Radhika Interesting Comments On Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై సినీయర్ నటి, అలనాటి హీరోయిన్ రాధిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాధిక, చిరంజీవి కలిసి ఎన్నో సినిమాల్లో జంటగా నటించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక పరిశ్రమలో రాధిక, చిరంజీవిలు ఇప్పటికీ మంచి స్నేహితులు. ఈ క్రమంలో ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన రాధిక ఈ సందర్భంగా చిరంజీవి గురించి చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. చిరంజీవి సెల్ఫ్‌మేడ్ మ్యాన్ అంటూ కొనియాడారు.
చదవండి: ‘గని’ టీంకు రాష్ట్ర ప్రభుత్వం షాక్, తగ్గించిన టికెట్ రేట్స్
‘ఆయన తన కష్టంతో పైకి వచ్చారు. ఇప్పటికీ అంతే డేడికేషన్‌తో పని చేస్తున్నారు. మెగాస్టార్ అయినప్పటికీ చాలా ఒదిగి ఉంటారు. అందరితో బాగా కలిసిపోతారు. మేమంతా కలిసినప్పడు చిన్నపిల్లాడిలా అల్లరి చేస్తుంటారు’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం తల్లి పాత్రలు చేస్తున్న రాధిక చిరంజీవి సినిమాలో అవకాశం వస్తే ఎలాంటి రోల్ చేస్తారని అడగ్గా.. ఆయనకు విలన్‌గా ఆయినా చేస్తాను కానీ, తల్లి పాత్రలు అసలు చేయనంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. అనంతరం తాను ఒక నటినని, ఎలాంటి పాత్రలైన చేస్తానని చెప్పారు.
చదవండి: RC15: ఒక్క ఫైట్ సీన్‌కే రూ. 10 కోట్లు ఖర్చు పెట్టించిన శంకర్!
ప్రస్తుత టాలీవుడ్ హీరో గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న హీరోలందరూ తనకు ఇష్టమని, జూనియర్ ఎన్టీఆర్‌కు తాను అభిమానని తెలిపారు. తారక్ ఎనర్జీ లెవల్స్ ఫెంటాస్టిక్ అంటూ అతడిపై ప్రశంసలు కురిపించారు. అలాగే మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్‌లను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని, ఇప్పుడు వారు స్టార్ హీరోలుగా ఎదగడం చూస్తుంటే చాలా గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. కాగా ఇటీవల విడుదలైన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీలో రాధిక, శర్వానంద్‌కు తల్లిగా నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో రాధికతో పాటు ఖుష్బు సుందర్, ఊర్వశీలు కూడా ప్రధాన పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment