Aston Martin
-
జొమాటో సీఈఓ గ్యారేజిలో ఇన్ని కార్లు ఉన్నాయా (ఫోటోలు)
-
అత్యంత శక్తివంతమైన, వేగంగా దూసుకెళ్లే కారు..! ఆస్టన్ మార్టిన్‌లో ఇదే చిట్ట చివరి కారు..!
బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త 2022 వీ12 వాంటేజ్ కారును లాంచ్ చేసింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో పెట్రోల్‌తో నడిచే వాహనాల్లో ఇదే చిట్టచివరి స్పోర్ట్స్ కారు. సంప్రదాయ ఇంధన వాహనాల తయారీకు ఆస్టన్ మార్టిన్ గుడ్‌బై చెప్పనుంది. 2025 లేదా 2026లో తొలి ఎలక్ట్రిక్ కారును ఆస్టన్ మార్టిన్ తీసుకురానున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. టఫ్ డిజైన్..అదిరే ఫీచర్స్‌తో..! ఆస్టన్ మార్టిన్ వీ12 వాంటేజ్ టఫ్ డిజైన్ అదిరేపోయే ఫీచర్స్‌తో పూర్తిగా లగ్జరీ స్పోర్ట్స్ లుక్‌తో రానుంది. కార్బన్ ఫైబర్ ఫ్రంట్ బంపర్, క్లామ్‌షెల్ బోనెట్, ఫ్రంట్ ఫెండర్లు , సైడ్ సిల్స్, కాంపోజిట్ రియర్ బంపర్, లైట్ వెయిట్ బ్యాటరీ, ప్రత్యేక సెంటర్-మౌంటెడ్ ట్విన్-ఎగ్జిట్ ఎగ్జాస్ట్‌తో వస్తుంది. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లతో రానుంది. ఇది యాపిల్ డివైస్ ఇంటిగ్రేషన్‌తో కూడిన 8-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఆస్టన్ మార్టిన్ ప్రీమియం ఆడియో సిస్టమ్‌తో రానుంది. ఇక భద్రత పరంగా..కొత్త V12 Vantage బ్లైండ్-స్పాట్ డిటెక్షన్, 360-డిగ్రీ కెమెరా, అటానమస్ పార్కింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌తో వస్తుంది. 2022 V12 Vantage కారు కర్బన్ సిరామిక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను పొందుతుంది. ఇంజిన్ విషయానికి వస్తే..! కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఆస్టన్ మార్టిన్ వీ12 వాంటేజ్ అతి చిన్న మోడల్. దీనికి అతిపెద్ద ఇంజిన్‌ను ఇన్స్టాల్ చేశారు. కొత్త ఆస్టన్ మార్టిన్ V12 వాంటేజ్ స్టాండర్డ్ V8-పవర్డ్ మోడల్‌తో సమానంగా ఉండనుంది. ఈ కారులో అత్యంత వేగవంతమైన, అత్యంత శక్తివంతమైన ఇంజన్, క్వాడ్-క్యామ్ 5.2-లీటర్ V12 యూనిట్ 700PS పవర్, 753Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తోంది. V12 ఇంజిన్ ZF ఎనిమిది-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్‌తో జత కానుంద. ఈ కారు దాదాపు జీరో నుంచి 100 కిమీ వేగాన్ని కేవలం 3.4 సెకన్లలో అందుకోగలదు. కారు గరిష్ట వేగం 322kmph.ఆస్టన్ మార్టిన్ వీ12 వాంటేజ్ ధర సుమారు 3 లక్షల డాలర్ల నుంచి మొదలుకానుంది. కేవలం 333 యూనిట్లు మాత్రమే..! గత పదిహేనేళ్లుగా ఆస్టన్ మార్టిన్ వీ12 వాంటేజ్ కంపెనీలో ఫ్లాగ్షిప్ కారుగా నిలుస్తోంది. కాగా ప్రపంచవ్యాప్తంగా ఆస్టన్ మార్టిన్ వీ12 వాంటేజ్(V12 Vantage) ను 333 యూనిట్లను మాత్రమే అమ్మకానికి ఉంచనుంది. ఈ వీపరితమైన డిమాండ్ ఉండడంతో బుకింగ్స్‌ను కంపెనీ నిలిపివేసింది. 2021 క్యూ1లో వీటి ఉత్పత్తి ప్రారంభంకానుంది. 2022 క్యూ2 నుంచి డెలివరీలు అందిస్తామని కంపెనీ వెల్లడించింది. చదవండి: మారుతి సుజుకీ కస్టమర్లకు శుభవార్త..! ఇప్పుడు మరింత సులువుగా -
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎస్యూవీ కారు..!
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎస్యూవీ కారును ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ లాంచ్ చేయనుంది. ఆస్టన్ మార్టిన్ 2022 DBX ఎస్‌యూవీకు చెందిన టీజర్‌ను కంపెనీ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. లాంచ్ ఎప్పుడంటే..! ఆస్టన్ మార్టిన్ 2022 DBX ఎస్యూవీ కారును రేపు (ఫిబ్రవరి 1)న రిలీజ్ చేయనుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన లగ్జరీ ఎస్‌యూవీగా నిలుస్తోందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కారు లంబోర్ఘిని ఉరస్ కారుకు పోటీగా నిలిచే అవకాశం ఉంది. ఈ కొత్త తరం డీబీఎక్స్ ఎస్యూవీ పలు మార్పులతో రానున్నట్లు కంపెనీ పేర్కొంది. సరికొత్తగా ఆస్టన్ మార్టిన్ 2022 డీబీఎక్స్..! ఆస్టన్ మార్టిన్ 2022 డీబీఎక్స్ను భారీ మార్పులతో, మరింత ఆకర్షణీయంగా రానుంది. రీడిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, కొత్త సెట్ డేటైమ్ రన్నింగ్ లైట్స్ రీపోజిషన్ చేయబడ్డాయి. కొత్త వీల్ డిజైన్స్‌తో సరికొత్త కలర్ కాంబినేషన్‌తో రానుంది. ఇంజన్ విషయానికి వస్తే..! న్యూ ఆస్టన్ మార్టిన్ 2022 డీబీఎక్స్ ఎస్యూవీ అభివృద్ధి చేసిన కొత్త టర్బోఛార్జ్డ్ వీ12 ఇంజిన్‌తో రానుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 650 hp శక్తిని ఉత్పత్తి చేయనుంది. మునపటి మోడల్ కంటే 100 hp అధిక శక్తిని విడుదల చేయనుంది. 0 నుంచి 100 kmph వేగాన్ని కేవలం 4.5 సెకన్లలో అందుకోనుంది. గరిష్టంగా 290 kmph వేగంతో ప్రయాణించనుంది. Change is coming. Power talks. The world’s most powerful luxury SUV. 01.02.22#AstonMartin#NewSeatOfPower — Aston Martin (@astonmartin) January 18, 2022 చదవండి: ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో దుమ్ములేపుతున్న టాటా కారు..! -
లగ్జరీ, బ్రాండెడ్ కార్లపై భారీగా ధర తగ్గింపు
న్యూఢిల్లీ : యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగి, గతేడాది ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఆ బ్రెగ్జిట్ పరిణామాలు ఆ దేశంలో ఎలా ఉన్నాయో కాని, భారత్‌కు మాత్రం బాగానే ప్రయోజనాలు చేకూరుస్తున్నాయి. బ్రాండెడ్, ఖరీదైన లగ్జరీ కార్లపై భారీగా ధరలు తగ్గాయి. బ్రిటన్‌కు చెందిన ప్రతిష్టాత్మక కార్ల దిగ్గజాలన్ని భారత్‌లో భారీగా ధరలు తగ్గించేశాయి. రోల్స్ రాయిస్, బెంట్లీ, ఆస్టన్ మార్టిన్, రేంజ్ రోవర్, ఫెర్రరి వంటి సంస్థలు తమ కార్లపై ధరలను 20 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయలకు పైగా తగ్గించినట్టు వెల్లడైంది. ఇంత భారీ మొత్తంలో ధరలు తగ్గించడానికి కారణం బ్రెగ్జిట్ నిర్ణయం అనంతరం పౌండ్ విలువ భారీగా పతనం కావడమే. రూపాయితో పోలిస్తే పౌండ్ విలువ ఏడాది వ్యవధిలోనే 20 శాతం దిగజారింది. దీంతో బ్రిటన్‌కు చెందిన తయారీసంస్థలు భారత్‌కు ఎగుమతి చేయడానికి ధరలు చౌకగా మారాయి. బ్రిటిష్ కరెన్సీలోనే భారత్ అమ్మకాలను గణిస్తారు. ఇలా ఎగుమతులు చౌకగా మారడంతో ఈ ప్రయోజనాలను భారత్‌లోని వినియోగదారులకు అందించాలని నిర్ణయించినట్టు కంపెనీలు చెబుతున్నాయి. 5 శాతం నుంచి 15 శాతం ధరలు కోత పెట్టి, ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకర్షితులను చేసుకోవాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నాయి. రెండు కోట్లకు పైగా ధర ఉన్న కార్ల విక్రయాలు భారత్‌లో 2016లో 200 యూనిట్లు నమోదయ్యాయి. దీనిలో సగానికి పైగా కార్లు బ్రిటన్‌కు చెందినవే కావడం విశేషం. భారత్‌లో జీఎస్టీ అమలైతే, మరింత అనుకూలమైన వాతావరణం ఏర్పాటుచేసి వృద్ధిని నమోదుచేసుకుంటామని ఆస్టన్ మార్టిన్ కార్ల అధికారిక దిగుమతిదారుడు లలిత్ చౌదరి చెబుతున్నారు. గత ఆరు నుంచి తొమ్మిది నెలల కాలంలో ఆస్టన్ మార్టిన్ కార్ల ధరలను భారీగా తగ్గించిందని పేర్కొన్నారు. ఏ కారుపై ఎంత తగ్గింది.... కారు అసలు ధర ప్రస్తుత ధర రేంజ్ రోవర్ స్పోర్ట్ 1.35 కోట్లు 1.04 కోట్లు రేంజ్ రోవర్ వోగ్ 1.97 కోట్లు 1.56 కోట్లు ఫెర్రరి 488 3.9 కోట్లు 3.6 కోట్లు రోల్స్ రాయిస్ ఫాంటమ్ 9 కోట్లు 7.8-8.0 కోట్లు రోల్స్ రాయిస్ గోస్ట్ 5.25 కోట్లు 4.75 కోట్లు ఆస్టన్ మార్టిన్ డీబీ11 4.27 కోట్లు 4.06 కోట్లు -
ఆస్టన్ మార్టిన్ ‘డీబీ11’ @రూ.4.27 కోట్లు
చెన్నై: బ్రిటిష్ సూపర్ కార్ బ్రాండ్ ‘ఆస్టన్ మార్టిన్’ తాజాగా ‘డీబీ11’ను చెన్నైలో ఆవిష్కరించింది. దీని ధర రూ.4.27 కోట్లుగా ఉంది. ఆస్టన్ మార్టిన్ తన ‘డీబీ11’కి సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రోడ్‌షోలను నిర్వహించింది. కాగా కంపెనీ ఈ మోడల్‌ను తొలిగా ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 86వ ఇంటర్నేషనల్ జెనీవా మోటార్ షో ప్రదర్శించింది. ‘డీబీ11’లో 5.2 లీటర్ ట్విన్ టర్బో చార్జ్డ్ వీ-12 ఇంజిన్‌ను అమర్చారు. కంపెనీ నుంచి వస్తోన్న తేలికపాటి, దృఢమైన, అత్యంత శక్తివంతమైన కారు ఇదే. ‘డీబీ11’ కార్ల విక్రయాలు ఈ ఏడాది చివరి త్రైమాసికంలో ప్రారంభమవుతాయి.