నా పేరు మనోజ్...మీకు తెలుసా కపిల్! | I can tell Kapil I am a CWG gold winner: Manoj Kumar | Sakshi
Sakshi News home page

నా పేరు మనోజ్...మీకు తెలుసా కపిల్!

Published Thu, Nov 27 2014 8:58 AM | Last Updated on Mon, Aug 20 2018 4:12 PM

నా పేరు మనోజ్...మీకు తెలుసా కపిల్! - Sakshi

నా పేరు మనోజ్...మీకు తెలుసా కపిల్!

మాజీ క్రికెటర్‌పై బాక్సర్ ధ్వజం‘అర్జున’ స్వీకరించిన మనోజ్
 
న్యూఢిల్లీ: భారత మేటి బాక్సర్ మనోజ్ కుమార్ ఎట్టకేలకు ప్రతిష్టాత్మక ‘అర్జున’ అవార్డును స్వీకరించాడు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ ఈ హరియాణా బాక్సర్‌కు పురస్కారాన్ని అందజేశారు. తనను అవార్డుకు ఎంపిక చేయకపోవడంతో పాటు నువ్వు ఎవరో నాకు తెలీదన్న కమిటీ చైర్మన్ కపిల్‌దేవ్‌పై ఈ సందర్భంగా ధ్వజమెత్తాడు. ‘ఈ రోజు కపిల్‌కు ఒక మాట చెప్పదల్చుకున్నా. నా పేరు మనోజ్ కుమార్. కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్‌ను’ అని వ్యాఖ్యానించాడు.

తాను సాధించిన విజయాలకు సులువుగా రావాల్సిన అవార్డును ఎంతో కష్టపడి సాధించుకోవాల్సి వచ్చిందని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘నా ఘనతలను బట్టి చూస్తే ఈ అవార్డుకు నేను అర్హుడిని. డోపింగ్ విషయంలో ఎవరో నాపై వ్యతిరేక ఆరోపణలు చేశారు. అయితే అదంతా అబద్ధం. అర్జున జాబితా నుంచి నా పేరు తొలగించి కాంస్యం గెలిచిన వారికి అవార్డు ఇస్తున్నారని కపిల్‌కు గుర్తు చేశా. అయితే ఇలాంటి విషయాలు నాతో మాట్లాడొద్దని ఆయన ఫోన్ కట్ చేశారు’ అని మనోజ్ వెల్లడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement