Julia Roberts
-
ఆ హీరోయిన్ అంటే క్రష్.. తను నన్ను బాగా ఆకట్టుకుంది: రామ్ చరణ్
ఆర్ఆర్ఆర్ సినిమాతో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజై మంచి విజయం సాధించడంతో చరణ్‌కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్‌కు కొద్ది దూరంలో ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ సన్సెషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ హాలీవుడ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో చరణ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. చదవండి: వాలంటైన్స్ డే: తమన్నా-విజయ్ వర్మ రిలేషన్‌పై క్లారిటీ వచ్చేసింది? ఈ సందర్భంగా హీరోయిన్లలో తన క్రష్ ఎవరనే ప్రశ్న ఎదురైంది చెర్రికి. దీనికి అతడు స్పందిస్తూ హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్ అని సమాధానం ఇచ్చాడు. ‘జూలియా రాబర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఆమెను స్క్రీన్‌పై ఎప్పుడు చూసిన అలా కళ్లు ఆర్పకుండ చూస్తూనే ఉండిపోతా. దాన్ని అబ్సెషన్ అంటారో లేదో తెలియదు కానీ ఆమెలో ఏదో ప్రత్యేక ఉంది. అందుకే ఆమె నన్ను అంతగా ఆకర్షిస్తుంది. ‘ప్రెట్టీ ఉమెన్’ మూవీ నుంచి నేను ఆమెకు పెద్ద ఫ్యాన్‌ని. అలాగే ‘ఎంట్రాప్ మెంట్’ హీరోయిన్ కేథిరిన్ జీటా జోన్స్ యాక్టింగ్ చూసి ఫిదా అయ్యాను. ఆమె నటించిన సినిమాల్లో నేను మొదట చూసంది మార్క్ ఆఫ్ జోరో. ఈ సినిమా నుంచే ఆమెను ఫాలో అవ్వడం స్టార్ట్ చేశా’ అంటూ చెప్పుకొచ్చాడు. -
అందమైన భామలు... లేత మెరుపు తీగలు...
ఇంత పొడవాటి గౌనులు వేసుకుని అంత అందంగా ఎలా నడుస్తారు? పైగా ఎత్తు మడమల చెప్పులతో అంత వయ్యారంగా ఎలా వాక్ చేస్తున్నారు? మెడ, చెవులనంటి పెట్టుకున్న ఆ ఆభరణాలు ఎంతో పుణ్యం చేసుకుని ఉంటాయి.. అని కాన్స్ చలనచిత్రోత్సవాల్లో పాల్గొంటున్న అందాల తారల గురించి అనుకోని వారుండరు. ప్రస్తుతం ఫ్రాన్స్ దేశంలో జరుగుతున్న ఈ ఉత్సవాలపైనే అందరి దృష్టి. ఈ వేడుకల్లో పాల్గొంటున్న తారల తళుకులను చూడ్డానికి రెండు కళ్లూ చాలడం లేదని సౌందర్యారాధకులు మురిసిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా టీనేజ్ నుంచి ఓల్డేజ్ వరకూ ఆడవాళ్లందరూ పొడవాటి గౌను, ఎత్తు మడమ చెప్పులు, వజ్రాభరణాలు ధరించి, ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఎర్ర తివాచీపై ఈ తారలు చేసే క్యాట్ వాక్ని కెమెరాల్లో బంధించడానికి ఫొటోగ్రాఫర్లు తెగ తాపత్రయపడిపోతారు. అందుకే, పొరపాటున గౌను తొలగినా, ఎవరైనా జారి పడినా కెమెరా కన్ను నుంచి తప్పించుకోలేరు. గురువారం ప్రముఖ అందాల తార జూలియా రాబర్ట్స్ అలా ఓ విషయంలో కెమెరాలకు దొరికిపోయారు. అదేంటంటే... ‘జూలియా.. వాటె కలర్ యార్’ అనుకునే రేంజ్లో తెల్లగా ఉంటారీ బ్యూటీ. నలుపు రంగు గౌనులో ఈ ఉత్సవాలకు హాజరయ్యారు జూలియా. ఆ గౌనులో ఆమె తెల్లని దేహం మెరిసిపోయింది. వజ్రాల కంఠాభరణం మినహా ఒంటి మీద వేరే ఏ ఆభరణం లేకపోయినా ఆమె తళుకులీనారు. ఎత్తు మడమ చెప్పులతో వచ్చిన జూలియా మెట్లు ఎక్కేటప్పుడు జారి పడిపోతానని భయపడ్డారేమో. వాటిని విడిచేసి, వట్టి కాళ్లతో మెట్లెక్కేశారు. రెప్పపాటులో జరిగిపోయిన ఈ తతంగాన్ని కెమెరా కళ్లు క్యాప్చర్ చేసేశాయి. మెట్లెక్కేసిన తర్వాత సహాయకుడు చెప్పులు తెస్తే, తొడుక్కున్నారామె. ఇదో విషయమా అనుకునేరు. మామూలుగా ఇలాంటి పెద్ద పెద్ద వేడుకలకు డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆడవాళ్లేమో లాంగ్ ఫ్రాక్స్, హై హీల్స్ వేసుకోవాలి. మగవాళ్లు సూటూ, బూటూ ధరించాల్సిందే. గతేడాది కొంతమంది తారలు ఎత్తు మడమ చెప్పులు కాకుండా ఫ్లాట్స్ వేసుకుని వస్తే, అనుమతించలేదు. వాళ్లు వెనుతిరగాల్సి వచ్చింది. అలాంటిది జూలియా వట్టి కాళ్లతో మెట్లెక్కితే ఊరుకుంటారా?.. ఊరుకున్నారు. ఎందుకంటే ఆమె జూలియా రాబర్ట్స్ కాబట్టి. ఏదేమైనా ఇంట్లో ఉన్నప్పుడు జూలియా కాళ్లను చెప్పులు అంటిపెట్టుకుని ఉంటాయి. అందుకే పాదరక్షలు లేకుండా ఆమె కాసేపే నడిచినా పెద్ద టాపిక్ అయ్యింది. అయ్యో పాపం... అమల్! నటుడు జార్జ్ క్లూనే సతీమణి, నటి అమల్ క్లూనే పాపం ఇబ్బందిపడే పరిస్థితి తెచ్చుకున్నారు. భర్త చెయ్యి పట్టుకుని అందంగా నడుచుకుంటూ వచ్చిన అమల్ పొరపాటున తన పొడవాటి గౌను పైన కాలు వేశారు. రెండు చీలికల్లా డిజైన్ చేయబడిన ఆ గౌను అటూ ఇటూ కావడంతో అమల్ ఇబ్బందిపడిపోయారు. కంగారుగా గౌను సర్దుకుని, పాలిపోయిన మొహంతో ముందుకు సాగారామె. ఊడీ... పరమ మూడీ! రసవత్తరంగా జరుగుతున్న వేడుకల్లో ఆనందపడేవాళ్లూ, అలిగే వాళ్లూ ఉంటారు. అలా దర్శకుడు ఊడీ అలెన్ అలిగారు. తన కుమార్తె ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమెపై ఊడీ అత్యాచారం చేశారనే అభియోగం ఉంది. ఈ విషయం గురించి వేడుకలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఫ్రెంచ్ హాస్యనటుడు లారెంట్ లఫిట్టె జోక్ చేశారు. యూరోపియన్ దర్శకుడు రోమన్ పొలాన్స్కీతో ఊడీని పోల్చారు లఫిట్టె. రోమన్ తన 13 ఏళ్ల కుమార్తెపై అత్యాచార ప్రయత్నం చేసిన విషయం బయటకు రావడంతో, అభియోగాలు భరించలేక ఆయన ఏకంగా యూఎస్ నుంచి యూరోప్ పారిపోయి అక్కడ సినిమాలు చేసుకుంటున్నారనీ, ‘మరి మీ మీద అత్యాచార ఆరోపణలు నిర్ధారణ కాకపోయినా సరే మీరెందుకు రోమన్‌లా యూరోప్‌లోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు?’ అని లఫిట్టె చమత్కరించడంతో ఊడీ మొహం ఎర్రబారింది. లఫిట్టె మాటల్లో గూఢార్థం ఉంది. ఊడీ అత్యాచార యత్నం చేశారు కాబట్టే, యూఎస్‌లో ఎక్కువ సినిమాలు చేయడంలేదన్న భావం వ్యాఖ్యాత మాటల్లో కనపడింది. అది విని కొంతమంది నవ్వేసరికి, ఊడీ ముఖం కందగడ్డలా మారింది. లఫిట్టె ఇలా ‘రేప్ జోక్’ చేయడం కొంతమందికి అస్సలు నచ్చలేదు. కొందరు హాలీవుడ్ నటీమణులు బాహాటంగానే అతణ్ణి విమర్శించారు. దాంతో ఊడీ మనసు కొంచెం శాంతించి ఉంటుంది. ఇదిలా ఉంటే... గురువారం ఈ వేడుకలకు హాజరైనవారిలో... నటీమణులు అన్నా కెండ్రిక్, చెరిల్ కోల్, నయోమీ వాట్స్, జెస్సికా చేస్టైన్, క్రిస్టెన్ స్టీవాట్ తదితరులు ఉన్నారు. -
హాలీవుడ్ యోగా
మనశ్శాంతితో ఉంటున్నాను! యోగా ఒకప్పుడు భారత ఉపఖండానికే పరిమితమై ఉండేది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. పాశ్చాత్యదేశాలు యోగా వైపు మొగ్గు చూపుతున్నాయి. శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ప్రశాంతత కోసం కూడా చాలామంది పాశ్చాత్య ప్రముఖులు యోగ సాధన సాగిస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ నటి, ఆస్కార్ అవార్డు గ్రహీత జూలియా రాబర్ట్స్ కొన్నేళ్లుగా యోగ సాధన చేస్తున్నారు. యోగా వల్ల తన శరీరం అదుపులో ఉంటోందని, మానసికంగానూ ప్రశాంతంగా ఉండగలుగుతున్నానని ఆమె చెబుతున్నారు. హాలీవుడ్ ట్రెండ్‌కు భిన్నంగా బోటాక్స్ వంటి సౌందర్య చికిత్సలేవీ లేకుండానే జూలియా రాబర్ట్స్ తన అందచందాలను, ఆరోగ్యాన్ని కాపాడు కోగలుగుతున్నారంటే అందుకు యోగాసనాలే కారణం. -
అందాల రాశి.. కొన్ని నిజాలు
మెరిసే అందమైన కళ్లు ఆమె సొంతం. ఆమె అలా చిరునవ్వు నవ్విందంటే వెయ్యి వాల్టుల వెలుగు. దశాబ్దాల తరబడి వేలాదిమంది రసజ్ఞుల గుండెల్లో గూడు కట్టుకున్న కలల రాణి. బ్యూటి విత్ టాలెంట్‌కు ఆమె నిలువెత్తు నిదర్శనం...ఆమే హాలీవుడ్ నటీమణి జూలియా రాబర్ట్స్. అక్టోబర్ 28 ఆమె పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఆమెకు అభినందన నీరాజనాలు పలుకుతున్నారు. ఈ సందర్భంగా ఆస్కార అవార్డు విజేత, అందాలరాశి జూలీకి సంబంధించిన కొన్ని ముచ్చట్లు.. 1967 అక్టోబర్ 28న లౌ బ్రాడ్మస్,వాల్టర్ గ్రాడీ రాబర్ట్స్ దంపతులకు జూలియా రాబర్ట్స్ జన్మించింది. తల్లిదండ్రులు ఇద్దరూ నటులే బహుశా వారి వారసత్వమే జూలీకి వరంగా లభించినట్టుంది. జూలియాకు ఆరు భాషల్లో ప్రావీణ్యం వుంది. ఇంగ్లీషు, జర్మనీ, స్వీడిష్, ఐరిష్, స్కాటిష్ , వెల్స్ భాషలు ఆమెకు తెలుసు. అన్నట్టు జూలియాకి క్లారినెట్ వాయించడంలో ప్రవేశం వుంది. స్కూలుస్థాయి సంగీత ట్రూపులో ఆమె పనిచేసింది. దీంతోపాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజాన్ని అభ్యసించినా ఇప్పటికీ జర్నలిజం డిగ్రీని మాత్రం చేయలేకపోయింది. నటిగా హాలీవుడ్ లో స్థిరపడకముందు ఆమె స్థానిక టెలివిజన్ షోలో పనిచేసింది. 1986-88 లో ప్రసారమైన ఒక క్రైమ్ స్టోరీ సీరియల్లో తొలిసారిగా మేకప్ వేసుకుంది. అన్నట్టు కుట్లు అల్లికలంటే ఎక్కువ మక్కువ వున్న జూలియా పశువుల డాక్టర్ కావాలని కలలు కందట. 1987లో తన పందొమ్మిదేళ్ల వయసులో 35 ఏళ్ల లియామ్ నీసన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఓ ఏడాదికే ఇద్దరూ విడిపోయారు. ఆ తరువాత 2002 జూలైలో కెమెరామెన్ డానియల్ మోడెర్ను పెళ్లాడింది. బ్రూస్ లీ ఒక్కరే ఈ వివాహానికి అతిథి. ది మెక్సికన్ చిత్రీకరణ సమయంలో చూపులు కలిసి ఒక్కటైన వారిద్దరూ ఒక సంవత్సరం తర్వాత విడాకులు తీసుకున్నారు. తిరిగి జూలై 4, 2002న రాబర్ట్స్‌ను జూలియా వివాహం చేసుకుంది. 2004లో వారికి కవలలు కూతురు హాజెల్ ప్యాట్రిసియా మరియు కొడుకు ఫిన్నాయిస్ జన్మించారు. వారి మూడవ బిడ్డ, కొడుకు హెన్రీ డెనియల్ మోడెర్ లాస్ ఏంజిల్స్‌లో జూన్ 18, 2007న జన్మించాడు. బల్గేరియా తవ్వకాల్లో బయల్పడిన 9000 సంవత్సరానికి చెందిన ఒక స్కెలిటెన్ కు పురాతత్వ శాస్త్రవేత్తలు జూలియా రాబర్స్ట్ పేరుపెట్టారు. తాను హిందూ మతాన్ని ఆచరిస్తానని స్వయంగా జూలియా ఒక సందర్బంగా తెలిపింది. హాలీవుడ్లోఅత్యధిక పారితోషికం తీసుకున్న తొలి నటీమణి జూలియా. ఇరిన్ బ్రాకో విక్ సినిమాకు గాను ఆమె 20 మిలియన్ల యూఎస్ డాలర్ల పారితోషికాన్ని అందుకుంది. ఈ సినిమానే ఆమెకు అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును సాధించి పెట్టింది. వీటితో పాటు ఆమెకు లెక్కకుమించిన అవార్డులు, రివార్డులు.. ఆమె కెరియర్లో మైలురాళ్లుగా మిగిలాయి. రాబర్ట్స్, యూఎన్‌ఐసీఈఎఫ్, ఇతర స్వచ్ఛంద సంస్థలకు సమయంతో పాటు నిధులను వెచ్చిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. -
నేను చాలా రిస్క్ చేశా...
‘‘నలభై ఏళ్లు వస్తే చాలు.. హాలీవుడ్లో కొంతమంది కథానాయికలు ఏం చేసినా చేయకపోయినా ముందు డాక్టర్లను, బ్యూటీషియన్లను కలుస్తారు. ముడతలు పడితే.. వాటిని మాయం చేయడానికి, పడకపోతే.. పడకుండా ముందు జాగ్రత్తగా చేయాల్సిన వాటి గురించి అడుగుతారు’’ అని ప్రముఖ హాలీవుడ్ తార జూలియా రాబర్ట్స్ చెప్పారు. మరో ఐదేళ్లల్లో ఆమెకు 50 ఏళ్లొచ్చేస్తాయి. ప్రస్తుతం ఆమె ఓ సౌందర్య సాధనానికి ప్రచారకర్తగా చేస్తున్నారు. మామూలుగా ఇలాంటి అవకాశం కుర్ర తారలకు వస్తుంటుంది. కానీ, వయసు పెరుగుతున్నకొద్దీ జూలియా అందం పెరుగుతోందని, ఆమే ప్రచారకర్తగా కరెక్ట్ అని ఆ ఉత్పత్తిదారులు భావించారట. ఈ ప్రతిపాదన అంగీకరించే ముందు జూలియా ఓ విషయాన్ని స్పష్టంగా చెప్పారట. ‘‘నేనెలా ఉన్నానో అలానే కనిపిస్తా. కానీ ముడతలు తీయిస్తే ఇంకా బాగుంటారని మీరనకూడదు’’ అని కరాఖండీగా జూలియా చెప్పేశారట. అందుకు వారు సమ్మతించిన తర్వాతనే ఒప్పంద పత్రంలో సంతకం పెట్టారట. ‘‘వయసు పైబడిన తర్వాత ముడతలు తీయించుకుంటారు. కానీ, అందుకు ఇష్టపడక పెద్ద రిస్క్ చేశా. ప్రకృతి పరంగా వచ్చే దేన్నయినా స్వీకరించడం నా అలవాటు. అందుకే, ముడతలు తీయించుకోవడానికి ‘ఫేస్ లిఫ్ట్’ చేయించుకోలేదు. భవిష్యత్తులో కూడా ఇలానే ఉంటా’’ అన్నారు. -
హాలీవుడ్లో వేలం పాటలు!
సినిమా తారల ఆటోగ్రాఫులు తీసుకోవడం కోసం, ఫొటోలు దిగడం కోసం అభిమానులు ఉవ్విళ్లూరిపోతుంటారు. ఇక ఏకంగా వాళ్లు వాడిన వస్తువులు సొంతం చేసుకునే అవకాశం వస్తే, ఆస్తులు తాకట్టు పెట్టడానికి కూడా వెనకాడరు. పైగా, హాలీవుడ్ హాట్ లేడీ జూలియా రాబర్ట్స్‌కి సంబంధించినవైతే ఎంత క్రేజ్ ఉంటుందో ఊహించవచ్చు. ఆమె వాడిన కలమో, కత్తో, స్పూనో కాదు.. ఏకంగా లో దుస్తులను ఇటీవల వేలానికి పెట్టారు. ఓ సినిమాలో జూలియా ఈ లోదుస్తుల్లో దర్శనమిచ్చి, చాలామంది మతి పోగొట్టారు. ఆ సినిమా తాలూకు దుస్తులనే వేలానికి పెట్టారని తెలుసుకుని జూలియా వీరాభిమానులు వాటిని సొంతం చేసుకోవడానికి పోటీపడ్డారు. మామూలుగా హాలీవుడ్లో తారలు వాడిన వస్తువులను, దుస్తులను ఇలా వేలానికి పెడుతుంటారు. అయితే ఈ మధ్యకాలంలో జూలియా రాబర్ట్స్ లోదుస్తుల వేలంపాటకు వచ్చినంత క్రేజు వేరే దేనికీ రాలేదట. ఇప్పుడు మరో వేలంపాట పై చాలామంది దృష్టి ఉంది. దాదాపు 30 కార్లను వేలం పాటకు పెట్టనున్నారు. ఆ కార్లని వాడినది ఎవరో కాదు.. ప్రముఖ హాలీవుడ్ నటుడు పాల్ వాకర్. ఆరు నెలల క్రితం కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురై, దుర్మరణం పాలయ్యారు పాల్ వాకర్. ఆయనకు కార్లంటే విపరీతమైన పిచ్చి. అందుకే ‘ఆల్వేస్ ఇవాల్వింగ్’ పేరుతో రేస్ కార్స్ షాప్ కూడా ఆరంభించారాయన. ఈ షాప్‌లో ఉన్న అత్యంత ఖరీదు గల, సౌకర్యవంతమైన 30 కార్లను వేలానికి పెట్టనున్నారు. అయితే, ఈ వేలం పాటకు వాకర్ పేరుని మాత్రం ఉపయోగించరట. అయినప్పటికీ, ఆయన షాప్‌కి సంబంధించినవే కాబట్టి, ఈ వేలంపాటలో పాల్గొనాలని చాలామంది ఫిక్స్ అయ్యారట! -
అనవసరంగా ఏదో ఊహించుకున్నారు
తాను ప్రెగ్నెంట్ అని మీడియాలో వస్తున్న వార్తలను అస్కార్ అవార్డు విజేత, హాలీవుడ్ తార జూలియా రాబర్ట్స్ ఖండించారు. జూలియా రాబర్ట్స్ నాల్గవ బిడ్డకు తల్లి కాబోతుందని మీడియాలో రూమార్లు షికారు చేస్తున్నాయి. తాను వదులుగా ఉండే స్వెట్టర్‌ను ధరించడమే ఈ రూమర్లకు కారణమని ఆమె పేర్కొన్నారు. తన దుస్తుల స్టైల్ కారణంగానే ఏదో ఓ యాంగిల్లో ఫొటోలు తీసుకుని.. అనవసరంగా ఏదో ఉహించుకున్నారని జులియా ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఓ టెలివిజన్ కార్యక్రమంలో పాల్గొన్న జూలియాను ‘మరో బిడ్డను కనడం మీకు ఇష్టమేనా?’ అని అడిగిన ప్రశ్నకు ‘అవును’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు. జూలియా, డానియల్ మోడర్లకు కవల అమ్మాయిలతో పాటు ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.