
AR Rahman Daughter Khatija Engaged With Riyasdeen: ఏఆర్ రెహమాన్ అంటే తెలియని వారెవరూ ఉండరు. అత్యంత అరుదైన ఆస్కార్ అవార్డును గెలుచుకున్న మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్. ఎన్నో చిత్రాలకు సంగీతం అందించిన ఆయన సంగీత ప్రేమికుల్ని అలరిస్తున్నారు. అయితే ఇటీవల ఏఆర్ రెహమాన్ ఇంట శుభకార్యం జరిగింది. ఆయన పెద్ద కుమార్తె ఖతీజా రెహమాన్‌కు ఎంగేజ్‌మెంట్ జరిగింది. రియా సిద్దీన్ షేక్ మహమ్మద్ అనే వ్యక్తితో డిసెంబర్ 29న నిశ్చితార్థం చైన్నైలో జరిగినట‍్లు సమాచారం. ఈ విషయాన్ని ఖతీజా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
ఇన్ స్టాలో ఖతీజా పోస్ట్ చేసిన ఎంగేజ్‌మెంట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె పెళ్లి చేసుకునే వ్యక్తి ఇంజినీర్, ఎంటర్ ప్రెన్యూర్ అని తెలుస్తోంది. అయితే వివాహం ముహుర్తం ఇంకా నిర్ణయించలేదని సమాచారం. కరోనా, ఒమిక్రాన్ కేసుల పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిశ్చితార్థ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారట. ఏఆర్ రెహమాన్‌కు ఖతీజా, రహీమా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.