‘స్పీడ్ కారు’ రూపకల్పనలో భారత సంతతి మహిళ | Indian origin lady participates in designing of fastest car | Sakshi
Sakshi News home page

‘స్పీడ్ కారు’ రూపకల్పనలో భారత సంతతి మహిళ

Published Tue, Aug 27 2013 7:17 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM

‘స్పీడ్ కారు’ రూపకల్పనలో భారత సంతతి మహిళ

‘స్పీడ్ కారు’ రూపకల్పనలో భారత సంతతి మహిళ

 జొహన్నెస్‌బర్గ్: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కారు తయారు చేసే బృందంలో భారతసంతతి మహిళకు చోటుదక్కింది. దక్షిణాఫ్రికాలో స్థిరపడిన బివెర్లీసింగ్(29) పోర్ట్‌ఎలిజిబిత్‌లో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేస్తుంది. ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్‌లో ఈ కారును రూపొందిస్తున్నారు. ఇందుకోసం 30 మంది ఇంజనీర్ల బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇకపై బివెర్లీసింగ్ కూడా ఈ బృందంతో కలిసి పనిచేయనుంది. గంటకు 1,228 కి.మి. వేగంతో వెళ్లే ఈ కారును పరీక్షించేందకు 2015లో దక్షిణాఫ్రికాకు తీసుకరానున్నారు. కారు తయారీ బృందానికి ఎంపికవడంపై బివెర్లీ సంతోషం వ్యక్తం చేసింది. జీవితకాలంలలో ఒకేఒక్కసారి వచ్చే అవకాశమిది అని పేర్కొంది. పోర్ట్‌లిజిబెత్‌లో తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసిన బివెర్లీ మరికొన్ని వారాల్లో బ్రిస్టల్‌కు వెళ్లనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement