ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా సైబర్‌ట్రక్ బేసిక్ వేరియంట్ ఆర్డర్లను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఒకవేళ వినియోగదారులు తక్షణమే సైబర్‌ట్రక్‌ను పొందాలంటే 1 లక్ష డాలర్లు(రూ.83.9 లక్షలు) ధర ఉన్న ప్రీమియం వేరియంట్‌ను ఆర్డర్ చేయాలని తెలిపింది.
టెస్లా ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ కలిగిన సైబర్‌ట్రక్ బేసిక్ వేరియంట్ ధరను 61,000 డాలర్లు(రూ.51.2 లక్షలు)గా నిర్ణయించింది. దాంతో భారీగా ఆర్డర్లు వచ్చాయి. అయితే దీన్ని విక్రయించడం వల్ల కంపెనీకు తక్కువ మార్జిన్ వస్తున్నట్లు సమాచారం. సైబర్‌ట్రక్ ప్రీమియం వేరియంట్ ధరను 1 లక్ష డాలర్లు (రూ.83.9 లక్షలు)గా ఉంచారు. దాంతో దీనికి డిమాండ్ తగ్గిపోయింది. ఈ రెండు వేరియంట్లు కలిపి ఇప్పటివరకు దాదాపు 10 లక్షల యూనిట్లను ఆర్డర్ చేసుకున్నారని ఇలాన్‌మస్క్ తెలిపారు. ఇందులో బేసిక్ వేరియంట్ ఆర్డర్లను నిలిపేస్తున్నట్లు ప్రకటించడంతో ఇకపై సైబర్‌ట్రక్ కావాలనుకునేవారు ప్రీమియం మోడల్‌ను బుక్ చేసుకోవాలని కంపెనీ తెలిపింది. దానివల్ల మార్జిన్ పెరిగి కంపెనీ బ్యాలెన్స్‌షీట్‌లో రెవెన్యూ అధికమవుతుందని భావిస్తోంది. ఒకవేళ కస్టమర్లు ప్రీమియం మోడల్‌ను ఆర్డర్‌చేస్తే ఈ నెలలోనే డెలివరీ ఇస్తామని హామీ ఇస్తుంది. ఏలాగైనా ఈ ఏడాదిలో వీటి అమ్మకాలను 2 లక్షలకు తీసుకెళ్లాలని యోచిస్తోంది.
‘కాక్స్ ఆటోమోటివ్’ తెలిపిన వివరాల ప్రకారం..టెస్లా జులైలో దాదాపు 4,800 సైబర్‌ట్రక్ ప్రీమియం యూనిట్లను విక్రయించింది. ఇది యూఎస్‌లో 1 లక్ష డాలర్ల ధర శ్రేణిలో అత్యధికంగా అమ్ముడైన వాహనంగా నిలిచింది. అయితే ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు కేవలం 16,000 యూనిట్లు మాత్రమే విక్రయించారు. ఆ సంఖ్యను పెంచడం కంపెనీకి సవాలుగా మారుతుంది.
ఇదీ చదవండి: సీఈఓల జీతాలు పెంపు!
ఇదిలాఉండగా, టెస్లా నవంబర్ 2023లో సైబర్‌ట్రక్‌ను ఆవిష్కరించింది. బేసిక్ వేరియంట్ కార్లను 2025లో డెలివరీ ఇస్తామని లక్ష్యంగా చేసుకుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 511 కిలోమీటర్ల వరకు వెళ్లే డ్యుయల్ మోటార్ వేరియంట్‌ను(ధర రూ.83.9 లక్షలు) ఆర్డర్ చేస్తే ఈ నెలలోనే డెలివరీ ఇస్తామని ప్రకటించింది. ‘ట్రై-మోటార్ వేరియంట్ సైబర్‌బీస్ట్’ మోడల్ (ధర దాదాపు రూ.1 కోటి) అక్టోబర్ నుంచి అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment