మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. గత కొన్నిరోజుల నుంచి అనుకుంటున్నట్లే 'విశ్వంభర' అనే పేరుని ఖరారు చేశారు. సంక్రాంతి కానుకగా టైటిల్ వెల్లడించడంతో పాటు కాన్సెప్ట్ వీడియోని విడుదల చేశారు. అసలు కథ ఏంటనేది కాస్త.. ఈ వీడియోలో రివీల్ చేశారు. అసలు 'విశ్వంభర' అంటే ఏంటి? ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి రానుంది?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 45 సినిమాలు)
గతేడాది సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'తో హిట్ కొట్టిన చిరు.. ఆగస్టులో 'భోళా శంకర్' మూవీతో వచ్చి ఘోరమైన విమర్శలు ఎదుర్కొన్నారు. అప్పట్లో చిరుని వీర లెవల్లో ట్రోలింగ్ చేశారు. ఇప్పుడు వాటన్నింటికీ సమాధానమిచ్చేలా 'విశ్వంభర' మూవీ కాన్సెప్ట్ వీడియోని రిలీజ్ చేశారు. సోషియో ఫాంటసీ కథతో తీస్తున్న ఈ సినిమా మూడు నాలుగు లోకాల మధ్య ఉండనుందని.. ఈ వీడియోతో అర్థమైంది.
రగ్బీ ఆకారం లాంటి ఓ వస్తువు.. పలు లోకాల్లో ప్రయాణించడాన్ని ఈ కాన్సెప్ట్ వీడియోలో చూపించారు. మరి ఈ వస్తువుతో చిరుకు ఏమైనా సంబంధం ఉంటుందా? లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. కీరవాణి సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకుడు. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి సినిమాని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఇక 'విశ్వంభర' అంటే భూమి, ప్రపంచం అని అర్థం. అంటే ఇది పలు యూనివర్స్‌ల నడిచే కథ అని అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: మెగా సంక్రాంతి సెలబ్రేషన్స్.. ఈ విషయం గమనించారా? )
Comments
Please login to add a commentAdd a comment