Indian origin lady
-
కెనడియన్‌తో పెళ్లి... ఆర్మీ మేజర్ ఉద్యోగానికి ఎసరు!
న్యూఢిల్లీ: కెనడా పౌరసత్వం గల భారత సంతతి యువతిని పెళ్లాడటంతో ఓ ఆర్మీ మేజర్ ఉద్యోగానికే ఎసరొచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్ఎస్జీలో ఇటీవల నియమితుడైన ఆ మేజర్, 2010లో కెనడా పౌరసత్వం పొందిన భారత సంతతి యువతిని పెళ్లాడారు. పెళ్లికి ఏడాది ముందే ఆమెకు కెనడా శాశ్వత పౌరసత్వం లభించింది. ఆర్మీ అనుమతి తీసుకోకుండా ఆమెను పెళ్లాడటమే కాకుండా, ఇన్నాళ్లూ ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు వెల్లడించని కారణంగా మేజర్‌కు చిక్కులు మొదలయ్యాయి. ఆర్మీ ఆయనపై విచారణ ప్రారంభించింది. -
‘స్పీడ్ కారు’ రూపకల్పనలో భారత సంతతి మహిళ
జొహన్నెస్‌బర్గ్: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కారు తయారు చేసే బృందంలో భారతసంతతి మహిళకు చోటుదక్కింది. దక్షిణాఫ్రికాలో స్థిరపడిన బివెర్లీసింగ్(29) పోర్ట్ఎలిజిబిత్లో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేస్తుంది. ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్‌లో ఈ కారును రూపొందిస్తున్నారు. ఇందుకోసం 30 మంది ఇంజనీర్ల బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇకపై బివెర్లీసింగ్ కూడా ఈ బృందంతో కలిసి పనిచేయనుంది. గంటకు 1,228 కి.మి. వేగంతో వెళ్లే ఈ కారును పరీక్షించేందకు 2015లో దక్షిణాఫ్రికాకు తీసుకరానున్నారు. కారు తయారీ బృందానికి ఎంపికవడంపై బివెర్లీ సంతోషం వ్యక్తం చేసింది. జీవితకాలంలలో ఒకేఒక్కసారి వచ్చే అవకాశమిది అని పేర్కొంది. పోర్ట్లిజిబెత్లో తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసిన బివెర్లీ మరికొన్ని వారాల్లో బ్రిస్టల్‌కు వెళ్లనుంది.