కోల్‌కతా పోలీస్‌ బాస్‌ అదృశ్యం | kolkata Police Commissioner Rajeev Kumar missing | Sakshi
Sakshi News home page

కోల్‌కతా పోలీస్‌ బాస్‌ అదృశ్యం

Published Sun, Feb 3 2019 4:52 AM | Last Updated on Sun, Feb 3 2019 4:52 AM

kolkata Police Commissioner Rajeev Kumar missing - Sakshi

కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌

న్యూఢిల్లీ: కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ కనిపించకుండా పోయారు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన రోజ్‌ వ్యాలీ, శ్రద్ధా పోంజి భారీ కుంభకోణాలపై దర్యాప్తునకు గతంలో రాజీవ్‌కుమార్‌ నేతృత్వం వహించారు. అనంతరం 2014లో సుప్రీంకోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. ఆ కుంభకోణాలకు సంబంధించిన పలు కీలక పత్రాలు కనిపించకుండా పోయినట్లు గుర్తించింది. వాటి కోసం పలుమార్లు ఆయనకు నోటీసులు జారీ చేసినా స్పందించ లేదు. రాజీవ్‌ సెల్‌ఫోన్‌సహా ఏ ఇతర నంబర్‌ పనిచేయట్లేదు. ఈ పరిస్థితుల్లో ఆయన్ను అరెస్టు చేయడం తప్ప తమకు మరో మార్గం లేదని సీబీఐ వర్గాలు అంటున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement