క్వార్టర్స్లో మనోజ్, సుమిత్ | boxers Manoj, Sumit inch closer to Oly berth, enter QFs of Qualifiers | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్లో మనోజ్, సుమిత్

Published Tue, Jun 21 2016 7:37 PM | Last Updated on Mon, Sep 4 2017 3:02 AM

boxers Manoj, Sumit inch closer to Oly berth, enter QFs of Qualifiers

బాకు(అజర్ బైజాన్):ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్ మనోజ్ కుమార్(64 కేజీలు) క్వార్టర్ ఫైనల్ కు చేరాడు. అతనితో పాటు మరో బాక్సర్ సుమిత్ సంగ్వాన్(81కేజీలు) కూడా క్వార్టర్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన ప్రిక్వార్టర్స్ లో మనోజ్ 2-1 తేడాతో ఇస్మీతోవ్ ఆరిన్(బల్గేరియా)పై విజయం సాధించగా, సుమిత్ 3-0 తేడాతో ఎర్డనీబాయర్(మంగోలియా)పై విజయం సాధించి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకున్నారు.

 

దీంతో రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించడానికి ఒక అడుగు దూరంలో నిలిచారు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో వీరిద్దరూ తమ పోరులో విజయం సాధిస్తే రియోకు అర్హత సాధిస్తారు. మనోజ్ తన తదుపరి పోరులో రాఖిమోవ్(తజికిస్తాన్)తో తలపడనుండగా, రష్యాకు చెందిన ఖాముకోవ్తో సుమిత్ తలపడతాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement