Radhika Sarathkumar Slapped Chiranjeevi Very Hard, Here's Why - Sakshi
Sakshi News home page

Raadhika Sarathkumar: చిరంజీవిని గట్టిగా కొట్టాను, ముఖం ఎరుపెక్కిపోయింది: రాధిక

Published Tue, Apr 12 2022 7:33 PM | Last Updated on Tue, Apr 12 2022 8:24 PM

Radhika Sarathkumar Slapped Chiranjeevi Very Hard, Here is Why - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి, అలనాటి హీరోయిన్‌ రాధికా శరత్‌కుమార్‌ జంటగా ఎన్నో సినిమాలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన పలు సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర సూపర్‌ డూపర్‌ హిట్‌ అందుకున్నాయి. ప్రస్తుతం తల్లి పాత్రలు చేస్తున్న రాధిక చిరంజీవి సినిమాలో విలన్‌గా చేయడానికైనా రెడీ కానీ ఆయనకు మదర్‌గా మాత్రం నటించనని ఇటీవలే తెగేసి చెప్పింది.

తాజాగా ఓ షోకు విచ్చేసిన ఆమె ఒక సినిమాలో చిరంజీవిని కొట్టానని చెప్పుకొచ్చింది. 'న్యాయం కావాలి సినిమా నా లైఫ్‌ టర్నింగ్‌ పాయింట్‌. అందులో చిరంజీవిని కొట్టికొట్టి మాట్లాడే సన్నివేశం ఉంటుంది. 23 టేక్స్‌ తీసుకున్నాను. ఆ తర్వాత చిరంజీవి ముఖం చూస్తే మొత్తం రెడ్‌ కలర్‌ అయిపోయింది. అంత గట్టిగా కొట్టేశాను. ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఉంటే తర్వాత తల్లిపాత్రలు చేయాలనే ఫార్మాట్‌ ఉంది. అది ఫాలో అవడం నాకిష్టం లేదు. అందుకే బుల్లితెరపై సీరియల్స్‌ చేశాను' అని రాధిక చెప్పుకొచ్చింది. కాగా రాధిక ఇటీవల విడుదలైన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాలో ముఖ్యపాత్రలో కనిపించిన విషయం తెలిసిందే!

చదవండి: గని సినిమా ఫెయిల్యూర్‌పై వరుణ్‌ తేజ్‌ రియాక్షన్‌

 దటీజ్‌ రామ్‌చరణ్‌, ఆయన వ్యక్తిత్వానికి ఇదే ఎగ్జాంపుల్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement