Ram Charan Revealed He Has Huge Crush On Julia Roberts, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Ram Charan On Onscree Crush: ఆ హీరోయిన్‌ అంటే క్రష్‌.. తను నన్ను బాగా ఆకట్టుకుంది: రామ్‌ చరణ్‌

Published Wed, Feb 15 2023 7:31 PM | Last Updated on Wed, Feb 15 2023 8:02 PM

Ram Charan Revealed He Has Huge Crush on Julia Roberts - Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యాడు. ఆ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రిలీజై మంచి విజయం సాధించడంతో చరణ్‌కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ఆస్కార్‌కు కొద్ది దూరంలో ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్‌ చరణ్‌ సన్సెషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో ఆర్‌సీ 15 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ హాలీవుడ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో చరణ్‌ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 

చదవండి: వాలంటైన్స్‌ డే: తమన్నా-విజయ్‌ వర్మ రిలేషన్‌పై క్లారిటీ వచ్చేసింది?

ఈ సందర్భంగా హీరోయిన్లలో తన క్రష్‌ ఎవరనే ప్రశ్న ఎదురైంది చెర్రికి. దీనికి అతడు స్పందిస్తూ హాలీవుడ్‌ నటి జూలియా రాబర్ట్స్‌ అని సమాధానం ఇచ్చాడు. ‘జూలియా రాబర్ట్స్‌ అంటే చాలా ఇష్టం. ఆమెను స్క్రీన్‌పై ఎప్పుడు చూసిన అలా కళ్లు ఆర్పకుండ చూస్తూనే ఉండిపోతా. దాన్ని అబ్సెషన్ అంటారో లేదో తెలియదు కానీ ఆమెలో ఏదో ప్రత్యేక ఉంది. అందుకే ఆమె నన్ను అంతగా ఆకర్షిస్తుంది. ‘ప్రెట్టీ ఉమెన్‌’ మూవీ నుంచి నేను ఆమెకు పెద్ద ఫ్యాన్‌ని. అలాగే ‘ఎంట్రాప్ మెంట్’ హీరోయిన్‌ కేథిరిన్ జీటా జోన్స్‌ యాక్టింగ్ చూసి ఫిదా అయ్యాను. ఆమె నటించిన సినిమాల్లో నేను మొదట చూసంది మార్క్‌ ఆఫ్‌ జోరో. ఈ సినిమా నుంచే ఆమెను ఫాలో అవ్వడం స్టార్ట్‌ చేశా’ అంటూ చెప్పుకొచ్చాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement