అమెరికన్ కార్ల తయారీ సంస్థ 'టెస్లా' ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కారును లాంచ్ చేయడానికి సిద్ధమైపోయింది. టెస్లా రోడ్‌స్టర్ (Tesla Roadster) పేరుతో కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కారు 0 నుంచి 60 కిమీ/గం వేగాన్ని సెకను కంటే తక్కువ వ్యవధిలోనే చేరుకుంటుందని సమాచారం.
ఈ కారు గురించి టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్' (Elon Musk) కొన్ని వివరాలను వెల్లడిస్తూ.. ఇది 2024 చివరి నాటికి లేదా 2025 ప్రారంభంలో మార్కెట్లో లాంచ్ అవుతుందని పేర్కొన్నారు. ఈ కారుని టెస్లా, స్పేస్ఎక్స్ సహకారంతో తయారు చేస్తున్నట్లు వెల్లడించారు.
Tonight, we radically increased the design goals for the new Tesla Roadster.
There will never be another car like this, if you could even call it a car.— Elon Musk (@elonmusk) February 28, 2024
టెస్లా లాంచ్ చేయనున్న ఈ కొత్త కారు అత్యంత ఆకర్షణీయమైన కారుగా పేర్కొన్నారు. ఈ కారు డిజైన్ మాత్రమే కాకుండా, ఫీచర్స్ కూడా చాలా వరకు అప్డేట్ పొందినట్లు తెలుస్తోంది. ఇది 4 సీట్లు కలిగిన ఎలక్ట్రిక్ కారు. దీని గురించి మస్క్ 2017లోనే వెల్లడించారు.
కంపెనీ టెస్లా రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ కారు కోసం ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఈ కారును బుక్ చేసుకోవాలనుంటే 50000 డాలర్ల టోకెన్ మొత్తాన్ని వెచ్చించి బుక్ చేసుకోవచ్చు. నిజానికి 2021లో లాంచ్ కావలసిన ఈ కారు 2024 చివరి నాటికి లాంచ్ అవుతుందని చెబుతున్నారు.
ఇదీ చదవండి: భారత యాప్స్‌పై గూగుల్ కన్నెర్ర.. ప్లేస్టోర్‌లో అవి మాయం!
0-60mph < 1 sec
And that is the least interesting part— Elon Musk (@elonmusk) February 28, 2024
Comments
Please login to add a commentAdd a comment