Rose Valley scam
-
షారూక్ ఖాన్ కేకేఆర్ జప్తు!
న్యూఢిల్లీ: రోజ్‌వ్యాలీ స్కామ్‌పై విచారణలో భాగంగా రూ.70 కోట్ల విలువైన మూడు ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం ప్రకటించింది. బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్‌కు చెందిన కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పోర్ట్స్ లిమిటెడ్ (కేకేఆర్)తోపాటు మల్టిపుల్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, సెయింట్ జేవియర్స్ కాలేజ్‌లు జప్తు అయిన ఆస్తుల్లో ఉన్నట్లు ఈడీ తెలిపింది. జప్తు అయిన మూడు ఆస్తుల తాలూకు ఖాతాల్లో దాదాపు 16.20 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని, ఇందులో రూ.11.87 కోట్లు షారూక్ ఖాన్‌కు చెందిన కోల్‌కతా నైట్ రైడర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌దని వివరించారు. ఐపీఎల్ క్రికెట్ టీమ్ యాజమాన్య కంపెనీలో షారూక్‌ఖాన్, ఆయన భార్య గౌరీ ఖాన్, సినీనటి జూహీ చావ్లా భర్త జై మెహతా సీఈవో వెంకటేష్ మైసూర్‌లతోపాటు మరో ఇద్దరు డైరెక్టర్లుగా ఉన్నారు. కేసుకు సంబంధించి మైసూర్‌ను గత అక్టోబరులో ఈడీ ప్రశ్నించిన విషయం తెల్సిందే. -
సుప్రీం కోర్టులో విజయం మాదే.. కాదు మాదే
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రం, బెంగాల్ గవర్నమెంట్ల మధ్య మొదలైన పంచాయతీ సుప్రీం కోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. శారదా, రోజ్‌వ్యాలీ చిట్‌ఫండ్ కుంభకోణాలకు సంబంధించి కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను అదుపులోకి తీసుకోవాలనుకున్న సీబీఐని బెంగాల్ పోలీసులు ఆదివారం అడ్డుకున్నారు. కోర్టు అనుమతి లేకుండా సీబీఐ దౌర్జన్యం చేస్తోందని ఆరోపిస్తూ ‘రాజ్యాంగ పరిరక్షణ’ పేరుతో సీఎం మమతా బెనర్జీ నిరసన దీక్ష కూడా చేస్తున్నారు. రాజీవ్ కుమార్‌ను విచారించేందుకు అనుమతించాలంటూ సీబీఐ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టును మంగళవారం విచారించింది. సీబీఐ ఎదుట కోల్‌కతా కమిషనర్ హాజరు కావాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. (బెంగాల్ ‘యుద్ధం’) ఈ తీర్పుతో ‘దీదీకి గట్టి షాక్ తగిలింది. విజయం మాదే’ అని ఎన్డీయే పక్షాలు వ్యాఖ్యానిస్తుండగా.. దీదీ మాత్రం నైతిక విజయం మాదేనంటూ సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. సీబీఐ విచారణను తామెప్పుడూ అడ్డుకోలేదని.. అది వ్యవహరించిన తీరును మాత్రమే వ్యతిరేకించామని చెప్తున్నారు. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారారని విమర్శలు గుప్పిస్తున్నారు. మోదీ ప్రభుత్వంపైనే తమ యుద్ధమని ఉద్ఘాటించారు. విపక్ష నేతలతో చర్చించాకే దీక్ష విరమణపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. (రెండో రోజుకు మమత ధర్నా) -
రెండో రోజుకు మమత ధర్నా
కోల్‌కతా/న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి, సీబీఐకి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ ఆదివారం చేపట్టిన ధర్నా కొనసాగుతోంది. ఈ అంశంపై దేశవ్యాప్తంగా సోమవారం రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. ఇన్నాళ్లూ అటు ఎన్డీయే, ఇటు యూపీఏలకు సమ దూరంలో ఉన్న బీజేడీతోపాటు అనేక విపక్ష పార్టీలు ఈ అంశంలో మమతకు మద్దతు పలికాయి. పార్లమెంటు ఉభయ సభలు కూడా ఇదే అంశంపై దద్దరిల్లాయి. అటు శారదా, రోజ్‌వ్యాలీ చిట్‌ఫండ్ కుంభకోణాలకు సంబంధించిన ఆధారాల ధ్వంసం అంశంపై కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను విచారించే విషయమై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును మంగళవారం సుప్రీంకోర్టు విచారించనుంది. మరోవైపు రాజీవ్ కుమార్‌ను ప్రశ్నించాలన్న సీబీఐ ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ బెంగాల్ ప్రభుత్వం కలకత్తా హైకోర్టును ఆశ్రయించగా, కేసును అత్యవసరంగా విచారించేందుకు కోర్టు నిరాకరించింది. కాగా, నియంతల నుంచి రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడేందుకే తాను ధర్నాకు దిగానని మమత పేర్కొన్నారు. బెంగాల్లో జరుగుతున్నవి కనీవినీ ఎరుగని దురదృష్టకర ఘటనలనీ, రాజ్యాంగం అక్కడ విఫలమైందనేలా ఇవి ఉన్నాయని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో అన్నారు. రాజ్యాంగం ప్రకారం దేశంలోని ఏ భాగంలోనైనా సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూసే అధికారం కేంద్రానికే ఉందని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠిని రాజ్‌నాథ్ నివేదిక కోరారు. కోల్‌కతాలోని రాజ్‌భవన్ నివేదికను వెంటనే పంపించినప్పటికీ అందులో ఏం ఉందనే వివరాలు వెల్లడి కాలేదు. ఆదివారం నాటి ఘటనల్లో బెంగాల్లో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారులు ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి ప్రవర్తించారా అనే విషయంపై కేంద్ర హోం శాఖ విచారణ జరుపుతుందని హోం శాఖ అధికారులు చెప్పారు. రాజీవ్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు ఆదివారం ఆయన ఇంటికి వెళ్లగా బెంగాల్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించడం, కేంద్రం తనపై కక్షగట్టి సీబీఐని పంపిందంటూ మమత ధర్నాకు దిగారు. ధర్నా రాజకీయపరమైనది కాదు∙ సీబీఐకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను రాజకీయేతర ధర్నా చేస్తున్నాననీ, అయితే రాజకీయ పక్షాల మద్దతును తాను స్వాగతిస్తున్నానని మమత చెప్పారు. టీఎంసీ కార్యకర్తలు కొన్నిచోట్ల రైళ్లను అడ్డుకున్నారని తెలిసి, ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా శాంతియుతంగా నిరసనలు తెలపాలని ఆమె కోరారు. ‘ఇది రాజకీయ కార్యక్రమం కాదు. కానీ అన్ని రాజకీయ పార్టీలూ నిరసనలో పాల్గొనచ్చు. ఆయా పార్టీల మద్దతును నేను స్వాగతిస్తున్నా’ అని చెప్పారు. బెంగాల్లో తిరుగుబాటును తెచ్చేందుకు మోదీ, అమిత్ కుట్రపన్నుతున్నారని ఆమె ఆరోపించారు. ‘దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే లక్ష్యంతో చేపట్టిన దీక్ష ఇది. శుక్రవారం వరకు దీక్ష కొనసాగిస్తా’ అని అన్నారు. టీఎంసీ కార్యకర్తలు, మద్దతుదారులు బెంగాల్లో పలుచోట్ల ప్రధాని మోదీ, అమిత్ షాల దిష్టిబొమ్మలను దగ్ధంచేశారు. ధర్నాకు కూర్చున్న చోటు నుంచే మమత సోమవారం అధికారిక విధులు నిర్వర్తించారు. అక్కడే ఒక కార్యక్రమంలో ప్రస్తుత వివాదానికి కేంద్ర బిందువుగా మారిన రాజీవ్ పాల్గొనడం గమనార్హం. సోమవారం బెంగాల్ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు మంత్రివర్గ సమావేశాన్ని మమత తాను ధర్నాకు దిగిన చోటే నిర్వహించారు. రాజ్యాంగానికి, దేశానికి రక్షణ లభించేవరకు ధర్నాను కొనసాగిస్తానని తొలుత చెప్పిన మమత.. అనంతరం విద్యార్థులకు పరీక్షలు ఉన్నందున వారికి ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతో ఫిబ్రవరి 8 వరకే ఈ ధర్నా చేయాలని నిర్ణయించామన్నారు. మమతకు మద్దతుగా నేతలు బీజేడీ సహా అనేక విపక్షాలు మమత ధర్నాకు సంఘీభావం ప్రకటించాయి. మాజీ ప్రధాని దేవెగౌడ బెంగళూరులో మాట్లాడుతూ కేంద్రం వైఖరి చూస్తుంటే తనకు అత్యయిక స్థితి నాటి రోజులు గుర్తొచ్చాయన్నారు. ఆమెకు తమ పార్టీ మద్దతు తెలుపుతోందని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తెలిపారు. ప్రతిపక్షాలను నాశనం చేసి నిరంకుశ పాలన సాగించేందుకు కేంద్రం సీబీఐని ఉపయోగించుకుంటోందని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తదితరులు మమతకు మద్దతు ప్రకటించారు. సీబీఐ నుంచి తప్పించుకునేందుకే సీబీఐ కేసుల నుంచి తనను తాను కాపాడుకునేందుకే మమత ధర్నాకు దిగారని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ అన్నారు. ‘ఇది మోదీ ఎమర్జెన్సీ కాదు, బెంగాల్లో మమత ఎమర్జెన్సీ. దీనిపై మేం పోరాడతామని టీఎంసీని హెచ్చరిస్తున్నాం. నాటి ప్రధాని ఇందిర ఎమర్జెన్సీ విధించినప్పుడు మేం ఆమెపై పోరాడి ఓడించాం. టీఎంసీనీ ఓడిస్తాం. సీబీఐ నుంచి తనను కాపాడుకునేందుకే ఆమె ధర్నా చేపడుతున్నారు’ అని జవడేకర్ అన్నారు. అమిత్ షా, స్మృతీ ఇరానీ, యోగి ఆదిత్యనాథ్‌ల హెలికాప్టర్లు బెంగాల్లో దిగేందుకు మమత అనుమతి ఇవ్వలేదనీ, ఇది ప్రజాస్వామ్యమేనా అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు మమత వర్సెస్ కేంద్రం అంశంపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ స్పందిస్తూ లోక్‌సభ ఎన్నికల ప్రకటన వచ్చేలోపు ఏదైనా జరగొచ్చని అన్నారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు మార్గదర్శకాల వల్ల గతంలోలాగ ఎప్పుడు పడితే అప్పుడు రాష్ట్రపతి పాలన విధించడం కుదరదనీ, మమత సర్కారును కూల్చే అవకాశం మోదీ ప్రభుత్వానికి లేదన్నారు. నిజమైతే తీవ్ర చర్యలు: సుప్రీం శారదా చిట్ ఫండ్ కుంభకోణానికి సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలను కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ నాశనం చేశారంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం అత్యవసరంగా విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఆధారాలను ధ్వంసం చేయడంలో ఆయన పాత్ర ఇసుమంతైనా ఉందని తేలితే తీవ్ర చర్యలుంటాయని న్యాయమూర్తులు పేర్కొన్నారు. కోల్‌కతాలో సీబీఐకి వ్యతిరేకంగా బెంగాల్ పోలీస్ ఉన్నతాధికారులు కూడా ధర్నాలో పాల్గొంటున్న అసాధారణ పరిస్థితి నెలకొందని పిటిషన్లో సీబీఐ పేర్కొంది. రాజీవ్ కుమార్‌పై సీబీఐ చేసిన ఆరోపణలతో కూడిన దరఖాస్తును సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం ముందుంచారు. మధ్యాహ్నమే కేసును విచారించాలని మెహతా కోరినప్పటికీ కోర్టు తిరస్కరించింది. ‘ఆధారాలను నాశనం చేయడంలో పోలీస్ కమిషనర్ పాత్ర ఏ కొంచెం ఉందని తెలిసినా ఆయనపై తీవ్ర చర్యలుంటాయి’ అని జడ్జీలు అన్నారు. కేసుకు సంబంధించిన అన్ని పత్రాలు, ఆధారాలను కోర్టుకు అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఆదేశించారు. రాజీవ్‌ను సీబీఐ ప్రశ్నించకుండా అడ్డుకునేందుకు బెంగాల్ ప్రభుత్వం కలకత్తా హైకోర్టులో వేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణ జరిపేందుకు హైకోర్టు నిరాకరించింది. మంగళవారమే ఈ కేసును విచారిస్తామంది. పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో జస్టిస్ శివకాంత ప్రసాద్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలీసు అధికారులపై నోటీసులకు సంబంధించిన చర్యలపై హైకోర్టు స్టే విధించినప్పటికీ రాజీవ్ ఇంట్లోకి ప్రవేశించేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నించారని బెంగాల్ ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ కిశోర్ దత్తా కోర్టుకు తెలిపారు. 2017లోనే నోటీసులు పంపించాం: సీబీఐ శారద స్కామ్‌ను విచారించిన బెంగాల్ పోలీసు విభాగనికి చెందిన సిట్ సభ్యులకు 2017 సెప్టెంబర్, 2018 డిసెంబర్ మధ్య దాదాపు 20 నోటీసులను జారీ చేశామని సీబీఐ వెల్లడించింది. వారిలో కోల్‌కతా ప్రస్తుత కమిషనర్ రాజీవ్ కుమార్ కూడా ఉన్నారని తెలిపింది. నోటీసులకు స్పందన లేనందువల్లనే విచారణ నిమిత్తం ఆయన నివాసానికి రావాల్సి వచ్చిందని పేర్కొంది. 2014లోనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించామని, అయితే, తమ వద్ద ఉన్న సాక్ష్యాధారాలను ఇవ్వకుండా సిట్ అధికారులు ఇబ్బందులకు గురి చేశారని ఒక సీబీఐ అధికారి తెలిపారు. అత్యుత్సాహం వెనుక.. మమత వ్యవహరిస్తున్న తీరు తమను దిగ్భ్రాంతికి గురి చేసిందిన శారద స్కామ్ బాధితులు వాపోతున్నారు. విచారణ జరపకుండా సీబీఐని అడ్డుకోవడం తమను మోసం చేయడమేనన్నారు. ఇది వాస్తవాలను దాచే ప్రయత్నమని చిట్‌ఫండ్ సఫరర్స్ ఫోరం కన్వీనర్ అసిమ్ చటర్జీ పేర్కొన్నారు. కాగా, ఈ అంశంలో మమత వ్యవహరిస్తున్న తీరుపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ధర్నా కేంద్రం తీరుకు నిరసనగానే అని మమత చెబుతున్నా.. శారద స్కామ్‌కు సంబంధించి విచారణ ఎప్పుడో ప్రారంభమైందని, గతంలోనూ అనేక అరెస్ట్‌లు జరిగాయని పలువురు గుర్తు చేస్తున్నారు. అప్పుడు స్పందించకుండా.. ఇప్పుడే ఈ స్థాయిలో ఘర్షణకు దిగడమేంటని ప్రశ్నిస్తున్నారు. మమత చేస్తున్న హంగామా వెనుక వేరే ఉద్దేశాలున్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్కామ్‌ను విచారించిన సిట్‌కు నేతృత్వం వహించిన, ప్రస్తుత కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ నివాసంలోని లాకర్లో కీలకమైన ఆధారాలున్నాయని, అందువల్లనే స్పందన ఈ స్థాయిలో ఉందని వెల్లడించాయి. ధర్నా వేదికపై సీఎం మమతా బెనర్జీ. పక్కన కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ -
కోల్‌కతాలో ‘దీదీ’గిరి!
కోల్‌కతా: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కారు మధ్య కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం తారాస్థాయికి చేరింది. చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో ఆదివారం కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను విచారించేందుకు వెళ్లిన సీబీఐ అధికారుల్ని బెంగాల్ పోలీసులు అడ్డుకుని నిర్బంధంలోకి తీసుకోవడం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. దీంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆధీనంలో పనిచేస్తున్న రెండు పోలీసు విభాగాల మధ్య కనీవినీ ఎరుగని రీతిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. సెర్చ్ వారెంట్ లేకుండానే పోలీస్ కమిషనర్ ఇంటికి వెళ్లడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మమతా బెనర్జీ.. మోదీ, షా చేతుల్లో తనకు అవమానం జరిగిందని పేర్కొంటూ కోల్‌కతాలో పేరొందిన మెట్రో సినిమాకు ఎదురుగా రాత్రి ధర్నాకు దిగారు. అయితే సీబీఐ అధికారుల అరెస్ట్‌పై భిన్న కథనాలు వినిపించాయి. తమ అధికారుల్ని బలవంతంగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని సీబీఐ ఆరోపిం చగా, సీనియర్ పోలీసు అధికారి ఒకరు ఖండిం చారు. పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్‌ను విచారించేందుకు తగిన పత్రాలు ఉన్నాయో? లేదో? పరిశీలించేందుకే వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లామని వివరణ ఇచ్చారు. దెబ్బకు దెబ్బ అన్నట్లు ఆ తరువాత బెంగాల్ పోలీసుల బృందం ఒకటి కోల్‌కతాలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లి తమ అదుపులోకి తీసుకుంది. కనిపించకుండా పోయారని వార్తలు వచ్చిన రాజీవ్‌కుమార్ తాజా ఘటనతో మళ్లీ ప్రత్యక్షమయ్యారు. రాజీవ్‌కుమార్‌ను విచారించేందుకు బెంగాల్ ప్రభుత్వం నుంచి అనుమతి ఇప్పించా లని కోరుతూ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సీబీఐ తెలిపింది. శారద చిట్‌ఫండ్, రోజ్‌వ్యా లీ పోంజి పథకాలకు సంబంధించి రాజీవ్‌కుమార్ విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నారని సీబీఐ ప్రకటించిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇదే అదనుగా బీజే పీ, తృణమూల్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. బెంగాల్లో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రపన్నుతోందని తృణమూల్ ఆరోపించగా, రాజ్యాంగ సమగ్రత, విలువల్ని మమత ప్రభుత్వం ఎగతాళి చేస్తోందని బీజేపీ ఎదురు దాడి చేసింది. డ్రామా కొనసాగిందిలా.. కోల్‌కతాలో లౌడాన్ వీధిలోని రాజీవ్‌కుమార్ నివాసానికి సుమారు 40 మంది సీబీఐ అధికారులు చేరుకున్నాక కనీవినీ ఎరుగని హైడ్రామా మొదలైంది. వారు లోనికి వెళ్లకుండా అక్కడి భద్రతా సిబ్బంది, అధికారులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు..రాజీవ్‌కుమార్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారుల వద్ద అవసరమైన పత్రాలు ఉన్నాయా? లేదా? అని వాకబు చేయడం ప్రారంభించారు. ఆ తరువాత కొందరు అధికారుల్ని షేక్స్పియర్ సరాని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆ వెంటనే రాజీవ్‌కుమార్ నివాసానికి మరికొందరు సీబీఐ అధికారులు రావడంతో కొంత గందరగోళం నెలకొంది. వారిలో కొందరిని పోలీసులు బలవంతంగా జీపులో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. విచారణ ముగిశాక సీబీఐ అధికారుల్ని వదిలిపెట్టినట్లు జాయింట్ పోలీస్ కమిషనర్ (క్రైం) ప్రవీణ్ త్రిపాఠి చెప్పారు. రహస్య ఆపరేషన్ నిమిత్తం కోల్‌కతాకు వచ్చామని వారు చెప్పారని, అది ఏ రకమైన ఆపరేషనో తమకు తెలియదని వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఉద్రిక్తతను నివారించడానికి కోల్‌కతా సీబీఐ కార్యాలయం వద్దకు కేంద్ర బలగాలు చేరుకున్నాయి. సీబీఐ దాడులు ఊహించాం: మమతా బెనర్జీ రాజీవ్‌కుమార్ నివాసం బయట హడావుడిగా మీడియా సమావేశం నిర్వహించిన మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. మోదీ ఆదేశాల మేరకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రాజకీయ ప్రత్యర్థులపైకి సీబీఐని పంపుతున్నారని దుయ్యబట్టారు. ‘చేతులకు రక్తపు మరకలు అంటుకున్న అలాంటి ప్రధానితో మాట్లాడటానికి సిగ్గుగా ఉంది. జనవరి 19న విపక్షాలతో విజయవంతంగా ర్యాలీ నిర్వహించడంతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు మోదీ, షా ప్రయత్నిస్తున్నారు. ర్యాలీ తరువాత సీబీఐతో దాడులు చేయిస్తారని మాకు తెలుసు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చిట్‌ఫండ్ కంపెనీల యజమానుల్ని అరెస్ట్ చేసింది. ఈ వ్యవహారంలో సిట్‌ను ఏర్పాటుచేసి దర్యాప్తు చేసింది మేమే’ అని మమతా బెనర్జీ అన్నారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు విపక్షాలన్నీ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని పరిహసించారు: బీజేపీ కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను సీబీఐ ప్రశ్నించకుండా పోలీసులు అడ్డుకోవడంపై బీజేపీ మండిపడింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల్ని పరిహాసానికి గురిచేస్తోందని ఆరోపించింది. ఈ వైఖరి మమతా బెనర్జీ నిరంకుశత్వాన్ని సూచిస్తోందని తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ చిట్‌ఫండ్ కుంభకోణాలపై విచారణ జరుపుతోందని, కోల్‌కతా పోలీసుల చర్య అత్యున్నత న్యాయస్థానం పట్ల అవిధేయత కనబరచడమేనని పేర్కొంది. బెంగాల్లో శాంతి, భద్రతలు పూర్తిగా దారితప్పాయని విమర్శించింది. మమతకు విపక్షాల బాసట.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, సీబీఐ మధ్య ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో మమతా బెనర్జీకి విపక్ష నాయకులు సంఘీభావం ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా ఆమెకు ఫోన్‌చేసి మద్దతు తెలిపారు. విపక్షాలంతా ఒకే పక్షమని, వచ్చే ఎన్నికల్లో ఫాసిస్ట్ శక్తుల్ని ఓడిస్తామని రాహుల్ అన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలు, సమాఖ్య స్ఫూర్తికి మోదీ తూట్లుపొడిచారని కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి మోదీ–షా ద్వయం ప్రమాదకరమని, బెంగాల్లో సీబీఐ చర్యను ఖండించాలని అన్నారు. సీబీఐ నోటీసులకు స్పందించని కమిషనర్ శారదా, రోజ్‌వ్యాలీ కుంభకోణాల కేసుల్ని విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి రాజీవ్‌కుమార్ నేతృత్వం వహించారు. ఈ కేసులకు సంబంధించి గల్లంతయిన కొన్ని పత్రాల విషయమై ఆయనని విచారించాల్సి ఉందని సీబీఐ ప్రకటించింది. తమ ముందు హాజరుకావాలని సీబీఐ పలు నోటీసులు పంపినా స్పందించలేదు. లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష జరిపేందుకు ఇటీవల ఎన్నికల సంఘం కోల్‌కతాలో పర్యటించగా, ఆ కార్యక్రమానికి రాజీవ్‌కుమార్ హాజరుకాలేదు. అయితే రాజీవ్‌కుమార్ విధులకు దూరంగా ఉంటున్నారని వచ్చిన వార్తల్ని కోల్‌కతా పోలీసులు కొట్టిపారేశారు. ఆయన కోల్‌కతాలోనే ఉన్నారని, రోజూవారీ విధులకు హాజరువుతున్నారని ప్రకటన విడుదల చేశారు. సీబీఐ అధికారిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు -
కోల్‌కతా పోలీస్ బాస్ అదృశ్యం
న్యూఢిల్లీ: కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ కనిపించకుండా పోయారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన రోజ్ వ్యాలీ, శ్రద్ధా పోంజి భారీ కుంభకోణాలపై దర్యాప్తునకు గతంలో రాజీవ్‌కుమార్ నేతృత్వం వహించారు. అనంతరం 2014లో సుప్రీంకోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. ఆ కుంభకోణాలకు సంబంధించిన పలు కీలక పత్రాలు కనిపించకుండా పోయినట్లు గుర్తించింది. వాటి కోసం పలుమార్లు ఆయనకు నోటీసులు జారీ చేసినా స్పందించ లేదు. రాజీవ్ సెల్ఫోన్సహా ఏ ఇతర నంబర్ పనిచేయట్లేదు. ఈ పరిస్థితుల్లో ఆయన్ను అరెస్టు చేయడం తప్ప తమకు మరో మార్గం లేదని సీబీఐ వర్గాలు అంటున్నాయి. -
నిందితుడి మాజీ భార్యతో ఈడీ అధికారి
న్యూఢిల్లీ: కోల్‌కతాలో పనిచేస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ అధికారి మనోజ్‌కుమార్, రోజ్‌వ్యాలీ చిట్‌ఫండ్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు గౌతమ్ కుందు మాజీ భార్య సుభ్రతో కలసి ఢిల్లీలోని ఓ హోటల్లో దిగుతున్నట్లున్న చూపుతున్న వీడియో సంచలనం రేపింది. దీంతో ఈడీ సదరు అధికారిని సస్పెండ్ చేసింది. ఆయన్ని అన్ని కేసుల నుంచి తప్పిస్తూ ఆయన పాత్రపై దర్యాప్తునకు ఆదేశించింది. అధికారి, మహిళ కలిసి ఉన్న వీడియోలను పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని వార్తా చానెళ్లు ప్రసారం చేశాయి. ప్రాసిక్యూషన్ ఫిర్యాదు సమర్పించేందుకే ఢిల్లీకి వెళ్లానని మనోజ్ కుమార్ తెలిపారు. సుభ్ర తనకు స్నేహితురాలని అందుకే ఆమెను తన వెంట తీసుకెళ్లినట్టు చెప్పారు. ‘నన్ను బాధితుడిని చేశారు. వ్యక్తిగత కక్షతోనే నాపై బురద చల్లుతున్నారు. ఉన్నతాధికారుల అనుమతితోనే ఢిల్లీ పర్యటనకు అధికారికంగా వెళ్లాన’ని మనోజ్ కుమార్ వాపోయారు. -
మమతా బెనర్జీకి కేంద్రం మరో షాక్
-
మమతా బెనర్జీకి కేంద్రం మరో షాక్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమాల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. వారం రోజుల వ్యవధిలో ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలను సీబీఐ అరెస్ట్ చేసింది. మంగళవారం రోజ్ వాలీ చిట్ ఫండ్ కుంభకోణంలో టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇటీవల సమన్లు జారీ చేసిన సీబీఐ ఈ రోజు సుదీప్‌ను విచారించిన అనంతరం అదుపులోకి తీసుకుంది. డిసెంబర్ 30న ఇదే కేసులో టీఎంసీకే చెందిన ఎంపీ తపస్ పాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రోజ్ వ్యాలీ కంపెనీలో తపస్ పాల్ డైరెక్టర్‌గా ఉన్నారు. 17 వేల కోట్ల రూపాయల మేరకు వేలాది మందిని మోసం చేసినట్టు రోజ్ వ్యాలీపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై మమతా బెనర్జీ స్పందిస్తూ.. ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున కేంద్రం సీబీఐని అడ్డుపెట్టుకుని తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.