నేను చాలా రిస్క్ చేశా... | Julia Roberts 'risked career' foregoing facelift | Sakshi
Sakshi News home page

నేను చాలా రిస్క్ చేశా...

Published Mon, Oct 27 2014 10:43 PM | Last Updated on Sat, Sep 2 2017 3:28 PM

నేను చాలా రిస్క్ చేశా...

నేను చాలా రిస్క్ చేశా...

 ‘‘నలభై ఏళ్లు వస్తే చాలు.. హాలీవుడ్‌లో కొంతమంది కథానాయికలు ఏం చేసినా చేయకపోయినా ముందు డాక్టర్లను, బ్యూటీషియన్లను కలుస్తారు. ముడతలు పడితే.. వాటిని మాయం చేయడానికి, పడకపోతే.. పడకుండా ముందు జాగ్రత్తగా చేయాల్సిన వాటి గురించి అడుగుతారు’’ అని ప్రముఖ హాలీవుడ్ తార జూలియా రాబర్ట్స్ చెప్పారు. మరో ఐదేళ్లల్లో ఆమెకు 50 ఏళ్లొచ్చేస్తాయి. ప్రస్తుతం ఆమె ఓ సౌందర్య సాధనానికి ప్రచారకర్తగా చేస్తున్నారు. మామూలుగా ఇలాంటి అవకాశం కుర్ర తారలకు వస్తుంటుంది.
 
 కానీ, వయసు పెరుగుతున్నకొద్దీ జూలియా అందం పెరుగుతోందని, ఆమే ప్రచారకర్తగా కరెక్ట్ అని ఆ ఉత్పత్తిదారులు భావించారట. ఈ ప్రతిపాదన అంగీకరించే ముందు జూలియా ఓ విషయాన్ని స్పష్టంగా చెప్పారట. ‘‘నేనెలా ఉన్నానో అలానే కనిపిస్తా. కానీ ముడతలు తీయిస్తే ఇంకా బాగుంటారని మీరనకూడదు’’ అని కరాఖండీగా జూలియా చెప్పేశారట. అందుకు వారు సమ్మతించిన తర్వాతనే ఒప్పంద పత్రంలో సంతకం పెట్టారట. ‘‘వయసు పైబడిన తర్వాత ముడతలు తీయించుకుంటారు. కానీ, అందుకు ఇష్టపడక పెద్ద రిస్క్ చేశా. ప్రకృతి పరంగా వచ్చే దేన్నయినా స్వీకరించడం నా అలవాటు. అందుకే, ముడతలు తీయించుకోవడానికి ‘ఫేస్ లిఫ్ట్’ చేయించుకోలేదు. భవిష్యత్తులో కూడా ఇలానే ఉంటా’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement