టీటీపై దాడిచేసిన నటుడి అరెస్టు | Attack on railway TT: Actor arrested | Sakshi
Sakshi News home page

టీటీపై దాడిచేసిన నటుడి అరెస్టు

Published Tue, Aug 27 2013 3:52 AM | Last Updated on Fri, Sep 1 2017 10:08 PM

Attack on railway TT: Actor arrested

తమిళ సినిమా, న్యూస్‌లైన్: రైల్వే టికెట్ కలెక్టర్‌పై దాడిచేసిన మలయాళ నటుడు మనోజ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకెళితే కేరళలోని పత్రణ తిట్టా ప్రాంతానికి చెందిన నటుడు మనోజ్ కుమార్. ఈయన గాంధేయన్, సూర్యవనం తదితర మలయాళ చిత్రాల్లో నటించారు. దర్శకుడు ప్రవీణ్ దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రంలో నటించడానికి మనోజ్‌కుమార్ చెన్నై వచ్చారు. 
 
ఆదివారం రాత్రి ఈయన చెన్నై నుంచి త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్‌లో కేరళకు పయనమయ్యారు. రైలు సేలం దాటిన తరువాత నటుడు మనోజ్ కుమార్ ఉన్న కంపార్ట్‌మెంట్‌లోకి రిజర్వేషన్ చేసుకోని ప్రయాణికులు ఎక్కారు. దీంతో మనోజ్ కుమార్ వారిపై మండి పడ్డారు. ఇదే విషయం గురించి టికెట్ కలెక్టర్ కృష్ణమూర్తి ప్రశ్నించారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది.
 
సహనం కోల్పోయిన నటుడు మనోజ్ కుమార్ టికెట్ కలెక్టర్‌పై దాడి చేశారు. దీంతో టిక్కెట్ కలెక్టర్ కృష్ణమూర్తి ఈరోడ్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నటుడు మనోజ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. నటుడు మనోజ్ కుమార్ కూడా టికెట్ కలెక్టర్, మరో ఐదుగురు తనను కొట్టినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement