Paul Walker
-
కో-స్టార్ కూతురి పెళ్లిలో తండ్రిలా నడిచిన ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ స్టార్
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇందులో యాక్టర్స్ చేసే సాహసాలు రొమాలు నిక్కబోడిచేలా ఉండడంతో.. ఈ సిరీస్‌లో భారీ స్టాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ఇందులో ప్రధాన పాత్రల్లో నటించి వరల్డ్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్నారు విన్ డీజిల్, పాల్ వాకర్. గత కొన్ని సంవత్సరాల క్రితం పాల్ వాకర్ ఓ యాక్సిడెంట్లో మరణించాడు. అయితే తాజాగా ఆ నటుడిక కూతురు మోడల్ మెడో వాకర్ (22) వివాహం జరిగింది. ఈ పెళ్లికి పాల్‌తో దాదాపు 6 సినిమాల్లో కలిసి నటించిన విన్ డిజిల్ హాజరయ్యాడు. అంతేకాకుండా పెళ్లి కూతురిని డయాస్ వరకూ తీసుకొచ్చాడు విన్. నిజానికి అక్కడి సంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురిని అలా ఆమె తండ్రి తీసుకొస్తాడు. అయితే పాల్ లేని కారణంగా.. ఈ దివంగత నటుడిపై ఉన్న అభిమానంతో విన్ ఆయన కూతురిని పెళ్లి కూతురిలా వేదిక వరకూ తీసుకురావడం ఎంతోమంది అభిమానులు మనసులను గెలుచుకుంది. అంతే కాకుండా దీనిపై ఎంతో మంది హాలీవుడ్ స్టార్స్ స్పందించారు. ఈ వివాహానికి సంబంధించి వీడియోని, ఫోటోలని మెడో వాకర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అవి వైరల్‌గా మారాయి. చదవండి: అబార్షన్ చేయించుకొమన్నందుకు.. మాజీ ప్రియురాలికి క్షమాపణలు తెలిపిన నటుడు View this post on Instagram A post shared by Meadow Walker (@meadowwalker) View this post on Instagram A post shared by Meadow Walker (@meadowwalker) View this post on Instagram A post shared by Meadow Walker (@meadowwalker) -
పాల్‌పై డాక్యుమెంటరీ
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ హాలీవుడ్ మూవీ సిరీస్ ద్వారా అందులో ఒక హీరో పాల్ వాకర్ సుపరిచితుడే. 2013లో జరిగిన కార్ యాక్సిడెంట్లో పాల్ మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ హీరో మీద ఓ డాక్యుమెంటరీ రూపొందించింది హాలీవుడ్ సంస్థ పారామౌంట్ పిక్చర్స్. ‘ఐ యామ్’ పేరుతో డాక్యుమెంటరీ సిరీస్‌ను రూపొందిస్తుంటుంది పారామౌంట్ సంస్థ. ఈ సిరీస్‌లో భాగంగానే పాల్ వాకర్‌పై కూడా ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. ఇందులో పాల్ బాల్యంలోని కొన్ని వీడియోలను చూపించనున్నారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులు, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్‌లో పాల్‌తో పాటు యాక్ట్ చేసిన యాక్టర్స్, డైరెక్టర్స్‌తో ఇంటర్వ్యూలను కూడా పొందుపరిచారట. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను ఇటీవలే రిలీజ్ చేసింది పారామౌంట్. ఈ డాక్యుమెంటరీ ఆగస్ట్ 11న ప్రసారం కానుంది. -
'అతడి మరణానికి మేము కారణం కాదు'
లాస్ ఏంజెలెస్: 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' నటుడు పాల్ వాకర్ మరణానికి అతడే కారణమని ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'పోర్షె' ఉత్తర అమెరికా విభాగం తెలిపింది. స్వయంకృతం వల్లె కారు ప్రమాదంలో అతడు ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించింది. ఈ మేరకు గతవారం కోర్టుకు నివేదిక సమర్పించింది. పాల్ వాకర్ ప్రమాదానికి గురైన కారు 2005 కెరీరా జీటీ గురించి అతడికి క్షుణ్నంగా తెలుసునని పేర్కొంది. ఈ కారు వినియోగించడం వల్ల తలెత్తే అపాయం, ప్రమాదాల గురించి అతడికి పూర్తి అవగాహన ఉందని వెల్లడించింది. కారు గురించి అన్ని తెలుసుకుని స్వచ్ఛందంగా దాన్ని ఉపయోగించారని తెలిపింది. అతడి మరణానికి తాము ఏ రకంగానూ కారణం కాదని పోర్షె స్పష్టం చేసింది. తన తండ్రి మరణానికి పోర్షె కారణమని ఆరోపిస్తూ పాల్ వాకర్ కుమార్తె మీడో(16) రెండు నెలల క్రితం కోర్టులో దావా వేసింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానానికి పోర్షె వివరణయిచ్చింది. 2013, నవంబర్ లో జరిగిన కారు ప్రమాదంలో పాల్ వాకర్, అతడి స్నేహితుడు రోజర్ రోడ్స్ మృతి చెందారు. -
వాళ్లు చనిపోయినా...
లాస్ ఏంజిల్స్ : ఏనుగు చచ్చినా...బతికినా ఒకటే విలువ అని తెలుగులో ఓ నానుడి. తాజా ఫోర్బ్స్ చనిపోయిన సెల్రబిటీ ధనవంతుల లిస్టు చూస్తే ఈ సామెత గుర్తు రాక మానదు. చనిపోయి తర్వాత కూడా కొంతమంది సెలబ్రిటీలు ఫోర్బ్స్ ధనవంతుల లిస్టులో చేరారు. తాజాగా ఆ జాబితాలో ఇపుడు హాలీవుడ్ స్టార్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ హీరో పాల్ వాకర్ చేరాడు. ఫోర్బ్స్ డెడ్ సెలబ్రిటీల లిస్ట్‌లో కొత్తగా చోటు సంపాదించి తొమ్మిదో స్థానంలో ఆక్రమించాడు. ఇప్పుడతను గడిచిన ఏడాది పాల్ వాకర్ పది మిలియన్ డాలర్లు ఆర్జించాడు. అటు పాప్ సంగీత రారాజు, మైఖేల్ జాక్సన్ వరుసగా మూడోసారి టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత స్థానాల్లో ఎల్విస్ ప్రెస్లీ, ఛార్లెస్ ష్కల్జ్, బాబ్ మార్లే, ఎలిజబెత్ టేలర్ 5వ స్థానంలో కొనసాగుతుండగా, మార్లిన్ మాన్రో, జాన్ లెన్నాన్, ఆల్బర్ట్ ఐన్ స్టీన్ తదితరులు తరువాతి స్థానాలను ఆక్రమించారు. కాగా రెండేళ్ల క్రితం అంటే 2013లో హై స్పీడ్ కారు ప్రమాదంలో పాల్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ అనూహ్య పరిణామంతో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అభిమానులు విషాదంలో మునిగిపోయారు. -
హాలీవుడ్లో వేలం పాటలు!
సినిమా తారల ఆటోగ్రాఫులు తీసుకోవడం కోసం, ఫొటోలు దిగడం కోసం అభిమానులు ఉవ్విళ్లూరిపోతుంటారు. ఇక ఏకంగా వాళ్లు వాడిన వస్తువులు సొంతం చేసుకునే అవకాశం వస్తే, ఆస్తులు తాకట్టు పెట్టడానికి కూడా వెనకాడరు. పైగా, హాలీవుడ్ హాట్ లేడీ జూలియా రాబర్ట్స్‌కి సంబంధించినవైతే ఎంత క్రేజ్ ఉంటుందో ఊహించవచ్చు. ఆమె వాడిన కలమో, కత్తో, స్పూనో కాదు.. ఏకంగా లో దుస్తులను ఇటీవల వేలానికి పెట్టారు. ఓ సినిమాలో జూలియా ఈ లోదుస్తుల్లో దర్శనమిచ్చి, చాలామంది మతి పోగొట్టారు. ఆ సినిమా తాలూకు దుస్తులనే వేలానికి పెట్టారని తెలుసుకుని జూలియా వీరాభిమానులు వాటిని సొంతం చేసుకోవడానికి పోటీపడ్డారు. మామూలుగా హాలీవుడ్లో తారలు వాడిన వస్తువులను, దుస్తులను ఇలా వేలానికి పెడుతుంటారు. అయితే ఈ మధ్యకాలంలో జూలియా రాబర్ట్స్ లోదుస్తుల వేలంపాటకు వచ్చినంత క్రేజు వేరే దేనికీ రాలేదట. ఇప్పుడు మరో వేలంపాట పై చాలామంది దృష్టి ఉంది. దాదాపు 30 కార్లను వేలం పాటకు పెట్టనున్నారు. ఆ కార్లని వాడినది ఎవరో కాదు.. ప్రముఖ హాలీవుడ్ నటుడు పాల్ వాకర్. ఆరు నెలల క్రితం కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురై, దుర్మరణం పాలయ్యారు పాల్ వాకర్. ఆయనకు కార్లంటే విపరీతమైన పిచ్చి. అందుకే ‘ఆల్వేస్ ఇవాల్వింగ్’ పేరుతో రేస్ కార్స్ షాప్ కూడా ఆరంభించారాయన. ఈ షాప్‌లో ఉన్న అత్యంత ఖరీదు గల, సౌకర్యవంతమైన 30 కార్లను వేలానికి పెట్టనున్నారు. అయితే, ఈ వేలం పాటకు వాకర్ పేరుని మాత్రం ఉపయోగించరట. అయినప్పటికీ, ఆయన షాప్‌కి సంబంధించినవే కాబట్టి, ఈ వేలంపాటలో పాల్గొనాలని చాలామంది ఫిక్స్ అయ్యారట! -
ఈ వారాంతంలో పాల్ వాకర్ అంత్యక్రియలు
హాలీవుడ్ నటుడు పాల్ వాకర్ అంత్యక్రియలను ఈ వారాంతంలో నిర్వహిస్తున్నారు. వాకర్ నటించిన 'ద ఫాస్ట్ అండ్ ద ఫ్యూరియస్' చిత్రంలోని నటులు, ఇతర సిబ్బంది అంతా ఇందులో పాల్గొంటారు. అయితే కేవలం ఆహ్వానితులకు మాత్రమే అవకాశం ఉంటుంది. నవంబర్ 30వ తేదీన కాలిఫోర్నియాలోని శాంటా క్లారిటా నగరంలో ఓ ఛారిటీ షోలో పాల్గొని తిరిగివస్తూ కారు ప్రమాదంలో పాల్ వాకర్ మరణించిన విషయం తెలిసిందే. అంత్యక్రియల ఏర్పాట్ల విషయంలో వాకర్ సహనటుడు, స్నేహితుడు టైరీస్ గిబ్సన్ ఆ కుటుంబానికి సాయపడుతున్నారు. ఆయన ఇప్పటికే వాకర్ తల్లిదండ్రులను కలిసి, ఏం చేయాలన్న విషయమై చర్చించారు. వాకర్ 15 ఏళ్ల కుమార్తె ఇప్పటికీ తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోతోందని, ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని సన్నిహిత వర్గాలు చెప్పాయి. తండ్రిని కోల్పోయిన బాధ నుంచి తేరుకోడానికి ఎక్కువ సమయం స్నేహితులతో గడుపుతోందన్నారు. -
పాల్ వాకర్ కు ఘన నివాళి
-
పాల్ వాకర్ కు ఘన నివాళి
కారు ప్రమాదంలో హాలీవుడ్ నటుడు 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' చిత్ర హీరో పాల్ వాకర్ మరణవార్త అభిమానులను విషాదంలో ముంచింది. వాకర్ మరణించిన వెలెన్సీయాలోని కెల్లీ జాన్సన్ పార్క్ వే సమీపంలోని హెర్య్యూలెస్ స్ట్రీట్ లో అభిమానులు పుష్పగుచ్చాలు పెట్టి ఘనంగా నివాళులర్పించారు. -
'పాల్ వాకర్ మృతితో తెలివైన నటున్ని కోల్పోయాం'
హాలీవుడ్ నటుడు, 'ఫాస్ట్ అండ్ ఫూరియాస్' స్టార్ పాల్ వాకర్ ఆకస్మిక మృతి పట్ల పలువురు బాలీవుడ్ నటులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్తను నమ్మలేకపోతున్నామని ట్విటర్లో పేర్కొన్నారు. పాల్ వాకర్ చనిపోయాడన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపారు. 'పాల్ వాకర్ మరణవార్తను నమ్మలేకున్నా. ఈ వార్త న్నెంతో కలచివేసింది జీవితం చాలా విచిత్రమైనది' అని వరుణ్ ధావన్ ట్వీట్ చేశాడు. రోడ్డు ప్రమాదంలో పాల్ వాకర్ చనిపోయాడన్న వార్త విని దిగ్ర్భాంతికి గురయ్యానని ప్రీతి జింతా పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. తెలివైన, అందమైన నటున్ని కోల్పోయామని మిఖా సింగ్ వ్యాఖ్యానించారు. పాల్ వాకర్ తనకెంతో ఇష్టమని జాకీ భగ్నానీ వెల్లడించారు. పాల్ వాకర్ ఆత్మకు శాంతి కలగాలని సోనాల్ చౌహాన్, అఫ్తాబ్ శివసాని, దియా మిర్జా, సోఫీ చౌదరి, బిజోయ్ నంబియార్ తదిరులు కోరుకున్నారు. కాలిఫ్లోర్నియాలోని శాంతా క్లారిటాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాల్ వాకర్ మృతి చెందాడు. -
హాలీవుడ్ నటుడు పాల్ వాకర్ మృతి
-
హాలీవుడ్ నటుడు పాల్ వాకర్ మృతి
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ నటుడు పాల్ వాకర్ శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పడంతో కాలిఫ్లోర్నియాలోని శాంతా క్లారిటాలోఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఫిలీప్పిన్స్ తుపాను బాధితుల సహాయార్థం నిధుల సేకరణకు శాంతా క్లారిటాలో ఓ కారు ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే క్రమంలో అతని స్నేహితునితో కలిసి పోర్చ్ జీటీ కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని వాకర్ ప్రతినిధి మీడియాకు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం వాకర్ కారు వేగంగా వెళ్లడంతో అదుపుతప్పి ఒక చెట్టుని కొన్నదన్నారు. ఆ తరువాత కారు లో చెలరేగిన మంటల్లో పాకర్ తో పాటు, అతని స్నేహితుడు కూడా మృతి చెందారన్నారు. అకస్మికంగా చోటు చేసుకున్న ఈ పరిణామణానికి హాలీవుడ్ దిగ్ర్భాంతికి గురైయ్యింది. 'వార్సిటీ బ్లూస్','ద ఫాస్ట్ అండ్ ఫూరియాస్' చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వాకర్ అశేష అభిమానులను సొంతం చేసుకున్నాడు. గత పద్నాలుగు సంవత్సరాల నుంచి తమ స్టూడియో ప్రతినిధులతో పాకర్ ఎంతో నమ్మకశక్యంగా ఉండే వాడని యూనివర్శల్ స్టూడియో పేర్కొంది. ఇతడు నటించిన ‘ హవర్స్’ సినిమా ఈ డిసెంబర్ నెల లో విడుదల కానుంది.