విరుధునగర్ లోక్‌సభ స్థానంలో ఆసక్తికర పోరు
సాక్షి, న్యూఢిల్లీ: డీఎంకేతో పొత్తులో భాగంగా తమిళనాడులో పోటీ చేస్తున్న తొమ్మిది స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తును కాంగ్రెస్ వేగవంతం చేసింది. శుక్రవారం జరిగిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో విరుధునగర్ సహా నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. విరుధునగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ మరోసారి బరిలో దిగుతున్నారు.
మరోవైపు ఈ స్థానాన్ని సినీ నటి రాధికా శరత్‌కుమార్‌కు కేటాయిస్తూ బీజేపీ కూడా శుక్రవారమే నిర్ణయం తీసుకుంది! దాంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. 2009లో కూడా ఇక్కడ మాణిక్కం నెగ్గారు. 2014లో డీఎంకే, కాంగ్రెస్ విడిగా పోటీ చేయడంతో అన్నాడీఎంకే అభ్యర్థి టి.రాధాకృష్ణ భారీ గెలుపొందారు. 2019లో కాంగ్రెస్, డీఎంకే కలిసి పోటీ చేయడంతో మాణిక్కం ఠాగూర్ మరోసారి నెగ్గారు. డీఎంకే మద్దతుతో ఈసారీ సునాయాసంగా నెగ్గుతామని కాంగ్రెస్ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment