Manoj Kumar
-
కాంగ్రెస్ ఎంపీని చితకబాదిన గ్రామస్థులు.. కారణం ఇదే..
పాట్నా: బీహార్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ మనోజ్ కుమార్‌పై గ్రామస్థులు దాడి చేశారు. ఈ క్రమంలో ఎంపీ తలకు తీవ్ర గాయమైంది. దీంతో, వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అనంతరం, మనోజ్ కుమార్‌కు చికిత్స అందించిన వైద్యులు.. ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలిపారు. ఇక, ఎంపీపై దాడి వార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.వివరాల ప్రకారం.. ఈ ఘటన బీహార్‌లోని కైమూర్ జిల్లాలో ఉన్న నాథుపుర్ గ్రామం సమీపంలో జరిగింది. మనోజ్ కుమార్ సోదరుడు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఎన్నికల్లో గెలిచారు. ఈ ఎన్నికల ఫలితం వెలువడిన తర్వాత ఎంపీ మనోజ్, ఆయన సోదరుడు కలిసి ఊరేగింపుగా బయలుదేరారు. ఊరేగింపులో మనోజ్ కుమార్‌కు చెందిన కారు కొందరు వ్యక్తులను తాకుతూ వెళ్లింది. ఆ సమయంలో కారులో మనోజ్ లేరు. దీంతో, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కారు డ్రైవరుపై దాడికి దిగారు. ఈ క్రమంలో ఎంపీ అనుచరులు ఎదురు దాడి చేయడంతో ఘర్షణ తీవ్రమైంది.बिहार में महा जंगल राज किस चरम सीमा पर है आप इस वीडियो के माध्यम से देख कर अंदाजा लगा सकते हैं। एक सासंद भी अब बिहार में सुरक्षित नहीं है। कांग्रेस नेता और वर्तमान में सासाराम से सांसद #Manoj_Kumar_Sasaram पर जानलेवा हमला हुआ है। हमला इतना बड़ा की साथ में इनके बॉडीगार्ड है फिर भी pic.twitter.com/UZsKiWsrRI— Sanjay bharati (@SanjayB00532031) January 30, 2025 అనంతరం, ఎంపీ అక్కడకు చేరుకొని గ్రామస్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే, గ్రామస్థులు ఆగ్రహంతో ఊగిపోతూ రాడ్లు, కర్రలతో ఎంపీని చితకబాదారు. దీంతో తలకు దెబ్బ తగిలి తీవ్ర గాయమైంది. ఎంపీ బాడీగార్డు, పీఏలపైనా దాడి జరిగింది. పోలీసులకు విషయం తెలియడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎంపీని వారణాసిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. Kaimur, Bihar: Seven people, including Congress MP Manoj Kumar and his guards, were injured in a clash over a school dispute in Kudra Nathupur, Sasaram. The MP went to mediate, but violence broke out, with stone-pelting and physical altercations. The injured were referred to a… pic.twitter.com/WAf2x0kXxU— IANS (@ians_india) January 30, 2025 -
బాక్సింగ్‌కు మనోజ్ వీడ్కోలు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత... ‘డబుల్ ఒలింపియన్’ భారత స్టార్ మనోజ్ కుమార్ బాక్సింగ్ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. త్వరలో కోచ్ రూపంలో ముందుకు వస్తానని హరియాణాకు చెందిన 39 ఏళ్ల మనోజ్ గురువారం ప్రకటించాడు. 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం (64 కేజీలు) గెలిచిన మనోజ్... 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం (69 కేజీలు) సాధించాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో, 2016 రియో ఒలింపిక్స్‌లో పోటీపడ్డ మనోజ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాడు. 2007, 2013 ఆసియా చాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలు నెగ్గిన మనోజ్ 2016 దక్షిణాసియా క్రీడల్లో పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. -
కోల్‌కతా సీపీగా మనోజ్ వర్మ
కోల్‌కతా: జూనియర్ డాక్లర్లు డిమాండ్ చేసినట్లుగానే కోల్‌కతా పోలీసు కమిషనర్ వినీత్ గోయల్‌పై వేటు పడింది. కొత్త కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ వర్మను బెంగాల్ ప్రభుత్వం మంగళవారం నియమించింది. జూడాలకు ఇచి్చన హామీ మేరకు ఆరోగ్య సేవల డైరెక్టర్ దెవాశిష్ హల్దర్, వైద్య విద్య డైరెక్టర్ కౌస్తవ్ నాయక్‌లను మమత సర్కారు తొలగించింది. కోల్‌కతా నార్త్ డివిజన్ డిప్యూటీ పోలీసు కమిషనర్ అభిõÙక్ గుప్తా పైనా వేటు వేసింది. మనోజ్ వర్మ జంగల్‌మహల్ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేతలో కీలకపాత్ర పోషించారు. కిషన్‌జీ (కోటేశ్వర రావు) ఎన్కౌంటర్లోనూ ముఖ్యభూమిక వహించారు. ఆర్.జి.కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ బెంగాల్లో జూనియర్ డాక్టర్లు 39 రోజులుగా విధులను బహిష్కరిస్తున్నారు. సోమవారం రాత్రి మమతతో సమావేశమయ్యారు. వారి ప్రధాన డిమాండ్లను మమత అంగీకరించడం తెలిసిందే. -
అలా ఎన్నేండ్లు గడిచాయో, తప్పు చేశా నాన్నా.. ఏడ్చేసిన హీరోయిన్
నువ్వు నేను సినిమాతో తెలుగువారికి విపరీతంగా నచ్చేసింది హీరోయిన్ అనిత. నిన్నే ఇష్టపడ్డాను, శ్రీరామ్, ముసలోడికి దసరా పండుగ వంటి చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. తర్వాత బాలీవుడ్‌కు షిఫ్ట్ అయి అక్కడ సినిమాలు, సీరియల్స్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ తన తండ్రిని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంది. మా నాన్నకు తాగుడు అలవాటు ఉంది. అది చూసి తనపై కోపం పెంచుకున్నాను. కానీ, మన జీవితంలో తండ్రికి ఎప్పుడూ ప్రత్యేక స్థానమే ఉంటుంది.తప్పు చేశా..ఆయన గురించి నేనెప్పుడూ పెద్దగా మాట్లాడలేదు. అలా ఎన్ని ఏళ్లు గడిచిపోయాయో కూడా తెలీదు. కానీ ఇప్పుడు... సారీ నాన్న, నిన్ను ఎంతో మిస్ అవుతున్నాను. నాకు కొడుకు (ఆరవ్) పుట్టాకగానీ నీ ప్రేమ అర్థం కాలేదు. నువ్వు ఆరవ్‌ను కలవాల్సింది, తనతో ఆడుకోవాల్సింది. ఎంత పెద్ద తప్పు చేశాను? మా నాన్న తాగుబోతు అని ఎంత కోప్పడ్డాను? మద్యానికి బానిసయ్యాడని, దాన్నుంచి బయటపడలేకపోతున్నాడని అర్థం చేసుకోలేకపోయాను. ఒక్కదాన్నే..నాన్నపై అంత కోపం చూపించాల్సింది కాదు. నాకు 15 ఏళ్ల వయసున్నప్పుడే నాన్న మమ్మల్ని వదిలేసి పోయారు. నాది చిన్న వయసు కావడంతో ఏం చేయాలో తెలియలేదు. అమ్మ ఒంటరిదైపోయింది. అక్కకు అప్పటికే పెళ్లయిపోయింది. ఉన్నది నేనొక్కదాన్నే! ఆ వయసులోనే నటుడు మనోజ్ కుమార్ తనయుడు కునాల్ గోస్వామి ఆఫీసులో రిసెప్షనిస్టుగా చేరాను. అప్పుడు కునాల్ సోదరుడు నన్ను చూసి ఫోటోషూట్ ట్రై చేయొచ్చుగా అన్నాడు. అలా ఫోటోషూట్స్, ఆడిషన్స్‌తో నటనవైపు అడుగులు పడ్డాయి. ఇప్పుడిలా ఉన్నాను అని చెప్పుకొచ్చింది.చదవండి: కారవాన్లలో సీక్రెట్ కెమెరాలతో వీడియోలు: రాధిక శరత్‌కుమార్ -
పిల్లల కోసం కాల్పులు.. ఇదొక హైప్రొఫైల్ ట్విస్టుల స్టోరీ
-
వివాహేతర సంబంధం.. సెలబ్రిటీ క్లబ్ లో కాల్పులు
-
ట్యాంక్‌బండ్‌పై రోడ్డు ప్రమాదం
చిక్కడపల్లి: ట్యాంక్‌బండ్‌పై శనివారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం చెందాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. శామీర్‌పేట అలియాబాద్‌కు చెందిన లక్ష్మీనారాయణ పెద్ద కుమారుడు మనోజ్ కుమార్ (34) హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. శనివారం తెల్లవారుజామున విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. సికింద్రాబాద్ నుంచి అఫ్జల్‌గంజ్‌కు వెళ్తున్న వెళ్తున్న ట్రావెల్స్ బస్సు అతివేగంతో వచ్చి మనోజ్ కుమార్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని దోమలగూడ పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మనోజ్‌కుమార్ మృతి చెందాడు. బస్సు డ్రైవర్ సయ్యద్ వసీం షాషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిన ట్యాంక్‌బండ్‌పై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. కేసు దర్యాప్తు దోమలగూడ ఇన్స్పెక్టర్ దొంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్.ఐ.శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. -
ఎనిమిది ట్రంకు పెట్టెల్లో ఆభరణాలు, నగదు
-
మనోజ్ అవినీతి విలాసం..
అనంతపురం క్రైం: ట్రంకు పెట్టెల్లో భారీగా నగదు, బంగారం, వెండి ఆభరణాలు వెలుగుచూసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపడం తెలిసిందే. వీటి వెనుక ఉన్న ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ గాజుల మనోజ్‌కుమార్ ఆస్తుల విలువ రూ.3 కోట్ల పైమాటేనని పోలీసుల విచారణలో వెల్లడయింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓఎస్డీ రామకృష్ణ ప్రసాద్ వెల్లడించారు. బుక్కరాయసముద్రం ఎస్సీ కాలనీలోని బాలప్ప ఇంట్లో మారణాయుధాలున్నాయనే సమాచారంతో ఈ నెల 18న ఎస్పీ సత్యయేసుబాబు ఆదేశాల మేరకు అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సీసీఎస్ డీఎస్పీ ఈ.శ్రీనివాసులు, తాడిపత్రి డీఎస్పీ ఏ.శ్రీనివాసులు, ట్రైనీ డీఎస్పీ చైతన్య నాలుగు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం 4 గంటల వరకు సోదాలు నిర్వహించి బంగారం, వెండి, నగదు, డిపాజిట్ పత్రాలు స్వాధీనం చేసుకుని తహసీల్దార్ సమక్షంలో పంచనామా నిర్వహించారు. అవన్నీ ట్రెజరీ కార్యాలయంలో పనిచేసే సీనియర్ అకౌంటెంట్ మనోజ్వేనని విచారణలో గుర్తించారు. రూ.15 లక్షల విలువ చేసే హార్లీ డేవిడ్సన్ బైక్.. బాలప్ప ఇంట్లోకి పెట్టెలు ఎలా వచ్చాయంటే.. మనోజ్ అనంతపురంలోని సాయినగర్ 8వ రోడ్డులో నివాసం ఉంటున్నాడు. ఇతని తండ్రి జి.సూర్యప్రకాష్ పోలీసు శాఖలో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తూ మరణించాడు. కారుణ్య నియామకం కింద 2005లో మనోజ్‌కుమార్‌కు ట్రెజరీలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. మనోజ్‌కుమార్‌కు బుక్కరాయసముద్రంలో వ్యవసాయ క్షేత్రం ఉండగా.. అందులో పనిచేసేందుకు స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన నాగలింగ వెళ్లేవాడు. అలా నమ్మకం ఏర్పడిన తర్వాత అతడినే మనోజ్ తన కారు డ్రైవర్‌గా నియమించుకున్నాడు. ఏడేళ్లుగా నాగలింగ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మనోజ్ ఆస్తులను నాగలింగ తన మామ బాలప్ప ఇంట్లో దాచిపెట్టాడు. నగదు...నగలు...వాహనాల స్వాధీనం మనోజ్ కారు డ్రైవర్‌గా పనిచేసే నాగలింగ మామ బాలప్ప ఇంట్లో ఎనిమిది ట్రంకు పెట్టెలను పరిశీలించగా అందులో 54 బంగారు ఆభరణాలు.. మొత్తం 2.42 కేజీల బంగారం, 280 వెండి సామగ్రితో పాటు మొత్తంగా 84.10 కేజీల వెండి, రూ.15,55,560 నగదు , రూ.49.10 లక్షల విలువైన 24 ఫిక్స్డ్ డిపాజిట్/ఎన్ఎస్ఎస్ బాండ్లు, రూ.27.05 లక్షల విలువైన 145 ప్రాంసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మూడు పిస్తోళ్లు, 18 రౌండ్లు, ఒక ఎయిర్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా బీకేఎస్‌లో ఉన్న మనోజ్ వ్యవసాయ క్షేత్రాన్ని పోలీసు బృందాలు పరిశీలించగా.. అక్కడ రెండు మహీంద్ర ఎక్స్‌యూవీ టాప్ మోడల్ కార్లు, ఒక హార్డీ డేవిడ్ సన్ మోటర్ వాహనం, మూడు ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహనాలు, రెండు కరీజ్మా ద్విచక్ర వాహనాలు, ఒక హోండా యాక్టివా, నాలుగు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న డమ్మీ పిస్తోళ్లు.. అవన్నీ డమ్మీ పిస్తోళ్లే పోలీసుల సోదాల్లో మూడు పిస్తోళ్లు, ఒక ఎయిర్‌గన్ స్వాధీనం చేసుకున్నామని, అవన్నీ డమ్మీవేనని ఓఎస్డీ వెల్లడించారు. పిస్తోళ్లతో పాటు 16 రౌండ్లను స్వాధీనం చేసుకున్నారు. కాల్చినప్పుడు వాటి నుంచి ఫైర్, సౌండ్ మాత్రమే వస్తాయనీ, వీటితో షూట్ చేసినా ఎవరికీ ప్రాణహాని ఉండదని తెలిపారు. కేసు నమోదు భారీ మొత్తంలో ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ప్రామిసరీ నోట్లు కలిగి ఉండడంతో మనోజ్కుమార్పై సీఆర్ నం 213/2020,యు/ఎస్ 102 సీఆర్పీసీ కింద కేసు నమోదు చేశామని ఓఎస్డీ వివరించారు. కేసు చేధింపులో కీలకంగా వ్యవహరించిన పోలీసులకు ఎస్పీ బి.సత్యయేసు బాబు అభినందించి రివార్డులు ప్రకటించారన్నారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీలు వీరరాఘవరెడ్డి, ఈ.శ్రీనివాసులు, ఏ.శ్రీనివాసులు, ట్రైనీ డీఎస్పీ చైతన్య, సీఐలు సాయిప్రసాద్, శ్యాంరావు, ఎస్ఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డీజీపీ దృష్టికి మనోజ్ వ్యవహారం చిరు ఉద్యోగి మనోజ్ భారీగా నగదు, నగలు దాచుకోవడం...పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్న అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను ఎస్పీ సత్యయేసుబాబు డీజీపీ గౌతం సవాంగ్‌కు నివేదిక సమర్పించారు. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ కొనసాగనున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక మనోజ్ అక్రమాస్తులపై ఏసీబీ కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ముందే చెప్పిన ‘సాక్షి’ జిల్లా ఖజానా కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోందనీ, ముడుపులిస్తే కానీ ఫైళ్లు ముందుకు కదలవని ‘సాక్షి’ ఈ ఏడాది మే 21న ‘ముడుపుల ఖజానా’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. అవినీతి తతంగంలో తెర వెనుక ఇద్దరు ఉద్యోగులున్నారని, అందులో సీనియర్ అకౌంటెంట్ మనోజ్ కీలకపాత్ర పోషించినట్లు పేర్కొంది. ఉద్యోగులకు డీఏ, అరియర్స్ విషయంలోనూ సదరు సీనియర్ అకౌంటెంట్ భారీ స్థాయిలో దందాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయని, వీటితో పాటు కార్యాలయంలో ఎవరికైనా మెమో, షోకాజ్ తదితర నోటీసులిస్తే సమాధానం అతనే రాసి వారితో సొమ్ము చేసుకుంటున్నారని మే నెలలో ప్రచురించిన కథనంలో ‘సాక్షి’ పేర్కొంది. ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం.. -
అవినీతి ‘ఖజానా’ ఆస్తి రూ.3 కోట్ల పైనే
అనంతపురం క్రైం: అనంతపురంలోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్ గాజుల మనోజ్‌కుమార్ అవినీతి అనకొండగా మారి కూడబెట్టిన ఆస్తి విలువ రూ.3 కోట్లపైనే ఉంటుందని అంచనా వేశారు. ఆస్తిని తన నమ్మిన బంటు అయిన కారు డ్రైవర్ నాగలింగ మామ బాలప్ప ఇంట్లో 8 టంక్రు పెట్టెల్లో దాచిపెట్టాడు. పోలీసుల తనిఖీల్లో 2.42 కేజీల బంగారం, 84.10 కేజీల వెండి, రూ.15,55,560 నగదు, రూ.49.10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు/బాండ్లు, రూ.27.05 లక్షల విలువ గల ప్రామిసరీ నోట్లు లభ్యమయ్యాయి. వీటితో పాటు ఒక ఎయిర్ పిస్తోలు, మరో మూడు 9 ఎంఎం డమ్మీ పిస్తోళ్లు, 18 రౌండ్ల బుల్లెట్లు కూడా ఉన్నాయి. ఈ వివరాలను డీపీవో కార్యాలయ ఆవరణలో పోలీస్ శాఖ ఓఎస్డీ రామకృష్ణ ప్రసాద్ బుధవారం విలేకరులకు తెలియజేశారు. సొత్తును స్వాధీనం చేసుకుని.. మనోజ్కుమార్పై కేసు నమోదు చేసి డీజీపీకి నివేదించామని చెప్పారు. కేసును ఏసీబీకి అప్పగిస్తామన్నారు. అవినీతి డొంక కదిలిందిలా.. ► మనోజ్‌కుమార్ వద్ద మారణాయుధాలు ఉన్నట్టు పోలీసులకు ఫిర్యాదు అందగా.. ఎస్పీ బి.సత్యయేసుబాబు ఈ నెల 18న డీఎస్పీలు వీరరాఘవరెడ్డి, ఇ.శ్రీనివాసులు, ఎ.శ్రీనివాసులు, ట్రైనీ డీఎస్పీ చైతన్య, బుక్కరాయసముద్రం సీఐ సాయిప్రసాద్, ఎస్ఐ ప్రసాద్, సీసీఎస్ సీఐ శ్యామ్‌రావు రంగంలోకి దిగారు. ► మనోజ్‌కుమార్ డ్రైవర్ నాగలింగ, అతడి మామ బాలప్ప ఇళ్లల్లో తనిఖీ చేయగా.. బాలప్ప ఇంట్లో 8 టంక్రు పెట్టెలు కనిపించాయి. ► వాటిని తెరిచి చూడగా రూ.3 కోట్లకు పైగా విలువ చేసే బంగారం, భారీగా వెండి, నగదు, 4 డమ్మీ పిస్తోళ్లు, 18 రౌండ్ల బుల్లెట్లు లభించాయి. స్వాధీనం చేసుకున్న సొత్తును పరిశీలిస్తున్న పోలీసులు విలాసవంతమైన జీవితం ► మనోజ్‌కుమార్ బెంగళూరు వెళ్లేందుకు ఖరీదైన హార్లీ డేవిడ్సన్ బైక్ వాడేవాడని.. దీని ధర రూ.13 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుందని అంచనా. ► రూ.7 లక్షల విలువైన మూడు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లు, రెండు కరిజ్మా బైక్స్, రెండు మహీంద్ర ఎక్స్‌యూవీ కార్లు కొనుగోలు చేసినట్టు వెల్లడైంది. ఇవికాకుండా హోండా యాక్టివా, తాను పెంచుతున్న గుర్రాల కోసం లీజుకు తీసుకున్న వ్యవసాయ క్షేత్రంలో పనుల కోసం నాలుగు ట్రాక్టర్లు కూడా కొనుగోలు చేశాడు. -
ఆప్ ఎమ్మెల్యేకు జైలు శిక్ష విధించిన కోర్టు
న్యూఢిల్లీ : ఆప్ ఎమ్మెల్యే మనోజ్ కుమార్‌కు ఢిల్లీ కోర్టు జైలు శిక్ష విధించింది. 2013 అసెంబ్లీ ఎన్నిక సమయంలో తూర్పు ఢిల్లీ ప్రాంతంలోని కళ్యాణ్‌పురిలోని ఒక పోలింగ్ స్టేషన్లో ఎన్నికల విధులకు ఆటంకం కలిగించిన కేసులో అతనికి మూడు నెలల శిక్ష విధిస్తూ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. అయితే ఆ తర్వాత మనోజ్ కుమార్‌కు బెయిల్ లభించింది. అడిషినల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్ అతనికి పదివేల రూపాలయల పూచికత్తుపై బెయిల్ మంజూరు చేశారు. అలాగే ఈ తీర్పును పై కోర్టులో అప్పిల్ చేసుకోవడానికి కోర్టు అవకాశం కల్పించింది. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందిని అడ్డుకున్నారనే అభియోగాలతో ఐపీసీ సెక్షన్ 189 కింద, పోలింగ్ స్టేషన్ వద్ద అల్లర్లు సృష్టించారనే ఆరోపణలపై ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 131 కింద మనోజ్ కుమార్‌పై కేసులు నమోదయ్యాయి. వీటిపై విచారణ జరిపిన న్యాయస్థానం జూన్ 11 అతన్ని దోషిగా తేల్చింది. -
ఫలక్‌నుమా... తెలుగు సినిమాకి కొత్త
‘‘ఫలక్‌నుమా దాస్’ చిత్రంలో సంభాషణలు చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి. దీన్ని ఓ ఆర్ట్ ఫిల్మ్‌లా కాకుండా కమర్షియల్ చిత్రంగా బాగా తీశారు. సంగీతం కూడా బాగుంది. ఇలాంటి చిత్రం తెలుగు సినిమాకి కొత్త. విశ్వక్ ఎంతో ఇష్టంతో నటించి, దర్శకత్వం వహించారు. తరుణ్ భాస్కర్ బాగా నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని చిత్ర సమర్పకులు డి.సురేశ్‌బాబు అన్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’. సలోని మిశ్రా కథానాయిక. కరాటే రాజు సమర్పణలో కరాటే రాజు, చర్లపల్లి సందీప్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో–దర్శకుడు విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాను ఇటీవల 100 మంది దాకా చూశారు. వారంతా సినిమా బాగుందని ప్రశంసలు కురిపించారు. మా చిత్రం తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘విశ్వక్ మీద మొదట్లో నమ్మకం లేదు. అయితే తను ఓ షార్ట్ ఫిల్మ్ చూపించడంతో నమ్మకం కలిగి ఈ సినిమాలో ఓ పాత్ర చేశా’’ అన్నారు తరుణ్ భాస్కర్. ‘‘హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అని కరాటే రాజు అన్నారు. ‘‘ఈ సినిమాలోని రా కంటెంట్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. సినిమా చూసి ఎంజాయ్ చేయండి’’ అని సలోని మిశ్రా అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: మీడియా 9 మనోజ్‌కుమార్. -
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన ప్రముఖ నటుడు
సాక్షి, చెన్నై: మద్యం తాగి వాహనం నడుపుతున్న ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా కుమారుడు మనోజ్‌ను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మనోజ్ నడుపుతున్న ఎస్యూవీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి, నోటీసులు జారీ చేశామని నుంగంబాక్కం పోలీసులు తెలిపారు. కాగా, భారతీరాజా దర్శకత్వంలో మనోజ్ పలు సినిమాల్లో హీరోగా చేశారు. 1999లో వచ్చిన తాజ్‌మహల్‌తో సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. సముతిరం, కాదల్ పోక్కల్, అల్లి అర్జున సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. -
హక్కుల కోసం పోరాటం
ట్రైబల్స్ హక్కుల కోసం పోరాటం సాగించారు జర్నలిస్ట్ ఉష. మరి..ఈ పోరాటంలో ఆమె ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? ఎలా విజయం సాధించారు? అన్న ప్రశ్నలకు థియేటర్లోనే ఆన్సర్స్ దొరుకుతాయి. వరలక్ష్మీ శరత్‌కుమార్ ముఖ్య పాత్రలో మనోజ్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘వెల్వెట్ నగరం’. రమేష్ తిలక్, ఆరై్జ, సింగర్ మాళవిక ముఖ్య పాత్రలు పోషించారు. సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌లో వరలక్ష్మీ జర్నలిస్ట్ ఉష క్యారెక్టర్ చేశారని కోలీవుడ్ సమచారమ్. ఈ సినిమాలో తన క్యారెక్టర్‌కు డబ్బింగ్ కంప్లీట్ చేశారు వరలక్ష్మీ. త్వరలో రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు అరడజను సినిమాల్లో నటిస్తూనే హీరోయిన్గా చేసేందుకు కూడా స్క్రిప్ట్స్ వింటున్నారు. -
ప్రిక్వార్టర్స్‌లో మనోజ్, కవీందర్
ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ హాంబర్గ్ (జర్మనీ): ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మనోజ్ కుమార్ (69 కేజీ లు), కవీందర్ బిష్త్ (52 కేజీలు) శుభారంభం చేయగా... సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. తొలిరౌండ్లో మనోజ్ 3–2తో వాసిలి బెలూస్ (మాల్దోవా)పై, కవీందర్ 3–2తో రుసె బాబా (జపాన్)పై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. సతీశ్ 0–5తో మజిదోవ్ (అజర్బైజాన్) చేతిలో ఓడిపోయాడు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మొహమ్మద్ ఫ్లిసి (అల్జీరియా)తో కవీందర్; పెరెజ్ (వెనిజులా)తో మనోజ్ తలపడతారు. -
ఫైనల్లో మనోజ్
న్యూఢిల్లీ: ఉస్తీ నాద్ లాబెమ్ గ్రాండ్‌ప్రి అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత స్టార్ బాక్సర్ మనోజ్ కుమార్ (69 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మనోజ్‌తోపాటు సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు), మనీశ్ పన్వర్ (81 కేజీలు) కూడా ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీఫైనల్స్‌లో క్రిస్టియన్ చోలిన్స్కీ (చెక్ రిపబ్లిక్)పై మనోజ్; ఆడమ్ కొలారిక్ (చెక్ రిపబ్లిక్)పై సతీశ్; కామిల్ హలాడ్కీ (చెక్ రిపబ్లిక్)పై మనీశ్ గెలిచారు. అయితే భారత్‌కే చెందిన ఆశిష్ కుమార్ (64 కేజీలు) పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. అర్తెమ్ హరుతున్యాన్ (జర్మనీ) చేతిలో ఆశిష్ ఓడిపోయాడ -
కారు అదుపుతప్పి.. అనంతలోకాలకు
- ఇద్దరికి తీవ్ర గాయాలు - త్రుటిలో తప్పించుకున్న మరో ఇద్దరు గండేపల్లి (జగ్గంపేట) : ఏడీబీ రోడ్డులో జరిగిన కారు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరు విద్యార్థులు తీవ్ర గాయపడ్డారు. ఈ సంఘటనలో మరో ఇద్దరికి ప్రమాదం త్రుటిలో తప్పింది. స్థానిక ఎసై కె.దుర్గా శ్రీనివాసరావు కథనం ప్రకారం మండలంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో శ్రీకాకుళానికి చెందిన యవ్వారి మనోజ్‌కుమార్ (21), అనకాపల్లికి చెందిన రవిరాజు ఈఈఈ ఫైనల్ ఇయర్, రాజోలుకు చెందిన కంచి కౌశిక్ మెకానికల్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. పెద్దాపురం బ్యాంక్ కాలనీలో అద్దె ఇంటిలో నివాసం ఉంటూ కళాశాలకు రోజు వెళ్లి వస్తుంటారు. సోమవారం రవిరాజుకు చెందిన కారులో స్నేహితుడైన కౌశిక్‌ను కళాశాలలో డ్రాప్ చేసేందుకు కళాశాల సమీపంలోకి వచ్చి వెనుదిరిగి పెద్దాపురం బయలుదేరారు. లలిత గొడౌన్ వద్దకు వచ్చేసరికి వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి కాలువలోంచి దూసుకెళ్లి గొడౌన్ గేట్ వద్ద చెట్టును, పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది షెల్టర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో ముగ్గురు కారులో చిక్కుకుపోయారు. గొడౌన్‌కు చెందిన పలువురు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను కారులోంచి బయటకు తీసి 108 అంబులెన్స్‌కు సమాచారం అందజేశారు. అప్పటికే మనోజ్‌కుమార్ మృతి చెందినట్టు అంబులెన్స్ సిబ్బంది తెలిపింది. తీవ్ర గాయాలతో ఉన్న రవిరాజు, కౌశిక్‌లను పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమచికిత్స అనంతరం కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. ప్రమాద స్థలానికి చేరుకున్న ఏఎస్సై వరహాలరాజు వివరాలు సేకరించారు. ప్రస్తుతం రవిరాజు పరిస్థితి విషమంగా ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. భీతిల్లిన సిబ్బంది షెల్టర్‌లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది.. ఈ ప్రమాదంతో భీతిల్లారు. ఒక్కసారిగా పెద్దగా శబ్దం రావడంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. షెల్టర్‌ను కారు ఢీకొనడంతో తమకు ప్రమాదం తప్పిందని పడాల శ్రీనివాస్, మద్దాల విలియం తెలిపారు. కారణం.. అతివేగమా? రోడ్డుపై బురదేనా? విద్యార్థులు ప్రయాణం చేస్తున్న కారును వేగంగా నడపడంతో ఈ ప్రమాదం సంభవించిందా...లేక రోడ్డుపై బురద కారణమా అనే అనుమానాలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. సాధారణ రోజుల్లోనే రోడ్డు నునుపుగా ఉంటుందని, వర్షం పడడం, ఈ రహదారిలో గ్రావెల్‌ను తరలిస్తున్న లారీ డ్రైవర్లు రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో రోడ్డుపై గ్రావెల్ పడుతోందని అంటున్నారు. దీంతో ఈ రోడ్డుపై తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ ఎన్. సతీష్‌రెడ్డి తక్షణమే స్పందించి చర్యలు చేపట్టారు. మనోజ్ కుమార్ మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కాకినాడలో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి వైద్యులతో మాట్లాడారు. -
కళ్లు మూసుకొమ్మని భార్యని ఏం చేశాడంటే..
న్యూఢిల్లీ: అప్పటికే వారిద్దరి మధ్య పెద్ద గొడవ. తీవ్ర కోపంతో భార్యాభర్తలిద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. అయితే, ఇద్దరి మధ్య ఫైటింగ్‌కు స్వస్తి పలకాలని, ఆ గొడవ మర్చిపోయేందుకు ఆమెకు గొప్ప బహుమతి ఇస్తానని నమ్మబలికాడు. పార్క్‌కు పిలిపించాడు. ఇద్దరు కలుసుకున్నాక కొద్ది సేపు కబుర్లు చెప్పుకున్నారు. అనంతరం ప్రేమగా పిలిచి అప్యాయంగా దగ్గరకు తీసుకొని తనవైపునకు తిప్పుకొంటూ ఆమెను ఆశ్చర్యపరచబోతున్నానని, కళ్లు మూసుకోవాలని చెప్పాడు. దాంతో తన భర్త నెక్లెస్ తీసుకొచ్చాడని ఆమె సంతోషపడింది. ఆమె అలా కళ్లు మూసుకుందో లేదో వెంటనే ఓ వైరును తీసుకొని ఆమె మెడకు గట్టిగా బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని మనోజ్ కుమార్ వ్యక్తి కోమల్ అనే యువతిని రెండేళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరి ప్రేమ వివాహం. కానీ, రెండేళ్లలోనే వారిద్దరి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. కోమల్‌కు వివాహేతర సంబంధం ఉందంటూ మనోజ్‌కుమార్ ఎప్పటి నుంచో అనుమానిస్తున్నాడు. అదే విషయంపై వారిద్దరి మధ్య తరుచూ గొడవవుతోంది. ఈ క్రమంలో వారిద్దరు కొద్ది కాలంగా విడివిడిగా ఉంటున్నారు. దీంతో ఆమెను ఎలాగైనా హత్య చేయాలని కుట్ర పన్నిన మనోజ్.. మరోసారి గొడవకు ముగింపు పలుకుదామనే నెపంతో ఆమెకు ఫోన్ చేసి ఉత్తర ఢిల్లీలోని బోంటా పార్క్ రమ్మని పిలిచాడు. అంగీకరించిన కోమల్ అక్కడికి వచ్చాక అతడు ముందుగానే కంజ్వాలాలో కొనుగోలు చేసిన వైరుతో మాయమాటలు చెప్పి గొంతుకు బిగించి హత్య చేసి పారిపోయాడు. ఆ వెంటనే ఫుల్లుగా మద్యం తాగుతూ జరిగిన సంగతిని అతడి స్నేహితులకు వివరిస్తుండగా అటువైపు పెట్రోలింగ్‌కు వచ్చిన పోలీసులు అతడిని అనుమానించి ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. పెద్ద మొత్తం అడవిలాగ ఉండే ఆ పార్క్‌లో ఆమె మృతదేహాన్ని గుర్తించేందుకు పోలీసులకు కూడా ఆరుగంటలు పట్టింది. ఎక్కడ చంపివేశాడనే చోటును కూడా అతడు గుర్తించలేకపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. -
ఉచ్చు బిగుస్తోంది..!
హోంగార్డుపై దాడి ఘటన.. దర్యాప్తులో మలుపు ► దాడి దృశ్యాలు బయటకు వెళ్లడంపై విచారణ ► కంట్రోల్ రూమ్ మహిళా కానిస్టేబుల్‌పై వేటుపడే అవకాశం ► దాడి చేసిన మనోజ్‌కుమార్ గతంలో రౌడీషీటర్ ► రౌడీషీట్ తొలగింపుపై అనుమానాలు ► కీలకంగా మారిన ఎస్బీ హెడ్ కానిస్టేబుల్? కర్నూలు: హోంగార్డు హుసేన్‌పై దాడి ఘటనలో నిందితులైన స్పెషల్ పార్టీ పోలీసుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. దాడి చేసిన కానిస్టేబుల్ మనోజ్ కుమార్‌పై గతంలో రౌడీషీట్ ఉండడం..అది తొలగిపోవడం.. అనుమానాలకు తావిస్తోంది. అలాగే ఉన్నతాధికారులు ఉన్న జిల్లా కేంద్రంలోనే పోలీసు సిబ్బంది అదుపు తప్పి ప్రవర్తించడంపై రాష్ట్రస్థాయి అధికారులు సీరియస్ అయినట్లు సమాచారం. దాడి దృశ్యాలు సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ నుంచి వాట్సాప్‌కు వైరల్ కావడానికి కారకులెవరన్న విషయంపై ఇప్పటికే జిల్లాస్థాయి అధికారులు విచారణ జరిపారు. రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పైఅంతస్థులో సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ ఉంది. రాత్రింబవళ్లు అక్కడ కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తుంటారు. హోంగార్డుపై దాడి సంఘటన జరిగిన రోజు కంట్రోల్ రూమ్‌లో మహిళా కానిస్టేబుల్ విధుల్లో ఉన్నట్లు విచారణలో తేలింది. దాడి దృశ్యాలు ఎవరి వాట్సాప్ ద్వారా బయటకు వెళ్లాయనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. ఈ విషయంలో మహిళా కానిస్టేబుల్‌పై కూడా వేటుపడే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఎవరి పాత్ర ఎంత...? స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దారితప్పిన ఘటన వెలుగు చూడటంతో పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. మనోజ్‌కుమార్ సోదరుల వ్యక్తిగత ప్రవర్తన విషయంలో విచారణ జరిపి రిపోర్టు వారికి అనుకూలంగా ఇచ్చేందుకు భారీగా డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలు రావడంతో రాష్ట్రస్థాయి అధికారుల ఆదేశాల మేరకు శాఖాపరమైన విచారణ మొదలయ్యింది. మనోజ్కుమార్పై ఉన్న రౌడీషీట్ తొలగింపులో ఎవరి పాత్ర ఎంత అన్నదానిపై ఆరా తీస్తున్నారు. సమస్యాత్మక వ్యక్తులపై రౌడీషీట్ తొలగించేటప్పుడు శాఖాపరంగా పలురకాలుగా విచారణ జరిపి తొలగింపునకు రెకమెండ్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్పెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సబ్ డివిజన్ స్థాయి అధికారులు రౌడీషీటు తొలగిస్తారు. మనోజ్‌కుమార్ రౌడీషీట్ తొలగించినప్పుడు టౌన్ డీఎస్పీ ఎవరున్నారు, స్పెషల్ బ్రాంచ్ విభాగానికి డీఎస్పీ ఎవరున్నారు? నాల్గో పట్టణ సీఐగా ఎవరున్నారు? రౌడీషీట్ తొలగింపునకు ఎవరు రికమెండ్ చేశారు? ఏ స్థాయిలో విచారణ జరిగింది?అనే విషయాలపై శాఖాపరమైన విచారణలో ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. హెడ్ కానిస్టేబుల్ పనితీరుపై ఫిర్యాదుల వెల్లువ... స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ మనోజ్కుమార్పై ఉన్న రౌడీషీట్ తొలగింపులో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ పాత్ర కీలకం. హోంగార్డుపై దాడి ఘటన నేపథ్యంలో ఆయన పాత్రపై కూడా విచారణ షురూ అయింది. పొరుగు జిల్లాకు చెందిన ఈయన సాధారణ కుటుంబం నుంచి వచ్చి జిల్లా పోలీసు శాఖలో ఉద్యోగం పొంది అనతికాలంలోనే కోట్ల రూపాయలకు అధిపతి అయ్యారన్న ఫిర్యాదులు వచ్చాయి. స్పెషల్ బ్రాంచ్ విధుల్లో చేరకముందు రైల్వేలో పనిచేసేటప్పుడు మట్కా, పేకాటరాయుళ్లకు అప్పులు ఇచ్చి భారీ మొత్తంలో వడ్డీలు వసూలు చేసేవారని ఆ శాఖలో పనిచేసే ఉద్యోగులు కొంతమంది పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు పంపినట్లు సమాచారం. మహారాష్ట్రలోని ఓ మెడికల్ కళాశాలలో ఈయన కుమారుడు ఎంబీబీఎస్ చదవడానికి అర కోటి రూపాయలు డొనేషన్ చెల్లించారు. అయితే కళాశాల నిర్వాహకులు డొనేషన్ తీసుకుని మోసం చేశారంటూ మూడేళ్ల క్రితం స్వయాన ఆయనే నాల్గో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు కూడా నమోదయ్యింది. మళ్లీ అరకోటి రూపాయలు చెల్లించి కుమారుడిని మరో కళాశాలలో చదివిస్తున్న విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. హెడ్ కానిస్టేబుల్ స్థాయిలో కోటి రూపాయలు డొనేషన్ చెల్లించే ఆదాయం ఆయనకు ఎక్కడిదన్న చర్చ జరుగుతోంది. ఉద్యోగుల వ్యక్తిగత ప్రవర్తనపై నివేదికలు, పాస్‌పోర్టుల విచారణ తదితర విషయాల్లో ముడుపులు దండుకుని భారీగా ఆర్జించాడన్న ఫిర్యాదులు వె ల్లువెత్తిన నేపథ్యంలో హోంగార్డు దాడి ఘటన వెలుగు చూడటంతో విచారణ వేగవంతమయ్యింది. -
నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి
సోమందేపల్లి : స్థానిక రంగనాయకులు కాంప్లెక్స్ (ఎన్టీఆర్ సర్కిల్) వద్ద ఉన్న ఓ నీటి తొట్టెలో పడి మనోజ్ కుమార్ (5) అనే బాలుడు మంగళవారం మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. కర్ణాటకలోని యాకర్లపల్లికు చెందిన రవి, సుభాషినమ్మ దంపతులకు మనోజ్ కుమారుడు. సుభాషినమ్మ చెల్లెలుకు పెళ్లి కుదరడంతో ఆమె భర్త, కుమారుడితో కలిసి సోమవారం పుట్టిళ్లయిన గుడ్డం నాగేపల్లికి వచ్చింది. పెళ్లి పనుల్లో భాగంగా ఇంటికి రంగు కొనేందుకు మంగళవారం సుభాషినమ్మ తన కుమారుడు మనోజ్‌కుమార్, సోదరుడు శ్రీకాంత్‌తో కలిసి సోమందేపల్లికు వచ్చింది. పెయింటింగ్స్ కొనుగోలు చేస్తుండగా మనోజ్ ఆడుకుంటూ దగ్గరలో ఉన్న నీటితొట్టెలో పడిపోయాడు. అయితే ఇది గమనించిన సుభాషినమ్మ, శ్రీకాంత్‌లు బాబును ఎవరో కిడ్నాప్ చేశారని భావించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయంత్రం వరకూ చిన్నారి కోసం వెదికినా ఆచూకీ లభ్యం కాలేదు. చివరికి స్థానికులు పెయింట్ షాప్‌కు దగ్గరలో ఉన్న ఓ నీటితొట్టెలో పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేయడంతో అక్కడ వెదికారు. అప్పటికే మనోజ్‌కుమార్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పెనుకొండ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రవి, సుభాషినమ్మ తమ కుమారుడు ఇక లేడని బోరున విలపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి తనకల్లు : మండల కేంద్రానికి చెందిన శ్రీలేఖ (17) అనే విద్యార్థిని అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. గంగన్న కుమార్తె శ్రీలేఖ కదిరి బ్లూమూన్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే త్వరలో జరగనున్న పబ్లిక్ పరీక్షల్లో తాను పాస్ అవుతానో లేదోనని తరచూ మదనపడుతూ ఉండేది. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి విషపూరిత ద్రావకం తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్సకు అనంతపురం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
నిందితుడి మాజీ భార్యతో ఈడీ అధికారి
న్యూఢిల్లీ: కోల్‌కతాలో పనిచేస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ అధికారి మనోజ్‌కుమార్, రోజ్‌వ్యాలీ చిట్‌ఫండ్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు గౌతమ్ కుందు మాజీ భార్య సుభ్రతో కలసి ఢిల్లీలోని ఓ హోటల్లో దిగుతున్నట్లున్న చూపుతున్న వీడియో సంచలనం రేపింది. దీంతో ఈడీ సదరు అధికారిని సస్పెండ్ చేసింది. ఆయన్ని అన్ని కేసుల నుంచి తప్పిస్తూ ఆయన పాత్రపై దర్యాప్తునకు ఆదేశించింది. అధికారి, మహిళ కలిసి ఉన్న వీడియోలను పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని వార్తా చానెళ్లు ప్రసారం చేశాయి. ప్రాసిక్యూషన్ ఫిర్యాదు సమర్పించేందుకే ఢిల్లీకి వెళ్లానని మనోజ్ కుమార్ తెలిపారు. సుభ్ర తనకు స్నేహితురాలని అందుకే ఆమెను తన వెంట తీసుకెళ్లినట్టు చెప్పారు. ‘నన్ను బాధితుడిని చేశారు. వ్యక్తిగత కక్షతోనే నాపై బురద చల్లుతున్నారు. ఉన్నతాధికారుల అనుమతితోనే ఢిల్లీ పర్యటనకు అధికారికంగా వెళ్లాన’ని మనోజ్ కుమార్ వాపోయారు. -
నేను పతకం సాధించేవాడ్ని..కానీ
న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత్‌లోని బాక్సింగ్ పరిపాలన వ్యవస్థ ఎంతమాత్రం ఆశాజనకంగా లేదని బాక్సర్ మనోజ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ బాకింగ్స్ అసోసియేషన్(ఐబా) భారత బాక్సింగ్‌ను నిషేధించడంతోనే తాను పతకం గెలవలేకపోయానని మనోజ్ పేర్కొన్నాడు. భారత బాక్సింగ్ వ్యవస్థ చాలా గందరగోళంగా ఉందని, ఆ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలన్నాడు. ఈ విషయంలో మోదీ చొరవ తీసుకుని భారత్‌లో బాక్సింగ్ క్రీడను బతికించాలంటూ విజ్ఞప్తి చేశాడు. రియో ఒలింపిక్స్ ప్రి కార్టర్ ఫైనల్లో తొలి రౌండ్ తనకు అనుకూలంగా కనిపించినా, ఆ రౌండ్ ఫలితంలో మాత్రం చాలా వ్యత్యాసం కనబడిందన్నాడు. రియోకు అర్హత సాధించడంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. నా వెనుక ఎవరూ నిలబడలేదు. అసలు ఒలింపిక్స్ పోటీ దారుడిగానే పరిగణించలేదు. దాంతో పాటు ఆర్ధికసాయం కూడా అందలేదు. భారత బాక్సింగ్‌ను బ్రతికించాల్సిన పరిస్థితి మోదిపై ఉంది'అని మనోజ్ తెలిపారు. 2012 డిసెంబర్ 6న తొలిసారిగా బాక్సింగ్ సమాఖ్యపై ఐబా తాత్కాలిక సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. -
మనోజ్ 'పంచ్' పడింది!
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్‌లో భారత బాక్సర్లు పతకంపై ఆశలు పెంచుతున్నారు. ఇప్పటికే బాక్సర్ వికాస్ కృష్ణన్ ప్రి క్వార్టర్స్‌కు చేరగా, తాజాగా మరో బాక్సర్ మనోజ్ కుమార్ కూడా ప్రి క్వార్టర్స్‌కు అర్హత సాధించాడు. గురువారం తెల్లవారుజామున జరిగిన బౌట్లో 64 కేజీల వెల్టర్ వెయిట్ విభాగంలో మనోజ్ కుమార్ 2-1 తేడాతో గత ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఎవాల్దాస్ పెట్రాస్కాస్(లూథియానా)పై విజయం సాధించాడు. మూడు రౌండ్ల పాటు జరిగిన పోరులో మనోజ్ కుమార్ పదునైన పంచ్‌లతో అదరగొట్టాడు. ప్రత్యేకంగా తొలి రెండు రౌండ్లలో పూర్తి ఆధిక్యం కనబరిచిన మనోజ్ కుమార్.. చివరి రౌండ్ లో ఎక్కువగా డిఫెన్స్‌కే పరిమితమయ్యాడు. దీంతో ముగ్గురు జడ్జిల నిర్ణయంలో కేవలం ఒక పాయింట్ ను (29-28, 29-28, 28-29) మాత్రమే చేజార్చుకుని తదుపరి రౌండ్లో అడుగుపెట్టాడు. రియో ఒలింపిక్స్‌లో ఆరంభంలోనే మన బాక్సర్లకు కఠినమైన డ్రా ఎదురైనప్పటికీ వారు అంచనాలు మించి రాణించడంతో భారత శిబిరంలో ఆనందం వెల్లివిరుస్తోంది. అంతకుముందు పురుషుల బాక్సింగ్ 75 కేజీల విభాగంలో భారత బాక్సర్ వికాస్ కృష్ణన్ ప్రి-క్వార్టర్స్‌కు చేరిన సంగతి తెలిసిందే. అమెరికన్ చార్లెస్ కాన్వెల్తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో 3-0తో వికాస్ గెలిచాడు. ఆరంభం నుంచే దూకుడుగా కనిపించిన వికాస్.. రైట్ స్ట్రయిట్స్, అప్పర్ కట్స్‌తో ప్రత్యర్థిని డిఫెన్స్‌లో పడేసి విజయాన్నికైవసం చేసుకున్నాడు. -
వికాస్, మనోజ్‌లకు రియో బెర్త్‌లు
బాకు: వికాస్ క్రిషన్ (75కేజీ), మనోజ్ కుమార్ (64కేజీ)లకు ఒలింపిక్ బెర్త్‌లు ఖరారయ్యాయి. ఐబా ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ క్వాలిఫయింగ్ టోర్నీలో వీరిద్దరు సెమీఫైనల్స్‌కు చేరారు. క్వార్టర్ ఫైనల్స్‌లో వికాస్ 3-0తో లీ డోంగ్యున్ (కొరియా)ను ఓడించగా.. మనోజ్ 3-0తో రఖిమోవ్ షవ్కట్జోన్ (తజకిస్తాన్)పై నెగ్గాడు. ప్రస్తుతం భారత్ నుంచి ఈ ఇద్దరితో పాటు శివథాపా రియోకు అర్హత సాధించాడు. 75 కేజీల విభాగంలో వికాస్ అర్హత సాధిచినందున... ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన విజేందర్కు ఇక రియో అవకాశం లేదు. -
క్వార్టర్ ఫైనల్లో వికాస్
బాకు (అజర్బైజాన్): ఆసియా క్రీడల మాజీ విజేత వికాస్ కృషన్ యాదవ్ ప్రపంచ క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన 75 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో వికాస్ 3-0తో క్వాచటాద్జె జాల్ (జార్జియా)పై గెలుపొందాడు. వికాస్‌తోపాటు మనోజ్ కుమార్ (64 కేజీలు), సుమిత్ సాంగ్వాన్ (81 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి చేరగా... దేవేంద్రో సింగ్ (49 కేజీలు) సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో గెలిస్తే మనోజ్, వికాస్, సుమిత్ రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. దేవేంద్రో సింగ్‌కు మాత్రం ఫైనల్‌కు చేరితేనే రియో బెర్త్ ఖాయమవుతుంది. -
క్వార్టర్స్‌లో మనోజ్, సుమిత్
బాకు(అజర్ బైజాన్):ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్ మనోజ్ కుమార్(64 కేజీలు) క్వార్టర్ ఫైనల్ కు చేరాడు. అతనితో పాటు మరో బాక్సర్ సుమిత్ సంగ్వాన్(81కేజీలు) కూడా క్వార్టర్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన ప్రిక్వార్టర్స్ లో మనోజ్ 2-1 తేడాతో ఇస్మీతోవ్ ఆరిన్(బల్గేరియా)పై విజయం సాధించగా, సుమిత్ 3-0 తేడాతో ఎర్డనీబాయర్(మంగోలియా)పై విజయం సాధించి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకున్నారు. దీంతో రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించడానికి ఒక అడుగు దూరంలో నిలిచారు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో వీరిద్దరూ తమ పోరులో విజయం సాధిస్తే రియోకు అర్హత సాధిస్తారు. మనోజ్ తన తదుపరి పోరులో రాఖిమోవ్(తజికిస్తాన్)తో తలపడనుండగా, రష్యాకు చెందిన ఖాముకోవ్తో సుమిత్ తలపడతాడు. -
క్వార్టర్స్‌లో దేవేంద్రో సింగ్
రెండో సీడ్‌పై మనోజ్ గెలుపు బాకు (అజర్బైజాన్): ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్ లైష్రామ్ దేవేంద్రో సింగ్ (49 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. మరోవైపు మనోజ్ కుమార్ (64 కేజీలు) రెండో సీడ్‌పై సంచలన విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీల తొలి రౌండ్లో ‘బై’ లభించిన దేవేంద్రో రెండో రౌండ్లో 3-0తో లియాండ్రో బ్లాంక్ (అర్జెంటీనా)ను ఓడిం చాడు. ఒలింపిక్ బెర్త్ దక్కించుకోవాలంటే అతను ఫైనల్‌కు చేరాల్సి ఉంటుంది. అటు మనోజ్ అద్భుత ప్రదర్శనతో రెండో సీడ్ మొహమ్మద్ ఇస్లాం అహ్మద్ అలీ (ఈజిప్టు)పై 3-0తో నెగ్గాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీ నుంచి దక్కే 39 ఒలింపిక్ బెర్త్‌ల కోసం 400 మంది బాక్సర్లు బరిలో ఉన్నారు. -
అత్యాచారం కేసును ఛేదించిన పోలీసులు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం గండిపేట్‌లో పదిహేను రోజుల క్రితం జరిగిన చోరీ, మైనర్‌పై అత్యాచారం కేసును నార్సింగి పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు పాల్పడ్డ ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. గండిపేటలోని అమృత ఆనందనిలయంలో ఉంటున్న మనోజ్ కుమార్ ఓ ప్రముఖ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో కలసి ఇంట్లో నిద్రిస్తుండగా ఇద్దరు ఆగంతకులు లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న రెండు విలువైన ల్యాప్‌టాప్‌లు, మూడు సెల్ఫోన్లు మూటగట్టుకున్నారు. వారి అలికిడికి మేల్కొన్న మనోజ్‌కుమార్ భార్య అక్క కూతురు (మైనర్)గట్టిగా అరవబోయింది. దీంతో అప్రమత్తమైన దుండగులు ఆమెను నోటిని గట్టిగా మూసి అక్కడికి నుంచి బయటకు ఎత్తుకుపోయి, అత్యాచారానికి పాల్పడ్డారు. కొద్దిసేపటి తర్వాత మేల్కొన్న మనోజ్‌కుమార్ బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా తలుపునకు వెలుపలి నుంచి గొళ్లెం పెట్టి ఉంది. దీంతో ఆయన గట్టిగా అరవటంతో చుట్టుపక్కల వారు వచ్చి తలుపు తీశారు. కనిపించకుండా పోయిన బాలిక కొద్దిసేపటి తర్వాత భయంతో వారి వద్దకు చేరుకుంది. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. దొంగతనానికి పాల్పడటంతోపాటు బాలికపై అత్యాచారం చేసిన బబ్లూ శర్మ, అరుణ్ శర్మ అనే వారిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. -
మనోజ్ కుమార్‌కు మరో ఏడు ప్రపంచ రికార్డులు
విజయనగరం కంటోన్మెంట్:కోరుకొండ సైనిక పాఠశాల పూర్వ విద్యార్థి మనోజ్‌కుమార్ గణితంలో తనకున్న అద్భుత మేధాశక్తితో ఏడు ప్రపంచ రికార్డులను సాధించి నెల గడవక ముందే మరో ఏడు రికార్డులను సాధించారని జేసీ-2 యూసీజీ నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆయన తన చాంబర్లో విద్యాశాఖ, ఇంటర్‌బోర్డు, డైట్, ఎస్ఎస్ఏ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా పౌరవేదిక, యూనిక్ వరల్డ్ రికార్డు సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 24న ఆనందగజపతి కళాక్షేత్రంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో మనోజ్ కుమార్ తన మేధా శక్తిని, ప్రపంచ రికార్డులను ప్రదర్శించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రదర్శన ద్వారా గణితంలో మెలకువలు, సులభంగా సమస్య పరిష్కారం తదితర అంశాలపై సూచనలు, సలహాలు అందిస్తారన్నారు. ఈ ప్రదర్శనకు గణిత మేధావులు, ఉపాధ్యాయులు, లెక్చరర్లు, విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులతో పాటు గణితంపై ఆసక్తి కలిగి ఉన్నవారంతా హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమం నిర్వహణపై సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు. సమావేశంలో డీఈఓ జి కృష్ణారావు, ఎస్ఎస్ఏ పీఓ లింగేశ్వరరెడ్డి, జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, ఇంటర్మీడియట్ బోర్డు, డైట్ సంస్థల అధికారులు, కోరుకొండ సైనిక్ స్కూల్ అధికారులు పాల్గొన్నారు. -
భారత బాక్సర్లకు నిరాశ
షియానాన్: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ టోర్నీలో భారత బాక్సర్లు తొలి రోజు నిరాశపరిచారు. తొలి రౌండ్లో ముగ్గురు బాక్సర్లు బరిలోకి దిగగా అందరికీ పరాజయాలే ఎదురయ్యాయి. మనోజ్ కుమార్ (64కేజీ) కజకిస్తాన్‌కు చెందిన జుస్సుపోవ్ అబ్లైఖాన్ చేతిలో; సుమిత్ సంగ్వాన్ (81కేజీ) హీగువాన్ యాంగ్ (కొరియా) చేతిలో ఓడారు. మహిళల 75కేజీ విభాగంలో పూజా రాణి తజికిస్తాన్‌కు చెందిన బాక్సర్ షోయిరా జుల్కనరోవా చేతిలో ఓటమి పాలైంది. -
దేశం మెచ్చిన నటుడు...
మనోజ్‌కుమార్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం సందర్భంగా... పదేళ్లుంటాయి.లాహోర్ నుంచి ఢిల్లీకి కాందశీకులుగా వచ్చి పడ్డారు. స్నేహితులు విడిపోయారు. బంధువులు విడిపోయారు. ఆ అందమైన నగరం విడిపోయింది. ఆటలూ పాటలూ... ఇక్కడ ఢిల్లీ హడ్సన్ లేన్‌లో శరణార్థి శిబిరంలో... ఎవరు ఏమిటో... ఎలా బతకాలో... అప్పుడే తల్లి ఒక మగశిశువుకు జన్మనిచ్చింది. బిడ్డకు ఆరోగ్యం బాగలేదు. తల్లికీ బాగలేదు. హాస్పిటల్లో చేర్చారు. కాని ఇంకా గొడవలు ఆగిపోలేదు. అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. పోలీస్ సైరన్ మోగినప్పుడల్లా రక్షణ కోసం డాక్టర్లు నర్సులు అండర్ గ్రౌండ్‌కు వెళ్లి దాక్కునేవారు. ఆ రోజు సైరన్ మోగింది. డాక్టర్లు నర్సులు పేషెంట్లను వదిలి పారిపోయారు. తల్లి వేదనతో డాక్టర్లను పిలుస్తోంది. ఆమె ఎందుకు పిలుస్తోందో ఆ పదేళ్ల పిల్లవాడికి అర్థం కావడం లేదు. మళ్లీ మళ్లీ పిలుస్తోంది. కాని ఎవరూ రావడం లేదు. మరి కాసేపటికి పొత్తిళ్లలో ఉన్న బిడ్డ అచేతనమైంది. పదేళ్ల వయసులో దేశం చేసిన గాయం ఇది.ఇది ఇలా ఎందుకు ఉంది? నా దేశం గొప్పది. ఆ గొప్పదనం నిలబెట్టేలాగే నేనూ ఈ దేశ ప్రజలూ ఉండాలి. అది ప్రేమే. అదొక్కటే ఉంది. అసలు పేరు హరికిషన్ గిరి గోస్వామి. కాని ‘మనోజ్ కుమార్’ అని ముందే నిర్ణయించుకున్నాడు. శరణార్థి శిబిరంలో పొద్దు పోక మొదటిసారి సినిమా చూశాడు. దాని పేరు ‘జుగ్ను’. దిలీప్ కుమార్ హీరో. ఆ తర్వాత మరో సినిమా చూశాడు. దాని పేరు ‘షబ్నమ్’. అందులో కూడా దిలీప్ కుమారే హీరో. పెద్దయ్యి నేను దిలీప్‌కుమార్ అవుతాను అనుకున్నాడు. పేరు కూడా డిసైడ్ చేసుకున్నాడు. మనోజ్ కుమార్. అది షబ్నమ్లో దిలీప్ ధరించిన పాత్ర పేరు. అందరూ సినిమాల మీద పిచ్చితో బొంబాయి పారిపోయి వస్తాడు. మనోజ్ కుమార్ తల్లిదండ్రుల అనుమతితో బొంబాయి వచ్చాడు. యాక్టర్ కావాలి. హీరో కావాలి. కల. కాని తల తిప్పి చూస్తే అలాంటి కలలు వేలాది ఉన్నాయి. భుజానికి రాసుకు పూసుకు తిరుగుతూ వడపావ్‌తో పొట్ట నింపుకుంటున్నాయి. మరి అవకాశాలు ఎలా వచ్చాయి? నిలబడటం నేర్చుకోవడం వల్ల. అవును... సినిమా టికెట్ల కోసం క్యూలో నిలబడటం నేర్చుకున్నాడు. సినిమా అవకాశాల కోసం స్టుడియో బయట నిలబడటం నేర్చుకున్నాడు. సినిమాల్లో అవకాశం వచ్చాక వాటిని నిలబెట్టుకోవడానికి డెరైక్టర్ ముందు నిలబడటం నేర్చుకున్నాడు. రాత్రిళ్లు ఎప్పుడైనా రూమ్‌కు వెళ్లే ట్రైన్ మిస్సైపోతే స్టేషన్లో తల దాచుకోవడానికి స్టేషన్ మాస్టర్ ముందు వినయంగా నిలబడటం నేర్చుకున్నాడు. వంగి వంగి నడిచేదా ఈ దేశ యువత? దీనికో వెన్ను ఉందని గుర్తు చేయాలి. కోపం లేదు. ఉన్నది ప్రేమే. యువతను తట్టి లేపాలి. ఆలోచించాడు. భగత్ సింగ్. అవును... భగత్ సింగ్ మీద సినిమా తీయాలి. అప్పటికి చిన్న నటుడే. పైగా అంతకు ముందు రెండు సినిమాలు భగత్ సింగ్ మీద తేస్తే బోల్తా కొట్టాయి. కాని తాను కంకణం కట్టుకున్నాడు. ప్రొడ్యూసర్ కూడా చావో రేవో అంటున్నాడు. కాని భగత్ సింగ్ గురించి సమాచారమే లేదు. పంజాబ్‌లో ఉన్న తల్లి దగ్గరకు వెళితే ఆశీర్వాదం దక్కింది. బంధువుల దగ్గరకు వెళితే ఛీత్కారమే ఎదురయింది. చివరకు తాను పుస్తకాల్లో ఏరుకున్న సమాచారం నుంచే మనోజ్ కుమార్ కథను రాసుకున్నాడు. అయితే అసలు సమస్యంతా లొకేషన్లో వచ్చింది. దర్శకుడిగా పెట్టుకున్న రామ్శర్మకు దర్శకత్వం రాదు. వచ్చన్నావ్? అంటే అనుకున్నాను అని సమాధానం ఇచ్చాడు. ఆ బరువు కూడా తనే నెత్తిన వేసుకున్నాడు. చివరకు షహీద్ విడుదల అయ్యింది. 1965... షహీద్ నామ సంవత్సరంగా నిలిచింది.పెద్ద హిట్. భగత్ సింగ్‌గా వేసిన ఆ నటుడు మనోజ్ కుమార్ పెద్ద హిట్. ఈ మాత్రం దేశభక్తిని చూపించే వాళ్లు ఏరి? మరో పొగడ్త కాచుకుని ఉంది. ఆ రోజు మనోజ్ కుమార్ ఫోన్ మోగింది. ‘మనోజ్ కుమార్?’ ‘ఎస్ సర్. మీరెవరు?’ ‘నేను లాల్ బహదూర్శాస్త్రిని. ఒకసారి టీ పుచ్చుకోవడానికి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్‌కు రాగలరా?’ షహీద్ చూసిన లాల్‌బహదూర్ శాస్త్రి మనోజ్ కుమార్‌ని ఒక కోరిక కోరారు. ‘జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని బలపరిచే సినిమా ఏదైనా తీయగలవా?’ ఒక ప్రధాని కోరిక. తన దేశం తన ప్రేమ ప్రకటనకు వీలైన కోరిక.ఒక మనిషికి ఎంతటి అంతర్గత శక్తి ఉంటుందనే దానికి ఈ ఉదంతమే ఉదాహరణ. ప్రోత్సహించే తోడు దొరికితే ఆ శక్తి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఢిల్లీ నుంచి బొంబాయి తిరుగు ప్రయాణానికి మనోజ్ కుమార్ రైలు ఎక్కాడు. తన బెర్త్ మీదకు చేరాక రాయడం మొదలుపెట్టాడు. ఏం స్టేషన్ వస్తోందో ఏం స్టేషన్ పోతోందో అనవసరం.రాస్తూనే ఉన్నాడు. బొంబాయి వచ్చేసరికి చేతిలో స్క్రిప్ట్ ఉంది.పేరు- ఉప్కార్. మేరే దేశ్ కి ధర్తీ ఉగలే సోనా మోతీ మేరే దేశ్ కి ధర్తీ... ‘ఉప్కార్’ పెద్ద హిట్. హీరో తనే. నిర్మాత తనే. దర్శకుడూ తనే. జనం విరగబడి చూశారు. ఎందుచేతనో వాళ్లకు అతణ్ణి మనోజ్ కుమార్ అని పిలవడం ఇష్టమనిపించలేదు. ఇంకా దగ్గరగా పిలిచుకోవాలి. ప్రేమగా పిలుచుకోవాలి. గౌరవంగా పిలుచుకోవాలి. ఎస్. మిస్టర్ భారత్. ఆ రోజు నుంచి మనోజ్ కుమార్ ముద్దు పేరు మిస్టర్ భారత్ అయ్యింది. కల్చర్‌ను అరువు తెచ్చుకోవడం సినిమా వాళ్ల పని.కాని కల్చర్‌ను ప్రశ్నించడం మనోజ్ కుమార్ పని.డెబ్బైల కాలం నాటికి వెర్రి తలలు వేస్తున్న పాశ్చాత్య సంస్కృతి వ్యామోహాన్ని ప్రశ్నించడానికి ఈ దేశ సంస్కారాన్ని గుర్తు చేయడానికి మనోజ్ కుమార్ సినిమా తీశాడు. పేరు ‘పూరబ్ ఔర్ పశ్చిమ్’. పెద్ద హిట్. ఈ దేశంలో పేరుకు పోయిన అవినీతి, బ్లాక్ మార్కెటింగ్, లంచాలు వీటిని ప్రశ్నిస్తూ... వీటి వల్ల రగిలిపోతున్న నిరుద్యోగ యువత గుండె మంటలను చూపిస్తూ మరో సినిమా తీశాడు. ‘రోటీ కప్డా ఔర్ మకాన్’. అదీ పెద్ద హిట్టే.పార్కులూ చెట్లు పుట్టలూ త్రికోణాకార ప్రేమలూ... వీటన్నింటి మధ్య ఎప్పుడూ మనోజ్ కుమార్ దేశం కోసం ఆలోచించే ఒక నిజమైన హీరోలా మిగిలాడు. ఒక్క మనిషిలో చిన్న మార్పు వచ్చినా అది జాతీయ జెండాను ఎగురవేయడం కంటే ఏమాత్రం తక్కువ కాదు. 1981. మనోజ్ కుమార్ జీవితంలో ఉత్తేజకరమైన సంవత్సరం. ఆ సంవత్సరమే ఎవరి పేరు పెట్టుకుని ఈ రంగంలోకి వచ్చాడో ఎవరి స్ఫూర్తితో నటన నేర్చుకున్నాడో ఎవరిని చూస్తూ కెరీర్‌ను నిర్మించుకున్నాడో ఆ హీరో- దిలీప్ కుమార్‌ను డెరైక్ట్ చేసే అవకాశం వచ్చింది. సినిమా- క్రాంతి. మనోజ్ కుమార్, శశి కపూర్, శతృఘ్న సిన్హా, హేమమాలిని... భారీ తారాగణం అంతా నటించింది. మరో శక్తివంతమైన దేశభక్తి సినిమా.సూపర్ డూపర్ హిట్. ఈ దేశానికి మనోజ్ ఎప్పుడూ అపకారం చేయలేదు. ఈ దేశం కూడా అతడికి ఎప్పుడూ అపకారం లేదు. ఒక రూపాయికి పది రూపాయలు ఇచ్చి అక్కున చేర్చుకుంది. మనోజ్ కుమార్ గొప్ప నటుడు అంటే కొందరికి అభ్యంతరం ఉండొచ్చు కాని అతడు గొప్ప రచయిత, గొప్ప దర్శకుడు అంటే మాత్రం అంగీకారం ఉంటుంది. దర్శకత్వంలో చాలామంది శిష్యులను తయారు చేశాడు. అమితాబ్ బచ్చన్‌కు ‘రోటీ కప్డా ఔర్ మకాన్’లో మంచి వేషం ఇచ్చి అతడు నిలదొక్కుకునేలా చేశాడు. కెరీర్ తొలిరోజుల్లో ఉండగా ధర్మేంద్ర ఒక దశలో వేషాలు రాక విసుగెత్తిపోయి సొంత ఊరికి వెళ్లడానికి సిద్ధమై పోతే తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బులు ఇచ్చి ఈ ఒక్క నెల ఆగు... అప్పుడు కూడా అవకాశం రాకపోతే వెళ్దువుగాని అని ఆపాడు. ఆ నెలే ధర్మేంద్రకు హీరో అవకాశం వచ్చింది. ఆ సంగతి ఇప్పటికీ ధర్మేంద్ర కృతజ్ఞతగా చెప్పుకుంటాడు. మిస్టర్ భారత్ అనే బిరుదు మనోజ్ కుమార్‌కు గొప్ప గౌరవమే. కాని దానిని నిలబెట్టుకోవడం ఒక్కోసారి భారమైంది కూడా. అతడు సిగరెట్ తాగుతున్నా వచ్చి అంత పెద్ద బిరుదు ఉన్నవాడివి నిర్బాధ్యతగా ఉంటావా అని మందలించేవారు ఎదురయ్యేవారు. సినిమాల్లో రొమాన్స్ చేయడానికి వీలయ్యేది కాదు. అల్లరి చిల్లరి వేషాలూ వేసే అవకాశం పోయింది. కాని మనోజ్ ఇవన్నీ ఇష్టంగానే స్వీకరించాడు. ఎందుకంటే ప్రపంచానికి ముద్దుబిడ్డ- భారత్. భారత్‌కు ముద్దు బిడ్డ- మిస్టర్ భారత్.జై భారత్. - నెటిజన్ కిశోర్ టాప్ టెన్ ఓ కౌన్ థీ 1964 షహీద్ 1965 హిమాలయ్ కి గోద్ మే 1965 గుమ్నామ్ 1965 దో బదన 1966 ఉప్కార్ 1967 పూరబ్ ఔర్ పశ్చిమ్ 1968 రోటీ కప్డా ఔర్ మకాన్ 1974 దస్ నంబరి 1976 క్రాంతి 1981 -
మనోజ్‌కుమార్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు!
ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత మనోజ్ కుమార్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోనున్నారు. హరియాలీ ఔర్ రాస్తా, ఓ కౌన్ థీ, హిమాలయా కీ గోద్ మే, రోటీ కపడా ఔర్ మకాన్, క్రాంతి వంటి సినిమాలతో మనోజ్ కుమార్ ఎంతో గుర్తింపును తెచ్చుకున్నారు. తన సినిమాల్లో మనోజ్ దేశభక్తిని ఎక్కువగా చూపించేవారు. దేశభక్తి సినిమాల విషయాన్ని తాము ఆయన నుంచే తాము నేర్చుకున్నామని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినందుకు ఆయనకు అభినందనలు చెప్పారు. 2015 సంవత్సరానికి గాను 47వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు మనోజ్‌కుమార్‌ను ఎంపిక చేసినట్లు ఎంఐబీ ఇండియా ఓ ట్వీట్ లో తెలిపింది. సినీ పరిశ్రమ అభివృద్ధికి అద్భుతకృషి చేసినందుకు, ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నందుకు భారత ప్రభుత్వం అందించే ఈ అవార్డుకు ఈ సారి మనోజ్ కుమార్ ఎంపికయ్యారు. ఉపకార్ సినిమాకి నేషనల్ ఫిల్మ్ అవార్డును అందుకున్న ఆయన.. 1992 లో భారత ప్రభుత్వం అందిచే పద్మశ్రీ పురస్కారాన్ని కూడా పొందారు. Congratulations Manoj Kumar Ji for DADA SAHEB PHALKE AWARD. Your films taught us what it means to love your country. Jai Ho.:) #Patriotism — Anupam Kher (@AnupamPkher) March 4, 2016 -
క్వార్టర్స్‌లో మనోజ్, మదన్‌లాల్
ఆసియా సీనియర్ బాక్సింగ్ బ్యాంకాక్: కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ మనోజ్ కుమార్ (64 కేజీలు) ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మనోజ్‌తోపాటు భారత్‌కే చెందిన మదన్ లాల్ (52 కేజీలు), కుల్దీప్ సింగ్ (81 కేజీలు) కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మనోజ్ 3-0తో దీపక్ శ్రేష్ట (నేపాల్)పై, మదన్ లాల్ 3-0తో ముర్తదా అల్ సుదాని (ఇరాక్)పై గెలుపొందగా... చైనా బాక్సర్ ఒలిన్ జాంగ్‌పై కుల్దీప్ విజయం సాధించాడు. ఇప్పటికే దేవేంద్రో సింగ్ (49 కేజీలు), శివ థాపా (56 కేజీలు), వికాస్ (75 కేజీలు), మన్‌ప్రీత్ (ప్లస్ 91 కేజీలు), సతీశ్ (91 కేజీలు) కూడా క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. తదుపరి బౌట్లలో గెలిచి సెమీఫైనల్‌కు చేరుకుంటే వీరందరికీ కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. -
మా వారి విడుదలకు జోక్యం చేసుకోండి
సుష్మా స్వరాజ్‌ను కోరిన నైజీరియా ఖైదీల కుటుంబసభ్యులు న్యూఢిల్లీ: నైజీరియాలో ఖైదీలుగా ఉన్న మహబూబ్‌నగర్‌కు చెందిన మనోజ్ కుమార్ సహా మరో 11 మంది విడుదలకు జోక్యం చేసుకోవాలని బాధితుల కుటుంబసభ్యులు విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌ను కోరారు. మనోజ్‌కుమార్ తండ్రి దశరథ్‌తో పాటు బాధిత ఖైదీల కుటుంబసభ్యులు మంగళవారం మంత్రిని కలసి వినతి పత్రం అందజేశారు. ఏడాది నుంచి తమవారిని నైజీరియా జైలులో బంధించారని, వారిని విడుదల చేయించి తమకు అప్పచెప్పాలని విన్నవించారు. అక్టోబర్ 12న అక్కడి న్యాయస్థానంలో కేసు విచారణ జరగనుందని, అప్పటి వరకు ఎలాంటి ప్రక్రియ చేయలేమని సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. కోర్టు తీర్పుననుసరించి తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు దశరథ్ పేర్కొన్నారు. ఖైదీలకు వైద్యం, ఇతరత్రా ఖర్చులు, న్యాయసలహాలను నైజీరియాలోని భారత రాయబార కార్యాలయం చూసుకుంటోందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని మంత్రి చెప్పినట్లు వివరించారు -
'నా కుమారుడ్ని విడిపించండి'
ఢిల్లీ: నైజీరియా దేశంలో చెరలో ఉన్న తన కొడుకు మనోజ్ కుమార్ ను విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ తండ్రి దశరథ్ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ కు విన్నవించాడు. ఈ మేరకు మంగళవారం సుష్మాను కలిసి ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై సుష్మ స్పందిస్తూ.. అక్టోబర్ 12 వ తేదీన నైజీరియి కోర్టు ఉత్తర్వులు ఆధారంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నైజీరియా చెరలో మనోజ్ తో పాటు మరో 11 మంది భారతీయులు క్షేమంగా ఉన్నట్లు ఈ సందర్భంగా సుష్మ తెలిపారు. ఇటీవల నైజీరియా అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించాడని మనోజ్ ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
నా పేరు మనోజ్...మీకు తెలుసా కపిల్!
మాజీ క్రికెటర్‌పై బాక్సర్ ధ్వజం‘అర్జున’ స్వీకరించిన మనోజ్ న్యూఢిల్లీ: భారత మేటి బాక్సర్ మనోజ్ కుమార్ ఎట్టకేలకు ప్రతిష్టాత్మక ‘అర్జున’ అవార్డును స్వీకరించాడు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ ఈ హరియాణా బాక్సర్‌కు పురస్కారాన్ని అందజేశారు. తనను అవార్డుకు ఎంపిక చేయకపోవడంతో పాటు నువ్వు ఎవరో నాకు తెలీదన్న కమిటీ చైర్మన్ కపిల్దేవ్పై ఈ సందర్భంగా ధ్వజమెత్తాడు. ‘ఈ రోజు కపిల్‌కు ఒక మాట చెప్పదల్చుకున్నా. నా పేరు మనోజ్ కుమార్. కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్‌ను’ అని వ్యాఖ్యానించాడు. తాను సాధించిన విజయాలకు సులువుగా రావాల్సిన అవార్డును ఎంతో కష్టపడి సాధించుకోవాల్సి వచ్చిందని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘నా ఘనతలను బట్టి చూస్తే ఈ అవార్డుకు నేను అర్హుడిని. డోపింగ్ విషయంలో ఎవరో నాపై వ్యతిరేక ఆరోపణలు చేశారు. అయితే అదంతా అబద్ధం. అర్జున జాబితా నుంచి నా పేరు తొలగించి కాంస్యం గెలిచిన వారికి అవార్డు ఇస్తున్నారని కపిల్‌కు గుర్తు చేశా. అయితే ఇలాంటి విషయాలు నాతో మాట్లాడొద్దని ఆయన ఫోన్ కట్ చేశారు’ అని మనోజ్ వెల్లడించాడు. -
క్వార్టర్స్‌లో మనోజ్ కుమార్
గ్లాస్గో: భారత బాక్సర్ మనోజ్ కుమార్ కామన్వెల్త్ గేమ్స్ పురుషుల లైట్ వెల్టర్ (64 కేజీలు) విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆదివారం జరిగిన ప్రి క్వార్టర్స్ పోరులో మనోజ్ 2-1తో కెనడా బాక్సర్ ఆర్థర్ బియూర్స్లనోవ్పై గెలిచాడు. వుంగళవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో వునోజ్.. ఇంగ్లండ్ బాక్సర్ శావుూ్యల్ వూక్స్వెల్తో తలపడనున్నాడు. సెమీస్‌కు పూవమ్మ: వుహిళల 400 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ పూవవ్ము వుచ్చెత్తిరా సెమీస్‌కు అర్హత సాధించింది. తొలి రౌండ్ హీట్-1లో పూవమ్మ 54.01 సెకన్లలో పరుగు పూర్తి చేసి వుూడో స్థానంలో నిలిచింది. వురో భారత స్ప్రింటర్ శ్రద్ధ నారాయణ 100 మీటర్ల పరుగులో సెమీస్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. తొలి రౌండ్ హీట్-3లో పోటీపడ్డ ఎనిమిది వుంది అథ్లెట్లలో శ్రద్ధ ఐదో స్థానం(11.81 సెకన్లు)లో నిలిచింది. ఫైనల్‌కు ఓం ప్రకాశ్: పురుషుల షాట్‌పుట్‌లో ఓం ప్రకాష్‌సింగ్ కర్హానా ఫైనల్‌కు అర్హత సాధించాడు. క్వాలిఫరుుంగ్ గ్రూప్ ‘బి’లో ప్రకాశ్ సింగ్ గుండును 18.98 మీటర్ల దూరం విసిరి ఓవరాల్‌గా ఎనిమిదో స్థానంతో ఫైనల్‌కు చేరాడు.భారత్ హాకీ జట్టుకు తొలి ఓటమి: కావున్వెల్త్ క్రీడల వుహిళల హాకీలో భారత జట్టు తొలి పరాజయూన్ని చవిచూసింది. ఆదివారం పూల్ ‘ఎ’లో జరిగిన ప్రిలిమినరీ వ్యూచ్‌లో భారత్ 0-3తో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. -
టిక్కెట్టు లేకుండా సినిమా!!
సినిమాకు వెళ్లి, టిక్కెట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే ఎంచక్కా చూస్తే ఎలా ఉంటుంది? దొంగదారిలో వెళ్దామనుకుంటున్నారా.. అక్కర్లేదు. ఓ మళయాళ నిర్మాత చేస్తున్న ప్రయత్నం ఫలిస్తే భవిష్యత్తులో చాలావరకు సినిమాలను ఉచితంగానే చూడొచ్చు. కనీసం మొదటి వారం వరకైనా కూడా సినిమాను ఉచితంగా ప్రేక్షకులకు అందించాలని ఆ నిర్మాత ప్రయత్నం చేస్తున్నారు. ఎస్.వినోద్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన 'టెస్ట్ పేపర్' అనే సినిమాను ఇలా ఉచితంగా అందించాలని ఆ సినిమా నిర్మాత మనోజ్ కుమార్ భావిస్తున్నారు. అయితే, ఇది ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో మాత్రమే. ముందుగా థియేటర్ల వద్ద ఇచ్చే ఉచిత పాస్‌లు తీసుకుని ఈ సినిమాకు వెళ్లాలి. సినిమా ప్రదర్శనకు అయ్యే ఖర్చులను ప్రకటనల ద్వారా రాబడతామని నిర్మాత మనోజ్ కుమార్ చెప్పారు. ఇంతకుముందు టీవీ సీరియళ్లు, కార్యక్రమాలు రూపొందించామని, కానీ సినిమాను ఇలా స్పాన్సర్ చేయించడం మాత్రం భారతీయ సినిమా చరిత్రలోనే తొలిసారి అవుతుందని ఆయన అన్నారు. పెద్దపెద్ద బ్రాండ్ల కంటే స్థానిక ప్రకటనల మీదే తాము దృష్టి పెట్టామన్నారు. సీరియళ్లలో అయితే ఎప్పుడు పడితే అప్పుడే మధ్యలో ప్రకటనలు వస్తాయి. కానీ సినిమాలో మాత్రం అలా కాకుండా, మొదట్లోను, ఇంటర్వెల్ సమయంలోను మాత్రమే ప్రకటనలు ఇస్తారు. టెస్ట్ పేపర్ సినిమాలో జగదీష్, నందు, మున్నా, మహాలక్ష్మి లాంటి ప్రముఖ నటులున్నారు. -
అనుమానాస్పద స్థితిలో వైద్యురాలు మృతి
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : మంచిర్యాలలో వైద్యురాలు నవ్య(26) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఉదయం బాత్రూంలో విగతజీవిగా కనిపించింది. వివరాలిలా ఉన్నాయి. స్థానిక రేడియాలజిస్టు రాంబాబు కూతురు నవ్యకు పెద్దపల్లికి చెందిన జనరల్ ఫీజిషియన్ మనోజ్‌కుమార్‌తో 2009 ఆగస్టు 8న వివాహం జరిగింది. నవ్య గైనకాలజిస్టుగా పట్టభద్రురాలు కావడంతో మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో నిత్య నర్సింగ్‌హోం తెరిచారు. ఆమె ఏడాదిపాటు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేసింది. పీజీ చేయడానికి శిక్షణ పొందుతూ ఈ నెల చివరి వారంలో పరీక్షకు సిద్ధమవుతోంది. వీరికి ఏడాదిన్నర వయసు ఉన్న కుమారుడు లక్కీ ఉన్నాడు. వారం క్రితమే కుటుంబ సభ్యులు కలిసి తిరుపతికి వెళ్లొచ్చారు. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం బాత్రూం నుంచి బయటకు రాకపోవడంతో లోపలికి వెళ్లి చూడగా చలనం లేకుండా పడి ఉందని భర్త మనోజ్‌కుమార్ తెలిపాడు. ఎన్ని గంటలకు చనిపోయిందనేది చెప్పడం లేదు. దీంతో మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నవ్య మృతదేహాన్ని బెల్లంపల్లి చౌరస్తాలోని తన తండ్రి రాంబాబు నివాసానికి తరలించారు. మృతురాలి భర్త, అతడి తల్లిదండ్రులు రావడంతో నవ్య కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నవ్యను పొట్టన పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బయటకు పంపించారు పోలీసుల విచారణ రాంబాబు ఫిర్యాదు మేరకు ఇన్చార్జి సీఐ కరుణాకర్, ఎస్సై వెంకటేశ్వర్లు, తహశీల్దార్ రవీందర్ విచారణ చేపట్టారు. నవ్య పడక గదిని పరిశీలించారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుందా..? లేక భర్తే హత్య చేసాడా..? సహజ మరణమా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా నవ్య భర్త అనుకుని ఫణికుమార్ అనే వైద్యుడిని పోలీసులు జీపులో పోలీస్‌స్టేషన్‌కు తరలించాలని యత్నించడం కొద్దిసేపు వివాదానికి దారి తీసింది. ఉదయం ఆస్పత్రులు బంద్ నవ్య మరణంతో ఉదయం ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిపివేశారు. వైద్యులు రమణ, అన్నపూర్ణ, మల్లేశ్, రమేశ్‌బాబు, నర్సయ్య, రాజగోపాల్, బద్రి నారాయణ, నాగమల్లేశ్వర్రావు, పురపాలక సంఘం మాజీ చైర్మన్ రాచకొండ కృష్ణారావు ఆమె మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. -
ప్రిక్వార్టర్స్‌లో మనోజ్, మన్‌ప్రీత్
అల్మాటీ (కజకిస్థాన్): ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు మనోజ్ కుమార్ (64 కేజీలు), మన్‌ప్రీత్‌సింగ్ (91 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. వీళ్లిద్దరూ తొలి రౌండ్ బైతో నేరుగా శుక్రవారం జరిగిన రెండో రౌండ్ బౌట్లో పోటీపడ్డారు. ఇందులో ఆసియా క్రీడల రజత పతక విజేత మన్‌ప్రీత్ 3-0తో సీషెల్స్‌కు చెందిన కెడ్డీ అగ్నెస్‌పై గెలుపొందాడు. మూడు రౌండ్లలోనూ ఆధిపత్యాన్ని చాటిన భారత బాక్సర్ 30-27, 30-27, 30-27తో ప్రత్యర్థిపై విజయం సాధించాడు. మరో పోటీలో మనోజ్ 2-1తో ఫేతీ కెలెస్ (టర్కీ)పై చెమటోడ్చి నెగ్గాడు. కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్, ఆరో సీడ్ మనోజ్ 28-29, 29-28, 29-28తో కెలెస్‌ను మట్టికరిపించాడు. ప్రిక్వార్టర్స్‌లో 28 ఏళ్ల మన్‌ప్రీత్... ప్రపంచ నంబర్‌వన్ తైముర్ మమదోవ్ (అజార్బైజాన్)తో తలపడనుండగా, వెస్ వులైస్ (కెనడా)తో మనోజ్ పోటీపడతాడు. ఈ రెండు మ్యాచ్‌లు సోమవారం జరుగుతాయి. శనివారం జరిగే బౌట్లలో విజేందర్ (75 కేజీలు)... జాసన్ క్విగ్లే (ఐర్లాండ్)తో, నానో సింగ్ (49 కేజీలు)... అఖిల్ అహ్మద్ (స్కాట్లాండ్)తో, 56 కేజీల కేటగిరీలో మరియో ఫెర్నాండెజ్ (ఫిలిప్పీన్స్)తో శివ థాపా, కరిమొవ్ (తజకిస్థాన్)తో సతీష్ (ప్లస్ 91 కేజీలు) తలపడతారు. -
టీటీపై దాడిచేసిన నటుడి అరెస్టు
తమిళ సినిమా, న్యూస్‌లైన్: రైల్వే టికెట్ కలెక్టర్‌పై దాడిచేసిన మలయాళ నటుడు మనోజ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకెళితే కేరళలోని పత్రణ తిట్టా ప్రాంతానికి చెందిన నటుడు మనోజ్ కుమార్. ఈయన గాంధేయన్, సూర్యవనం తదితర మలయాళ చిత్రాల్లో నటించారు. దర్శకుడు ప్రవీణ్ దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రంలో నటించడానికి మనోజ్‌కుమార్ చెన్నై వచ్చారు. ఆదివారం రాత్రి ఈయన చెన్నై నుంచి త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్‌లో కేరళకు పయనమయ్యారు. రైలు సేలం దాటిన తరువాత నటుడు మనోజ్ కుమార్ ఉన్న కంపార్ట్మెంట్లోకి రిజర్వేషన్ చేసుకోని ప్రయాణికులు ఎక్కారు. దీంతో మనోజ్ కుమార్ వారిపై మండి పడ్డారు. ఇదే విషయం గురించి టికెట్ కలెక్టర్ కృష్ణమూర్తి ప్రశ్నించారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. సహనం కోల్పోయిన నటుడు మనోజ్ కుమార్ టికెట్ కలెక్టర్‌పై దాడి చేశారు. దీంతో టిక్కెట్ కలెక్టర్ కృష్ణమూర్తి ఈరోడ్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నటుడు మనోజ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. నటుడు మనోజ్ కుమార్ కూడా టికెట్ కలెక్టర్, మరో ఐదుగురు తనను కొట్టినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.