మనోజ్‌కుమార్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు!
ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత మనోజ్ కుమార్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోనున్నారు. హరియాలీ ఔర్ రాస్తా, ఓ కౌన్ థీ, హిమాలయా కీ గోద్ మే, రోటీ కపడా ఔర్ మకాన్, క్రాంతి వంటి సినిమాలతో మనోజ్ కుమార్ ఎంతో గుర్తింపును తెచ్చుకున్నారు. తన సినిమాల్లో మనోజ్ దేశభక్తిని ఎక్కువగా చూపించేవారు. దేశభక్తి సినిమాల విషయాన్ని తాము ఆయన నుంచే తాము నేర్చుకున్నామని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినందుకు ఆయనకు అభినందనలు చెప్పారు.
2015 సంవత్సరానికి గాను 47వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు మనోజ్‌కుమార్‌ను ఎంపిక చేసినట్లు ఎంఐబీ ఇండియా ఓ ట్వీట్ లో తెలిపింది. సినీ పరిశ్రమ అభివృద్ధికి అద్భుతకృషి చేసినందుకు, ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నందుకు భారత ప్రభుత్వం అందించే ఈ అవార్డుకు ఈ సారి మనోజ్ కుమార్ ఎంపికయ్యారు. ఉపకార్ సినిమాకి నేషనల్ ఫిల్మ్ అవార్డును అందుకున్న ఆయన.. 1992 లో భారత ప్రభుత్వం అందిచే పద్మశ్రీ పురస్కారాన్ని కూడా పొందారు.
Congratulations Manoj Kumar Ji for DADA SAHEB PHALKE AWARD. Your films taught us what it means to love your country. Jai Ho.:) #Patriotism
— Anupam Kher (@AnupamPkher) March 4, 2016