హాలీవుడ్‌లో వేలం పాటలు! | Auctions in Hollywood | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌లో వేలం పాటలు!

Published Fri, May 2 2014 10:49 PM | Last Updated on Sat, Sep 2 2017 6:50 AM

హాలీవుడ్‌లో వేలం పాటలు!

హాలీవుడ్‌లో వేలం పాటలు!

 సినిమా తారల ఆటోగ్రాఫులు తీసుకోవడం కోసం, ఫొటోలు దిగడం కోసం అభిమానులు ఉవ్విళ్లూరిపోతుంటారు. ఇక ఏకంగా వాళ్లు వాడిన వస్తువులు సొంతం చేసుకునే అవకాశం వస్తే, ఆస్తులు తాకట్టు పెట్టడానికి కూడా వెనకాడరు. పైగా, హాలీవుడ్ హాట్ లేడీ జూలియా రాబర్ట్స్‌కి సంబంధించినవైతే ఎంత క్రేజ్ ఉంటుందో ఊహించవచ్చు. ఆమె వాడిన కలమో, కత్తో, స్పూనో కాదు.. ఏకంగా లో దుస్తులను ఇటీవల వేలానికి పెట్టారు. ఓ సినిమాలో జూలియా ఈ లోదుస్తుల్లో దర్శనమిచ్చి, చాలామంది మతి పోగొట్టారు. ఆ సినిమా తాలూకు దుస్తులనే వేలానికి పెట్టారని తెలుసుకుని జూలియా వీరాభిమానులు వాటిని సొంతం చేసుకోవడానికి పోటీపడ్డారు. మామూలుగా హాలీవుడ్‌లో తారలు వాడిన వస్తువులను, దుస్తులను ఇలా వేలానికి పెడుతుంటారు.

అయితే ఈ మధ్యకాలంలో జూలియా రాబర్ట్స్ లోదుస్తుల వేలంపాటకు వచ్చినంత క్రేజు వేరే దేనికీ రాలేదట. ఇప్పుడు మరో వేలంపాట పై చాలామంది దృష్టి ఉంది. దాదాపు 30 కార్లను వేలం పాటకు పెట్టనున్నారు. ఆ కార్లని వాడినది ఎవరో కాదు.. ప్రముఖ హాలీవుడ్ నటుడు పాల్ వాకర్. ఆరు నెలల క్రితం కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురై, దుర్మరణం పాలయ్యారు పాల్ వాకర్. ఆయనకు కార్లంటే విపరీతమైన పిచ్చి. అందుకే ‘ఆల్వేస్ ఇవాల్వింగ్’ పేరుతో రేస్ కార్స్ షాప్ కూడా ఆరంభించారాయన. ఈ షాప్‌లో ఉన్న అత్యంత ఖరీదు గల, సౌకర్యవంతమైన 30 కార్లను వేలానికి పెట్టనున్నారు. అయితే, ఈ వేలం పాటకు వాకర్ పేరుని మాత్రం ఉపయోగించరట. అయినప్పటికీ, ఆయన షాప్‌కి సంబంధించినవే కాబట్టి, ఈ వేలంపాటలో పాల్గొనాలని చాలామంది ఫిక్స్ అయ్యారట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement