మెగాస్టార్ చిరంజీవి మరో స్టార్ డైరెక్టర్ కి అవకాశమిచ్చారనే వార్త వైరల్ గా మారిపోయింది. అతను తెలుగువాడు కాదనేది ఇక్కడ ఆసక్తికర విషయం. 'భోళా శంకర్'తో బిజీగా ఉన్న చిరు.. తర్వాత ఏం చేయబోతున్నారనేది ఇప్పటికీ సస్పెన్స్. ప్రస్తుతం స్టోరీలు వింటున్నారని, త్వరలో రెండు కొత్త చిత్రాల్ని ఒకేసారి అనౌన్స్ చేయబోతున్నారని అనిపిస్తుంది.
'బంగార్రాజు' ఫ్రాంచైజీతో నాగార్జునకు హిట్స్ ఇచ్చిన కల్యాణ్ కృష్ణ.. చిరుతో కలిసి వర్క్ చేయబోతున్నాడు. చాలారోజుల నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి టాక్ నడుస్తోంది. ఇది ఖరారైనప్పటికీ మంచిరోజు చూసి అధికారికంగా ప్రకటించాలని ఆగుతున్నారు. మరోవైపు ఈ మధ్యే '2018' మూవీతో మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన జూడ్ ఆంటనీ జోసెఫ్.. ఇప్పుడు చిరుతో కలిసి పనిచేయబోతున్నారట.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌హిట్ 'గురక సినిమా'.. అస్సలు మిస్సవ్వొద్దు!)
గత పదేళ్లలో నాలుగే సినిమాలు చేసిన ఈ డైరెక్టర్.. 2018 మూవీతో దేశవ్యాప్తంగా క్రేజు తెచ్చుకున్నాడు. ఓ రియలస్టిక్ స్టోరీని కూడా ఇంత బాగా తీయొచ్చా అని నిరూపించాడు. ఓవరాల్ గా ఈ చిత్రం రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ పంపిణీ చేసింది. అలా ఈయన వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో ఓ కథ అనుకుని, చిరంజీవిని కలిసి దాన్ని చెప్పారట. అది మెగాస్టార్ నచ్చి ఓకే చేశారని తెలుస్తోంది.
వైజాగ్ బ్యాక్ డ్రాప్, దానికి తోడు '2018' డైరెక్టర్.. చిరుతో కలిసి పనిచేయబోతున్నారు అని వినిపించేసరికి బహుశా 2014 అక్టోబరులో వైజాగ్ ని అతలాకుతలం చేసిన హుద్ హుద్ తుపాన్ ఆధారంగా ఏమైనా సినిమా తీస్తున్నారా అనే సందేహం వస్తోంది. అదే నిజమైతే మాత్రం మెగాఫ్యాన్స్ కి సంతోషమే. ఎందుకంటే ఈ మధ్య చిరు ఎక్కువగా రీమేక్స్ చేస్తున్నారు. ఒకవేళ ఇది ఫిక్స్ అయితే మాత్రం ఒరిజినల్ మూవీ అవుతుంది.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల‍్లోకి 28 సినిమాలు!)
Comments
Please login to add a commentAdd a comment