'అతడి మరణానికి మేము కారణం కాదు' | Paul Walker was responsible for his own death: Porsche | Sakshi
Sakshi News home page

'అతడి మరణానికి మేము కారణం కాదు'

Published Tue, Nov 17 2015 3:35 PM | Last Updated on Sun, Sep 3 2017 12:37 PM

'అతడి మరణానికి మేము కారణం కాదు'

'అతడి మరణానికి మేము కారణం కాదు'

లాస్ ఏంజెలెస్: 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' నటుడు పాల్ వాకర్ మరణానికి అతడే కారణమని ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'పోర్షె' ఉత్తర అమెరికా విభాగం తెలిపింది. స్వయంకృతం వల్లె కారు ప్రమాదంలో అతడు ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించింది. ఈ మేరకు గతవారం కోర్టుకు నివేదిక సమర్పించింది.

పాల్ వాకర్ ప్రమాదానికి గురైన కారు 2005 కెరీరా జీటీ గురించి అతడికి క్షుణ్నంగా తెలుసునని పేర్కొంది. ఈ కారు వినియోగించడం వల్ల తలెత్తే అపాయం, ప్రమాదాల గురించి అతడికి పూర్తి అవగాహన ఉందని వెల్లడించింది. కారు గురించి అన్ని తెలుసుకుని స్వచ్ఛందంగా దాన్ని ఉపయోగించారని తెలిపింది. అతడి మరణానికి తాము ఏ రకంగానూ కారణం కాదని పోర్షె స్పష్టం చేసింది.

తన తండ్రి మరణానికి పోర్షె కారణమని ఆరోపిస్తూ పాల్ వాకర్ కుమార్తె మీడో(16) రెండు నెలల క్రితం కోర్టులో దావా వేసింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానానికి పోర్షె వివరణయిచ్చింది. 2013, నవంబర్ లో జరిగిన కారు ప్రమాదంలో పాల్ వాకర్, అతడి స్నేహితుడు రోజర్ రోడ్స్ మృతి చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement