Chiranjeevi Movie With Radhika Sarathkumar Radaan Banner, Deets Inside - Sakshi
Sakshi News home page

Chiranjeevi-Radhika Sarathkumar: సీనియర్ నటి రాధిక సినిమాలో హీరోగా చిరంజీవి..

Published Mon, May 2 2022 3:39 PM | Last Updated on Mon, May 2 2022 6:03 PM

Chiranjeevi Movie With Radhika Sarathkumar Radaan Banner - Sakshi

Chiranjeevi Movie With Radhika Sarathkumar Radaan Banner: మెగాస్టార్​ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్​ బిజీగా ఉన్నారు. కొరటాల శివ డైరెక్షన్​లో తెరకెక్కిన చిత్రం 'ఆచార్య'తో ఏప్రిల్​ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇదే కాకుండా చిరంజీవి చేతిలో మెహర్ రమేశ్ తెరకెక్కిస్తున్న భోళా శంకర్​, మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్​తోపాటు బాబీ డైరెక్షన్​లో మెగా154 చిత్రం సెట్స్​పై ముస్తాబవుతున్నాయి. తాజాగా చిరంజీవి మరో సినిమాలో నటించనున్నట్లు సమాచారం. 

సీనియర్ హీరోయిన్​ రాధికా శరత్​ కుమార్​ నిర్మాణంలో ఓ కొత్త సినిమాకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్​ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అఫిషియల్​గా ఆదివారం (మే 1) సోషల్​ మీడియా వేదికగా రాధిక తెలిపారు. భవిష్యత్తులో మా రాడాన్​ బ్యానర్​లో ప్రాజెక్ట్ చేసేందుకు మీరు ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు. కింగ్​ ఆఫ్​ మాస్​ అయిన మీతో బ్లాక్​ బస్టర్ తీసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని రాధిక ట్వీట్ చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.   

చదవండి: అజిత్-విజయ్​తో మల్టీ స్టారర్​.. డైరెక్టర్​ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ వారం థియేటర్‌, ఓటీటీలో రిలీజ్‌ అయ్యే సినిమాలివే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement