![Anita Hassanandani Tears Up Remembering Alcoholic Father](/styles/webp/s3/article_images/2024/08/31/Anita-Hassanandani-Reddy.jpg.webp?itok=wDZMnX6t)
నువ్వు నేను సినిమాతో తెలుగువారికి విపరీతంగా నచ్చేసింది హీరోయిన్ అనిత. నిన్నే ఇష్టపడ్డాను, శ్రీరామ్, ముసలోడికి దసరా పండుగ వంటి చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. తర్వాత బాలీవుడ్‌కు షిఫ్ట్ అయి అక్కడ సినిమాలు, సీరియల్స్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ తన తండ్రిని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంది. మా నాన్నకు తాగుడు అలవాటు ఉంది. అది చూసి తనపై కోపం పెంచుకున్నాను. కానీ, మన జీవితంలో తండ్రికి ఎప్పుడూ ప్రత్యేక స్థానమే ఉంటుంది.
తప్పు చేశా..
ఆయన గురించి నేనెప్పుడూ పెద్దగా మాట్లాడలేదు. అలా ఎన్ని ఏళ్లు గడిచిపోయాయో కూడా తెలీదు. కానీ ఇప్పుడు... సారీ నాన్న, నిన్ను ఎంతో మిస్ అవుతున్నాను. నాకు కొడుకు (ఆరవ్) పుట్టాకగానీ నీ ప్రేమ అర్థం కాలేదు. నువ్వు ఆరవ్‌ను కలవాల్సింది, తనతో ఆడుకోవాల్సింది. ఎంత పెద్ద తప్పు చేశాను? మా నాన్న తాగుబోతు అని ఎంత కోప్పడ్డాను? మద్యానికి బానిసయ్యాడని, దాన్నుంచి బయటపడలేకపోతున్నాడని అర్థం చేసుకోలేకపోయాను.
ఒక్కదాన్నే..
నాన్నపై అంత కోపం చూపించాల్సింది కాదు. నాకు 15 ఏళ్ల వయసున్నప్పుడే నాన్న మమ్మల్ని వదిలేసి పోయారు. నాది చిన్న వయసు కావడంతో ఏం చేయాలో తెలియలేదు. అమ్మ ఒంటరిదైపోయింది. అక్కకు అప్పటికే పెళ్లయిపోయింది. ఉన్నది నేనొక్కదాన్నే! ఆ వయసులోనే నటుడు మనోజ్ కుమార్ తనయుడు కునాల్ గోస్వామి ఆఫీసులో రిసెప్షనిస్టుగా చేరాను. అప్పుడు కునాల్ సోదరుడు నన్ను చూసి ఫోటోషూట్ ట్రై చేయొచ్చుగా అన్నాడు. అలా ఫోటోషూట్స్, ఆడిషన్స్‌తో నటనవైపు అడుగులు పడ్డాయి. ఇప్పుడిలా ఉన్నాను అని చెప్పుకొచ్చింది.
చదవండి: కారవాన్‌లలో సీక్రెట్ కెమెరాలతో వీడియోలు: రాధిక శరత్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment