అహ్మదాబాద్ కలెక్టరేట్ దృష్టికి తీసుకెళ్లి తమిళనాడుకు వెళ్లేందుకు అనుమతి పత్రం పొందాడు. రవాణా వ్యవస్థ లేని దృష్ట్యా, తన మోటారు సైకిల్లో 2,350 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాడు. మహారాష్ట్రలో.. కర్ణాటకలో వైద్య పరీక్షలు చేసుకుని సోమవారం తమిళనాడులోని స్వగ్రామానికి చేరుకున్నాడు. తనయుడి చూసిన ఆనందంలో ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. చంద్ర మోహన్‌కు విరుదునగర్ పోలీసు యంత్రాంగం, వైద్యాధికారులు వైద్య పరీక్షలు నిర్వహించి 14 రోజుల పాటుగా ఇంట్లోనే ఉండాలని, ఆరోగ్య సూత్రాలు పాటించాలని సూచించారు. కడసారి చూపు కరువు.. సేలం జిల్లా మేచ్చేరి సమీపంలోని ఉక్కం పట్టికి చెందిన తంగవేలు, మాధు దంపతుల కుమారుడు శక్తి వేల్ (42) భారత ఆర్మీలో జవానుగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం రాజస్థాన్‌లో విధుల్ని నిర్వరిస్తున్నాడు. శక్తి వేల్ తల్లి మాధు అనారోగ్యంతో సోమవారం మరణించారు. ఈ సమాచారాన్ని కుటుంబీకులు రాజస్థాన్‌లో ఉన్న ఆర్మీ క్యాంప్‌కు అందజేశారు. రవాణా సౌకర్యం లేని దృష్ట్యా, కడసారిగా తల్లిని చూసుకుని, ఆమెకు అంత్యక్రియులు జరిపించలేని పరిస్థితి నెలకొంది. దీంతో కుటుంబీకులు తల్లి పార్తీవదేహాన్ని వీడియో కాల్ ద్వారా శక్తివేల్‌కు చూపించారు. అంత్యక్రియులు కూడా వీడియో కాల్ ద్వారా చూసిన ఆ సైనికుడు కన్నీటిపర్యంతమయ్యాడు. తల్లి మృతదేహాన్ని వీడియో కాల్లో చూస్తూ అతడు బోరున విలపిస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. (కరోనా: అంత్యక్రియలు అడ్డుకుంటే కటకటాలే!) -
బస్సు, ట్రాక్టర్ ఢీ: ముగ్గురు మృతి
సాక్షి, అన్నానగర్: బస్సు, ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అరుప్పుకోట సమీపంలో ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. విరుదునగర్ నుంచి అరుప్పుకోటకు 45మంది ప్రయాణికులతో బుధవారం ఉదయం ఓ ప్రభుత్వ బస్సు బయలుదేరింది. ఉదయం తొమ్మిది గంటల సమయంలో అరుప్పుకోట సమీపం పులియంపట్టి గుండా వెళుతుండగా ఎదురుగా 20మందితో వచ్చిన ట్రాక్టర్ బస్సును ఢీకొనడంతో బస్సు బోల్తాపడింది. బస్సు ప్రయాణికులలో సెల్వం (53), అరుణ్ (19), మారిశ్వరన్ (19)లు అక్కడికక్కడే మృతిచెందారు. బస్సు డ్రైవర్ చిత్రస్వామి సహా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాలను అరుప్పుకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సారీ.. ! టైం లేదు
జోరుగా ‘పుర’పోరు ప్రచారం ముఖ్యనేతలు మాత్రం దూరం అసెంబ్లీ టికెట్ వేటలో బిజీబిజీ గాడ్పాదర్స్ చుట్టూ ప్రదక్షిణలు ఎన్నికల వేళ అభ్యర్థుల్లో అయోమయం సాక్షి,మహబూబ్‌నగర్: ప్రస్తుతం జిల్లాలో ని మహబూబ్‌నగర్, గద్వాల, నారాయణపేట, వనపర్తి మునిసిపాలిటీతో పాటు నాగర్‌కర్నూల్, షాద్‌నగర్, కల్వకుర్తి, అయిజ నగర పంచాయతీలకు ఎన్నికలు జ రుగుతున్నాయి. ఈనెల 14 వరకు పుర నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా పూర్తయింది. 18న నామినేషన్ల ఉపసంహరణ, అదేరోజు అభ్యర్థులకు గుర్తులు కే టాయించడ ంతో ప్రచారపర్వం కూడా ముమ్మరమైంది. ఈనెల 30న ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం ప్రారంభమై ఐ దురోజులు గడుస్తున్నా..కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీల ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఎవరూ ప్రచారంలో పాల్గొనడం లేదు. కారణమేమంటే వచ్చే నెల 2వ తేదీ నుంచి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు స్వీకరిస్తుంచడంతో టికెట్లు దక్కించుకునేందుకు ముఖ్యనేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు గాంధీభవన్, ఎన్టీఆర్ భవన్, తెలంగాణ భవన్.. ఇలా ఆయా పార్టీల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మునిసిపల్ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి పోటీచేస్తున్న అభ్యర్థులు తమ గెలుపు కోసం అనుచరులతో కలిసి మాత్రమే ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించుకోవాల్సి వస్తోంది. నగర పంచాయతీల్లో అయితే అభ్యర్థులు చోటామోటా నాయకులను తమవెంట తిప్పుకోవాల్సి వస్తోంది. పుర నామినేషన్ల ఘట్టం మొదలు కాకముందే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గద్వాలలో సభ నిర్వహించి జిల్లాలో లాంఛనంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టివెళ్లారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఎంఐఎం నేతలు మినహా ప్రధానపార్టీలు నేతలు ఎవరు కూడా జిల్లాలో పర్యటించలేదు. మహబూబ్‌నగర్ మునిసిపాలిటీలో 41 వార్డులు ఉన్నాయి. ప్రచారం ప్రారంభంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు తమ పార్టీ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్, బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాత్రం తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం లోపాయికారీగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇక మిగతాపార్టీల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. గద్వాలలో టీడీపీ అభ్యర్థుల పక్షాన స్థానిక నేత డీకే సమరసింహారెడ్డి, వనపర్తిలో ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీమంత్రి జి.చిన్నారెడ్డి తమపార్టీ అభ్యర్థుల తరఫున మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. నారాయణపేటలో స్థానిక ఎమ్మెల్యే వై.ఎల్లారెడ్డి టీఆర్ఎస్లో చేరిన తరువాత ఇప్పటివరకు ఆ పార్టీ అభ్యర్థుల తరుఫున ప్రచారంలో పాల్గొనలేదు. టీడీపీ అభ్యర్థుల పరిస్థితి గందరగోళంగా మారింది. కల్వకుర్తిలో కూడా అదే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరుఫున ప్రచారం చేసేవారే కరువయ్యారు. మాజీమంత్రి జె.చిత్తరంజన్‌దాస్, చల్లా వంశీచందర్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి కల్వకుర్తి అసెంబ్లీ టికెట్‌ను దక్కించుకునే పనిలో ఉండటంతో మునిసిపల్ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొనడం లేదని తెలుస్తోంది.దీంతో స్థానిక నాయకులే ఇంటింటా ప్రచారం నిర్వహించుకుంటున్నారు. అలాగే షాద్‌నగర్‌లో ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల తరుఫున ప్రచారంలో పాల్గొనలేదు. అయిజ నగరపంచాయతీలో అయితే ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన చల్లా వెంకట్రామిరెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహాం మధ్య అసెంబ్లీ టికెట్ లొల్లి తారాస్థాయికి చేరడంతో మునిసిపల్ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులను పట్టించుకోవడం లేదు. టికెట్ కోసం ప్రదక్షిణలు అసెంబ్లీ, పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్న నేతలంతా..ఢిల్లీ, హైదరాబాద్‌లో తమ గాడ్పాదర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఒక్కో నియోజక వర్గం నుంచి టికెట్లు ఆశిస్తున్న నేతలు ముగ్గురి నుంచి ఆరుగురు వరకు ఉండగా, మిగతా పార్టీల్లో ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది. టీడీపీ నుంచే పోటీ తక్కువగా ఉందని చెప్పొచ్చు.