![Senior Actress Raadhika Sarathkumar Contesting In Loksabha Elections In TN - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/22/radjika.jpg.webp?itok=4Rlops1j)
ప్రముఖ సీనియర్ నటి, హీరోయిన్ రాధిక శరత్‌కుమార్ లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచారు. తాజాగా బీజేపీ ప్రకటించిన లిస్ట్‌లో నటి రాధిక స్థానం దక్కించుకుంది. తమిళనాడులోని విరుధునగర్ నుంచి ఆమె పోటీ చేయనుంది. తాజాగా ప్రకటించిన జాబితాలో తమిళనాడులో 14 స్థానాలతో సహా పుదుచ్చేరి సీటుకు కూడా అభ్యర్థులను బీజేపీ ఖరారు చేసింది. కాగా.. ఇటీవల ఆమె భర్త శరత్ కుమార్ తన పార్టీ ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చిని (AISMK) బీజేపీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే.
రాధిక శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్‌లో అగ్ర హీరోల సరసన హీరోయిన్‌గా నటించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో మెప్పించింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో కనిపించింది. అంతే కాకుండా పలు రియాలిటీ షోలకు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment