
క్వార్టర్ ఫైనల్లో వికాస్
బాకు (అజర్‌బైజాన్): ఆసియా క్రీడల మాజీ విజేత వికాస్ కృషన్ యాదవ్ ప్రపంచ క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన 75 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో వికాస్ 3-0తో క్వాచటాద్జె జాల్ (జార్జియా)పై గెలుపొందాడు.
వికాస్‌తోపాటు మనోజ్ కుమార్ (64 కేజీలు), సుమిత్ సాంగ్వాన్ (81 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి చేరగా... దేవేంద్రో సింగ్ (49 కేజీలు) సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో గెలిస్తే మనోజ్, వికాస్, సుమిత్ రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. దేవేంద్రో సింగ్‌కు మాత్రం ఫైనల్‌కు చేరితేనే రియో బెర్త్ ఖాయమవుతుంది.