ఈ వారాంతంలో పాల్ వాకర్ అంత్యక్రియలు | Paul Walker funerals planned for weekend | Sakshi
Sakshi News home page

ఈ వారాంతంలో పాల్ వాకర్ అంత్యక్రియలు

Published Wed, Dec 11 2013 3:09 PM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM

ఈ వారాంతంలో పాల్ వాకర్ అంత్యక్రియలు

ఈ వారాంతంలో పాల్ వాకర్ అంత్యక్రియలు

హాలీవుడ్ నటుడు పాల్ వాకర్ అంత్యక్రియలను ఈ వారాంతంలో నిర్వహిస్తున్నారు. వాకర్ నటించిన 'ద ఫాస్ట్ అండ్ ద ఫ్యూరియస్' చిత్రంలోని నటులు, ఇతర సిబ్బంది అంతా ఇందులో పాల్గొంటారు. అయితే కేవలం ఆహ్వానితులకు మాత్రమే అవకాశం ఉంటుంది. నవంబర్ 30వ తేదీన కాలిఫోర్నియాలోని శాంటా క్లారిటా నగరంలో ఓ ఛారిటీ షోలో పాల్గొని తిరిగివస్తూ కారు ప్రమాదంలో పాల్ వాకర్ మరణించిన విషయం తెలిసిందే. అంత్యక్రియల ఏర్పాట్ల విషయంలో వాకర్ సహనటుడు, స్నేహితుడు టైరీస్ గిబ్సన్ ఆ కుటుంబానికి సాయపడుతున్నారు.

ఆయన ఇప్పటికే వాకర్ తల్లిదండ్రులను కలిసి, ఏం చేయాలన్న విషయమై చర్చించారు. వాకర్ 15 ఏళ్ల కుమార్తె ఇప్పటికీ తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోతోందని, ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని సన్నిహిత వర్గాలు చెప్పాయి. తండ్రిని కోల్పోయిన బాధ నుంచి తేరుకోడానికి ఎక్కువ సమయం స్నేహితులతో గడుపుతోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement