ప్రపంచవ్యాప్తంగా పలు ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. అగ్రదేశాలతో పాటుగా భారత్‌కు చెందిన కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సిద్దమయ్యాయి.
అత్యంత తేలికైన ఎలక్ట్రిక్ కార్..!
తాజాగా ముంబైకు చెందిన వజీరానీ ఆటోమోటివ్ ఎలక్ట్రిక్ కార్లలో సంచలనం సృష్టించింది. వజీరానీ ఆటోమోటివ్ సోమవారం రోజున అత్యంత వేగవంతమైన, ప్రపంచంలో తేలికైన ఎలక్ట్రిక్ వాహనం ఎకోంక్ (హైపర్ కారు) లాంచ్ చేసింది. ఎకోంక్ అత్యంత వేగంగా వెళ్లే ఎలక్ట్రిక్ కారుగా నిలుస్తోందని కంపెనీ వెల్లడించింది .
ఇండోర్‌లోని నాక్స్‌ట్రాక్స్ హై స్పీడ్ ట్రాక్‌లో ఎకోంక్ సుమారు 309కేఎమ్‌పీహెచ్ గరిష్ట వేగాన్ని సాధించిందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కారు 0 నుంచి 100 కెఎమ్‌పీహెచ్ స్పీడ్‌ను కేవలం 2.54 సెకండ్లలో అందుకుంటుంది.
రోల్స్ రాయిస్ నుంచి..!
2015లో వజిరానీ ఆటోమోటివ్‌ను ముంబైకు చెందిన చంకీ వజీరానీ స్థాపించారు. చంకీ గతంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన రోల్స్ రాయిస్, జాగ్వార్ లాంటి ఆటోమొబైల్ కంపెనీల్లో పనిచేశారు. సూపర్‌ఫాస్ట్ కార్ల తయారీలో భారత్‌ను ప్రపంచపటంతో నిలపాలనే లక్ష్యంతో కంపెనీ స్థాపించాడు. ఫోర్స్ ఇండియా ఫార్ములా 1, మిచిలిన్ కంపెనీల భాగస్వామ్యంతో భారత తొలి హైబ్రిడ్ ఇంజిన్ కార్‌ను 2018 గుడ్‌వుడ్ ఫెస్టివల్‌లో ఎకోంక్ సూపర్ కారును తయారుచేశారు.
ఎకోంక్ కార్ ఫీచర్స్..!
ఎకోంక్ సింగిల్ సీటర్ ఏరోడైనమిక్ హైపర్ కార్. ఈ కారులో కొత్త బ్యాటరీ సెటప్‌ను అమర్చారు. ఇది సుమారు 738 కిలోల బరువును కల్గి ఉంది. ఎకోంక్ గరిష్టంగా 722 హెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తోంది. కారు బాడీని పూర్తిగా కర్బన్ ఫైబర్‌తో తయారుచేశారు. దీంతో అత్యంత తేలికైన కారుగా ఎకోంక్ నిలుస్తోంది.
చదవండి: మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. అదిరిపోయే స్పీడ్, రేంజ్
Comments
Please login to add a commentAdd a comment