బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త 2022 వీ12 వాంటేజ్ కారును లాంచ్ చేసింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో పెట్రోల్‌తో నడిచే వాహనాల్లో ఇదే చిట్టచివరి స్పోర్ట్స్ కారు. సంప్రదాయ ఇంధన వాహనాల తయారీకు ఆస్టన్ మార్టిన్ గుడ్‌బై చెప్పనుంది. 2025 లేదా 2026లో తొలి ఎలక్ట్రిక్ కారును ఆస్టన్ మార్టిన్ తీసుకురానున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.
టఫ్ డిజైన్..అదిరే ఫీచర్స్‌తో..!
ఆస్టన్ మార్టిన్ వీ12 వాంటేజ్ టఫ్ డిజైన్ అదిరేపోయే ఫీచర్స్‌తో పూర్తిగా లగ్జరీ స్పోర్ట్స్ లుక్‌తో రానుంది. కార్బన్ ఫైబర్ ఫ్రంట్ బంపర్, క్లామ్‌షెల్ బోనెట్, ఫ్రంట్ ఫెండర్లు , సైడ్ సిల్స్, కాంపోజిట్ రియర్ బంపర్, లైట్ వెయిట్ బ్యాటరీ, ప్రత్యేక సెంటర్-మౌంటెడ్ ట్విన్-ఎగ్జిట్ ఎగ్జాస్ట్‌తో వస్తుంది. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లతో రానుంది. ఇది యాపిల్ డివైస్ ఇంటిగ్రేషన్‌తో కూడిన 8-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఆస్టన్ మార్టిన్ ప్రీమియం ఆడియో సిస్టమ్‌తో రానుంది. ఇక భద్రత పరంగా..కొత్త V12 Vantage బ్లైండ్-స్పాట్ డిటెక్షన్, 360-డిగ్రీ కెమెరా, అటానమస్ పార్కింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌తో వస్తుంది. 2022 V12 Vantage కారు కర్బన్ సిరామిక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను పొందుతుంది.
ఇంజిన్ విషయానికి వస్తే..!
కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఆస్టన్ మార్టిన్ వీ12 వాంటేజ్ అతి చిన్న మోడల్. దీనికి అతిపెద్ద ఇంజిన్‌ను ఇన్‌స్టాల్ చేశారు. కొత్త ఆస్టన్ మార్టిన్ V12 వాంటేజ్ స్టాండర్డ్ V8-పవర్డ్ మోడల్‌తో సమానంగా ఉండనుంది. ఈ కారులో అత్యంత వేగవంతమైన, అత్యంత శక్తివంతమైన ఇంజన్, క్వాడ్-క్యామ్ 5.2-లీటర్ V12 యూనిట్ 700PS పవర్, 753Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తోంది. V12 ఇంజిన్ ZF ఎనిమిది-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌తో జత కానుంద. ఈ కారు దాదాపు జీరో నుంచి 100 కిమీ వేగాన్ని కేవలం 3.4 సెకన్లలో అందుకోగలదు. కారు గరిష్ట వేగం 322kmph.ఆస్టన్ మార్టిన్ వీ12 వాంటేజ్ ధర సుమారు 3 లక్షల డాలర్ల నుంచి మొదలుకానుంది.
కేవలం 333 యూనిట్లు మాత్రమే..!
గత పదిహేనేళ్లుగా ఆస్టన్ మార్టిన్ వీ12 వాంటేజ్ కంపెనీలో ఫ్లాగ్‌షిప్ కారుగా నిలుస్తోంది. కాగా ప్రపంచవ్యాప్తంగా ఆస్టన్ మార్టిన్ వీ12 వాంటేజ్(V12 Vantage) ను 333 యూనిట్లను మాత్రమే అమ్మకానికి ఉంచనుంది. ఈ వీపరితమైన డిమాండ్ ఉండడంతో బుకింగ్స్‌ను కంపెనీ నిలిపివేసింది. 2021 క్యూ1లో వీటి ఉత్పత్తి ప్రారంభంకానుంది. 2022 క్యూ2 నుంచి డెలివరీలు అందిస్తామని కంపెనీ వెల్లడించింది.
చదవండి: మారుతి సుజుకీ కస్టమర్లకు శుభవార్త..! ఇప్పుడు మరింత సులువుగా
Comments
Please login to add a commentAdd a comment