సాక్షి, చెన్నై: టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతున్న కొద్దీ వాటి దుర్వినియోగం సెలబ్రిటీలకు చిక్కులు తెచ్చిపెడుతోంది. సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లు హ్యాకింగ్ చేసి వాటి నుంచి అసభ్యకర పోస్టులు, లేక తమను గిట్టని వర్గంపై ట్వీట్లు చేస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా దక్షిణాది ప్రముఖ సినీనటి రాధికా శరత్‌కుమార్ ట్వీటర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. దీనిపై ఆమె ఆందోళన వ్యక్తం చేయగా.. నెటిజన్లు ఆమెకు మద్ధతుగా నిలుస్తున్నారు. ‘నా ట్వీటర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ సమస్య నుంచి బయటపడేదాక నాకు మద్ధతుగా నిలవాలంటూ’ నటి రాధిక ట్వీట్ ద్వారా విజ్ఞప్తిచేశారు. డోంట్ వర్రీ మేడమ్ అంటూ ఆమె ఫాలోయర్లు రీ-ట్వీట్లు చేస్తున్నారు.
కాగా, ఇటీవల పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి, ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్, బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, రాజ్యసభ సభ్యుడు స్వపన్ దాస్‌గుప్తాల ట్వీటర్ అకౌంట్లు హ్యాకింగ్‌కు గురైన విషయం తెలిసిందే. హ్యాకింగ్ వెనక టర్కీ కేంద్రంగా పనిచేస్తున్న, పాక్ అనుకూల అయిల్‌దిజ్ టిమ్ బృందం ఉన్నట్లు గుర్తించారు. అంతకుముందు సచిన్ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. తన కుమరుడు అర్జున్, కూతురు సారా టెంటూల్కర్‌లకు సోషల్ మీడియా అకౌంట్లు లేవని.. ఆ పేర్లతో ఏవైనా పోస్టులు కనిపిస్తే నమ్మవద్దని సచిన్ కోరారు. సారా పేరుతో ట్వీటర్ ఖాతా తెరిచి ట్వీట్లు చేస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
My Twitter account is hacked .please bear with me while I get this sorted
— Radikaa Sarathkumar (@realradikaa) 26 February 2018
Comments
Please login to add a commentAdd a comment