fastest car
-
ప్రపంచంలో వేగవంతమైన కారు ఇదే!.. లాంచ్ ఎప్పుడంటే?
అమెరికన్ కార్ల తయారీ సంస్థ 'టెస్లా' ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కారును లాంచ్ చేయడానికి సిద్ధమైపోయింది. టెస్లా రోడ్‌స్టర్ (Tesla Roadster) పేరుతో కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కారు 0 నుంచి 60 కిమీ/గం వేగాన్ని సెకను కంటే తక్కువ వ్యవధిలోనే చేరుకుంటుందని సమాచారం.ఈ కారు గురించి టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్' (Elon Musk) కొన్ని వివరాలను వెల్లడిస్తూ.. ఇది 2024 చివరి నాటికి లేదా 2025 ప్రారంభంలో మార్కెట్లో లాంచ్ అవుతుందని పేర్కొన్నారు. ఈ కారుని టెస్లా, స్పేస్ఎక్స్ సహకారంతో తయారు చేస్తున్నట్లు వెల్లడించారు.Tonight, we radically increased the design goals for the new Tesla Roadster.There will never be another car like this, if you could even call it a car.— Elon Musk (@elonmusk) February 28, 2024టెస్లా లాంచ్ చేయనున్న ఈ కొత్త కారు అత్యంత ఆకర్షణీయమైన కారుగా పేర్కొన్నారు. ఈ కారు డిజైన్ మాత్రమే కాకుండా, ఫీచర్స్ కూడా చాలా వరకు అప్డేట్ పొందినట్లు తెలుస్తోంది. ఇది 4 సీట్లు కలిగిన ఎలక్ట్రిక్ కారు. దీని గురించి మస్క్ 2017లోనే వెల్లడించారు.కంపెనీ టెస్లా రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ కారు కోసం ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఈ కారును బుక్ చేసుకోవాలనుంటే 50000 డాలర్ల టోకెన్ మొత్తాన్ని వెచ్చించి బుక్ చేసుకోవచ్చు. నిజానికి 2021లో లాంచ్ కావలసిన ఈ కారు 2024 చివరి నాటికి లాంచ్ అవుతుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: భారత యాప్స్‌పై గూగుల్ కన్నెర్ర.. ప్లేస్టోర్‌లో అవి మాయం!0-60mph < 1 secAnd that is the least interesting part— Elon Musk (@elonmusk) February 28, 2024 -
లగ్జరీ కారు కొన్న కుమార్తెలు: గర్ల్ పవర్ అంటున్న మ్యూజిక్ డైరెక్టర్
సాక్షి, ముంబై: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ కుమార్తెలు రతీజా రెహమాన్, రహీమా రెహమాన్ ఫాస్టెస్ట్, లగ్జరీ కారును కొనుగోలు చేశారు. పోర్షే టైకాన్ కారు కొన్న విషయాన్ని స్వయంగా రెహమాన్ ట్విటర్లో వెల్లడించారు. యువ నిర్మాతలు, కూల్ మెటావర్స్ ప్రాజెక్ట్ లీడర్స్ రతీజా, రహీమా (ఏఆర్ఆర్ స్టూడియోస్) కారు కొన్నందుకు ముఖ్యంగా కాలుష్య రహిత కార్‌ను ఎంచుకోవడంపై సోషల్ మీడియాలో సంతోషం ప్రకటించారు. అంతేకాదు ‘గర్ల్ పవర్’ అంటూ గర్వాన్ని ప్రకటించారు. “ARR స్టూడియోస్” పేరుతో ఉన్న ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును, పక్కనే ఖతీజా , రహీమా నిలబడి ఉన్న బ్యూటిఫుల్ పిక్‌ను షేర్ చేశారు. జర్మన్ స్పోర్ట్స్ కార్కు చెందిన, జెంటియన్ బ్లూ మెటాలిక్ కలర్లో మెరిసిపోతున్న పోర్షే టైకాన్ ధర రూ. 1.53 కోట్ల నుంచి రూ. 2.34 కోట్లు. ఉంటుంది. జర్మన్ స్పోర్ట్స్ కార్ తయారీదారు Taycan EV టాప్-స్పీడ్‌ను 260Kmphకి పరిమితం చేసింది.ఈ కారు కేవలం 2.8 సెకండ్ల వ్యవధిలోనే 0-100 kmph వేగాన్ని అందుకోగలదు. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కార్లలో పోర్షే టైకాన్ ఒకటి. ఈ ఖరీదైన లగ్జరీ స్పోర్ట్స్ కారుకు భారతదేశంలో డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా అనేక మంది యువ పారిశ్రామికవేత్తలు దీనిపై మనసు పారేసుకుంటున్నారు. 2021లో భారతదేశంలో పోర్షే టైకాన్‌ను లాంచ్ చేసింది. Taycan RWD, Taycan 4S, Taycan Turbo మరియు Taycan Turbo Sin ఉన్నాయి. Our young producers of #ARRstudios spearheading cool #Metaverse projects @RahmanKhatija #RaheemaRahman. Have chosen to go green with the #electriccar. Be the change you want to see. #bosswomen #girlpower #gogreen pic.twitter.com/i8TFUZULF9 — A.R.Rahman (@arrahman) November 23, 2022 -
అత్యంత శక్తివంతమైన, వేగంగా దూసుకెళ్లే కారు..! ఆస్టన్ మార్టిన్‌లో ఇదే చిట్ట చివరి కారు..!
బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త 2022 వీ12 వాంటేజ్ కారును లాంచ్ చేసింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో పెట్రోల్‌తో నడిచే వాహనాల్లో ఇదే చిట్టచివరి స్పోర్ట్స్ కారు. సంప్రదాయ ఇంధన వాహనాల తయారీకు ఆస్టన్ మార్టిన్ గుడ్‌బై చెప్పనుంది. 2025 లేదా 2026లో తొలి ఎలక్ట్రిక్ కారును ఆస్టన్ మార్టిన్ తీసుకురానున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. టఫ్ డిజైన్..అదిరే ఫీచర్స్‌తో..! ఆస్టన్ మార్టిన్ వీ12 వాంటేజ్ టఫ్ డిజైన్ అదిరేపోయే ఫీచర్స్‌తో పూర్తిగా లగ్జరీ స్పోర్ట్స్ లుక్‌తో రానుంది. కార్బన్ ఫైబర్ ఫ్రంట్ బంపర్, క్లామ్‌షెల్ బోనెట్, ఫ్రంట్ ఫెండర్లు , సైడ్ సిల్స్, కాంపోజిట్ రియర్ బంపర్, లైట్ వెయిట్ బ్యాటరీ, ప్రత్యేక సెంటర్-మౌంటెడ్ ట్విన్-ఎగ్జిట్ ఎగ్జాస్ట్‌తో వస్తుంది. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లతో రానుంది. ఇది యాపిల్ డివైస్ ఇంటిగ్రేషన్‌తో కూడిన 8-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఆస్టన్ మార్టిన్ ప్రీమియం ఆడియో సిస్టమ్‌తో రానుంది. ఇక భద్రత పరంగా..కొత్త V12 Vantage బ్లైండ్-స్పాట్ డిటెక్షన్, 360-డిగ్రీ కెమెరా, అటానమస్ పార్కింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌తో వస్తుంది. 2022 V12 Vantage కారు కర్బన్ సిరామిక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను పొందుతుంది. ఇంజిన్ విషయానికి వస్తే..! కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఆస్టన్ మార్టిన్ వీ12 వాంటేజ్ అతి చిన్న మోడల్. దీనికి అతిపెద్ద ఇంజిన్‌ను ఇన్స్టాల్ చేశారు. కొత్త ఆస్టన్ మార్టిన్ V12 వాంటేజ్ స్టాండర్డ్ V8-పవర్డ్ మోడల్‌తో సమానంగా ఉండనుంది. ఈ కారులో అత్యంత వేగవంతమైన, అత్యంత శక్తివంతమైన ఇంజన్, క్వాడ్-క్యామ్ 5.2-లీటర్ V12 యూనిట్ 700PS పవర్, 753Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తోంది. V12 ఇంజిన్ ZF ఎనిమిది-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్‌తో జత కానుంద. ఈ కారు దాదాపు జీరో నుంచి 100 కిమీ వేగాన్ని కేవలం 3.4 సెకన్లలో అందుకోగలదు. కారు గరిష్ట వేగం 322kmph.ఆస్టన్ మార్టిన్ వీ12 వాంటేజ్ ధర సుమారు 3 లక్షల డాలర్ల నుంచి మొదలుకానుంది. కేవలం 333 యూనిట్లు మాత్రమే..! గత పదిహేనేళ్లుగా ఆస్టన్ మార్టిన్ వీ12 వాంటేజ్ కంపెనీలో ఫ్లాగ్షిప్ కారుగా నిలుస్తోంది. కాగా ప్రపంచవ్యాప్తంగా ఆస్టన్ మార్టిన్ వీ12 వాంటేజ్(V12 Vantage) ను 333 యూనిట్లను మాత్రమే అమ్మకానికి ఉంచనుంది. ఈ వీపరితమైన డిమాండ్ ఉండడంతో బుకింగ్స్‌ను కంపెనీ నిలిపివేసింది. 2021 క్యూ1లో వీటి ఉత్పత్తి ప్రారంభంకానుంది. 2022 క్యూ2 నుంచి డెలివరీలు అందిస్తామని కంపెనీ వెల్లడించింది. చదవండి: మారుతి సుజుకీ కస్టమర్లకు శుభవార్త..! ఇప్పుడు మరింత సులువుగా -
ఎలక్ట్రిక్ కార్లలో సంచలనం సృష్టించిన భారత కంపెనీ..!
ప్రపంచవ్యాప్తంగా పలు ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. అగ్రదేశాలతో పాటుగా భారత్‌కు చెందిన కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సిద్దమయ్యాయి. అత్యంత తేలికైన ఎలక్ట్రిక్ కార్..! తాజాగా ముంబైకు చెందిన వజీరానీ ఆటోమోటివ్ ఎలక్ట్రిక్ కార్లలో సంచలనం సృష్టించింది. వజీరానీ ఆటోమోటివ్ సోమవారం రోజున అత్యంత వేగవంతమైన, ప్రపంచంలో తేలికైన ఎలక్ట్రిక్ వాహనం ఎకోంక్ (హైపర్ కారు) లాంచ్ చేసింది. ఎకోంక్ అత్యంత వేగంగా వెళ్లే ఎలక్ట్రిక్ కారుగా నిలుస్తోందని కంపెనీ వెల్లడించింది . ఇండోర్‌లోని నాక్స్‌ట్రాక్స్ హై స్పీడ్ ట్రాక్‌లో ఎకోంక్ సుమారు 309కేఎమ్‌పీహెచ్ గరిష్ట వేగాన్ని సాధించిందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కారు 0 నుంచి 100 కెఎమ్‌పీహెచ్ స్పీడ్‌ను కేవలం 2.54 సెకండ్లలో అందుకుంటుంది. రోల్స్ రాయిస్ నుంచి..! 2015లో వజిరానీ ఆటోమోటివ్‌ను ముంబైకు చెందిన చంకీ వజీరానీ స్థాపించారు. చంకీ గతంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన రోల్స్ రాయిస్, జాగ్వార్ లాంటి ఆటోమొబైల్ కంపెనీల్లో పనిచేశారు. సూపర్‌ఫాస్ట్ కార్ల తయారీలో భారత్‌ను ప్రపంచపటంతో నిలపాలనే లక్ష్యంతో కంపెనీ స్థాపించాడు. ఫోర్స్ ఇండియా ఫార్ములా 1, మిచిలిన్ కంపెనీల భాగస్వామ్యంతో భారత తొలి హైబ్రిడ్ ఇంజిన్ కార్‌ను 2018 గుడ్‌వుడ్ ఫెస్టివల్లో ఎకోంక్ సూపర్ కారును తయారుచేశారు. ఎకోంక్ కార్ ఫీచర్స్..! ఎకోంక్ సింగిల్ సీటర్ ఏరోడైనమిక్ హైపర్ కార్. ఈ కారులో కొత్త బ్యాటరీ సెటప్‌ను అమర్చారు. ఇది సుమారు 738 కిలోల బరువును కల్గి ఉంది. ఎకోంక్ గరిష్టంగా 722 హెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తోంది. కారు బాడీని పూర్తిగా కర్బన్ ఫైబర్‌తో తయారుచేశారు. దీంతో అత్యంత తేలికైన కారుగా ఎకోంక్ నిలుస్తోంది. చదవండి: మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. అదిరిపోయే స్పీడ్, రేంజ్ -
Tesla S Plaid : ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ కార్
కాలిఫోర్నియా : ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ కార్ని రిలీజ్ చేసింది టెస్లా కంపెనీ. అమెరికాలోని కాలిఫోర్నియాలో గురువారం రాత్రి జరిగిన లాంచింగ్ ఈవెంట్లో టెస్లా ఎస్ ప్లెయిడ్ కారుని ప్రపంచలోనే అత్యంత ఫాస్టెస్ట్ కారుగా టెస్లా ఫౌండర్ ఎలన్ మస్క్ అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోర్షే కంటే వేగంగా వోల్లో కంటే భధ్రమైన కారుగా ఎస్ ప్లెయిడ్‌ని పేర్కొన్నారు. 2 సెకన్లలో టెస్లా నుంచి ఫ్లాగ్షిప్ లగ్జరీ సెడాన్ కారుగా ఎస్ ప్లెయిడ్‌ని అమెరికా మార్కెట్లోకి ఎంటరైంది. 1020 హెపీ హర్స్‌పవర్ శక్తి కలిగిన ఈ కారు కేవలం రెండు సెకన్లలో 96 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు గరిష్ట వేగం గంటలకు 322 కిలోమీటర్లు. ప్రస్తుతం అమెరికాలోనే ఈ కారు లభిస్తోంది. ఈ కారు ధర 1,29,990 (రూ. 94 లక్షలు) డాలర్లుగా ఉంది. కాఫీ తాగేలోపు ఎలక్ట్రిక్ కార్లకు ఉన్న ప్రధాన సమస్యైన ఛార్జింగ్ టైం విషయంలో టెస్లా ప్రయత్నాలు ఫలించాయి. కేవలం కేవలం 15 నిమిషాల పాటు బ్యాటరీ ఛార్జీంగ్‌తో 301 కిలోమీరట్ల ప్రయాణం చేయవచ్చుని కంపెనీ పేర్కొంటోంది. కేవలం కాఫీ బ్రేక్ సమయంలోనే కారు తిరిగి ప్రయాణానికి సిద్థమవుతుందని ప్రకటించింది. ఈ కారులో లిథియం అయాన్ బ్యాటరీతో పాటు ఫాస్ట్‌ఛార్జింగ్ ఆప్షన్లను టెస్లా అందుబాటులోకి తెచ్చింది. లగ్జరీ బ్రాండ్లకు ధీటుగా లగర్జీ కార్ల మార్కెట్లో దిగ్గజ కంపెనీలకు పోటీ ఇస్తోంది టెస్లా. లగ్జరీ, పవర్ఫుల్ ఇంజన్ కాంబినేషన్లో టెస్లా రిలీజ్ చేసి ఎస్ ప్లెయిడ్ కారు అమెరికా మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. క్షణాల్లో రివ్వుమని దూసుకుపోయే వేగం, అద్వీతీయమైన లగ్జరీ ఫీచర్లలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా టెస్లా ఎస్ ప్లెయిడ్ మారింది. చదవండి: అదిరే అల్కాజర్, సరికొత్త ఫీచర్లతో మార్కెట్లో సందడి -
త్వరలో రాకెట్ వేగంతో ప్రయాణించే కారు..
త్వరలో రాకెట్ వేగంతో ప్రయాణించే కారు మన మధ్యలో ఉండబోతుంది. గోర్డాన్ ముర్రే డిజైనర్ టీమ్ రూపకల్పన చేసిన సరికొత్త సంచలనం టీ.50. ముగ్గురు ప్రయాణించే విధంగా రూపకల్పన చేశారు. ముర్రే బృందం రేసింగ్ పాయింట్ ఫార్ములా వన్(ఆర్పీఎఫ్ఓ)తో ఉమ్మడిగా ఈ సరికొత్త ప్రాజెక్టును రూపొందిస్తోంది. ఈ కారు ధర 15.71 కోట్ల అని కంపెనీ వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది మేలో కారుకు సంబంధించిన అధికారిక ఫోటోను విడుదల చేయనున్నారు. కనీవినీ ఎరుగనీ అధునాతన ఏరో డైనమిక్స్‌తో రూపొందించామని కంపెనీ వర్గాలు తెలిపాయి. సూపర్ కార్ బరువు 980 కిలోలు. ఇది 12,100 ఆర్‌పీఎమ్‌ను కలిగి ఉంటుందని తెలిపారు. ప్రపంచంలోనే ఆధునాతన టెక్నాలజీతో కారును రూపోందించామని గోర్డాన్ ముర్రే గ్రూప్ చైర్మన్ పేర్కొన్నారు. ఈ కారు అమెరికా, జపాన్ ఎక్కువ సంఖ్యలో వినియోగదారులు విక్రయించడానికి మొగ్గు చూపుతున్నారని కంపెనీ పేర్కొంది. మరోవైపు గోర్డాన్ ముర్రే టీమ్‌తో కలిసి పనిచేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆర్పీఎఫ్ఓ తెలిపింది. -
‘స్పీడ్ కారు’ రూపకల్పనలో భారత సంతతి మహిళ
జొహన్నెస్‌బర్గ్: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కారు తయారు చేసే బృందంలో భారతసంతతి మహిళకు చోటుదక్కింది. దక్షిణాఫ్రికాలో స్థిరపడిన బివెర్లీసింగ్(29) పోర్ట్ఎలిజిబిత్లో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేస్తుంది. ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్‌లో ఈ కారును రూపొందిస్తున్నారు. ఇందుకోసం 30 మంది ఇంజనీర్ల బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇకపై బివెర్లీసింగ్ కూడా ఈ బృందంతో కలిసి పనిచేయనుంది. గంటకు 1,228 కి.మి. వేగంతో వెళ్లే ఈ కారును పరీక్షించేందకు 2015లో దక్షిణాఫ్రికాకు తీసుకరానున్నారు. కారు తయారీ బృందానికి ఎంపికవడంపై బివెర్లీ సంతోషం వ్యక్తం చేసింది. జీవితకాలంలలో ఒకేఒక్కసారి వచ్చే అవకాశమిది అని పేర్కొంది. పోర్ట్లిజిబెత్లో తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసిన బివెర్లీ మరికొన్ని వారాల్లో బ్రిస్టల్‌కు వెళ్లనుంది.