నిందితుడి మాజీ భార్యతో ఈడీ అధికారి | Enforcement Directorate officer spotted with Kundu’s wife | Sakshi
Sakshi News home page

నిందితుడి మాజీ భార్యతో ఈడీ అధికారి

Published Wed, Feb 1 2017 9:59 AM | Last Updated on Thu, Sep 27 2018 5:09 PM

నిందితుడి మాజీ భార్యతో ఈడీ అధికారి - Sakshi

నిందితుడి మాజీ భార్యతో ఈడీ అధికారి

న్యూఢిల్లీ: కోల్‌కతాలో పనిచేస్తున్న ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ అధికారి మనోజ్‌కుమార్, రోజ్‌వ్యాలీ చిట్‌ఫండ్‌ కుంభకోణంలో ప్రధాన నిందితుడు గౌతమ్‌ కుందు మాజీ భార్య సుభ్రతో కలసి ఢిల్లీలోని ఓ హోటల్లో దిగుతున్నట్లున్న చూపుతున్న వీడియో సంచలనం రేపింది. దీంతో ఈడీ సదరు అధికారిని సస్పెండ్‌ చేసింది. ఆయన్ని అన్ని కేసుల నుంచి తప్పిస్తూ ఆయన పాత్రపై దర్యాప్తునకు ఆదేశించింది. అధికారి, మహిళ కలిసి ఉన్న వీడియోలను పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని వార్తా చానెళ్లు ప్రసారం చేశాయి.

ప్రాసిక్యూషన్ ఫిర్యాదు సమర్పించేందుకే ఢిల్లీకి వెళ్లానని మనోజ్ కుమార్ తెలిపారు. సుభ్ర తనకు స్నేహితురాలని అందుకే ఆమెను తన వెంట తీసుకెళ్లినట్టు చెప్పారు. ‘నన్ను బాధితుడిని చేశారు. వ్యక్తిగత కక్షతోనే నాపై బురద చల్లుతున్నారు. ఉన్నతాధికారుల అనుమతితోనే ఢిల్లీ పర్యటనకు అధికారికంగా వెళ్లాన’ని మనోజ్ కుమార్ వాపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement