
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ పెద్ద కూతురు ఖతీజా రెహజాన్ వివాహం వైభవంగా జరిగింది. రియాస్దీన్ షేక్ మహమ్మద్ అనే సౌండ్ ఇంజనీర్‌తో మే5న ఆమె పెళ్లి జరిగింది. రియాస్దీన్ తెల్లటి షేర్వానీలో కనిపించగా, ఖతీజా ప్రింటెడ్ ఆఫ్-వైట్ దుస్తుల్లో ముస్తాబైంది.
దీనికి సంబంధించిన ఫోటోను స్వయంగా ఖతీజా షేర్ చేస్తూ.. మనసుకు నచ్చిన వ్యక్తితో పెళ్లి జరిగింది. ఈరోజు కోసం ఎంతో ఎదురుచూశాను అంటూ పోస్ట్ చేసింది. రెహమాన్ కూడా నూతన జంటను దీవించాలంటూ ఫోటోను షేర్ చేశారు. దీంతో పలువురు ప్రముఖులు సహా నెటిజన్ల నుంచి కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment