Face Lift
-
ధైర్యంగా ఉండండి.. డస్టర్ - 2019 కమింగ్!
సాక్షి, న్యూఢిల్లీ: ఫ్రెంచ్ కంపెనీ రెనాల్ట్ తన పాపులర్మోడల్ కారు డస్టర్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఆధునిక సెక్యూరీటీ ఫీచర్లతో డస్టర్ ఫేస్‌లిఫ్ట్‌ను త్వరలోనే లాంచ్ చేయనుంది. గర్వంగా ఉండండి.. ధైర్యంగా వుండండి. విసుగు చెందకండి. బోర్డర్లను బద్దలుకొట్టండి.. న్యూ రెనాల్ట్ డస్టర్ జూలై 8వ తేదీన మార్కెట్లోకి వస్తోందని రెనాల్ట్ ట్వీట్ చేసింది. ఆర్ ఎక్స్ఈ, ఆర్ఎక్స్ఎస్, ఆర్ఎక్స్ జెడ్ మూడు వేరియంట్లలో వస్తున్న డస్టర్ ఫేస్‌లిఫ్ట్ ధరలను రూ. 8 లక్షలనుంచి రూ.13.10 లక్షలు(ఎక్స్‌షోరూం, ఢిల్లీ)గా నిర్ణయించింది. ఆర్ఎక్స్ఎస్ మోడల్ ఆల్‌వీల్ డ్రైవ్(ఏడబ్ల్యుడీ) ఆప్షన్‌ను అందిస్తోంది. బీఎస్ 6 నిబంధనలకనుగుణంగా 1.5 పెట్రోలు, డీజిల్ ఇంజీన్లలో తీసుకొస్తోంది. పెట్రోల్ , డీజీల్ ఇంజీన్ 108 బీహెచ్పీ పవర్‌ను, పెట్రోలు వెర్షన్ లీటరుకు 14 కి.మీలు, డీజిల్ వెర్షన్ లీటరు 19-20 కి.మీ మైలేజీనీ ఇస్తుంది. కొత్త వెర్షన్ డస్టర్ కారు హుందాయ్ క్రెటా, ఫోర్డ్ ఎక్సో స్పోర్ట్, మహీంద్ర ఎక్స్‌యూవీలకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. Be audacious, be daring, just don't be boring. Dare to push all limits in the #NewRenaultDUSTER. #NowEvenBOLDER Know more: https://t.co/IVCIbpfpTB pic.twitter.com/uOq1UmVagX — Renault India (@RenaultIndia) July 6, 2019 -
నేను చాలా రిస్క్ చేశా...
‘‘నలభై ఏళ్లు వస్తే చాలు.. హాలీవుడ్లో కొంతమంది కథానాయికలు ఏం చేసినా చేయకపోయినా ముందు డాక్టర్లను, బ్యూటీషియన్లను కలుస్తారు. ముడతలు పడితే.. వాటిని మాయం చేయడానికి, పడకపోతే.. పడకుండా ముందు జాగ్రత్తగా చేయాల్సిన వాటి గురించి అడుగుతారు’’ అని ప్రముఖ హాలీవుడ్ తార జూలియా రాబర్ట్స్ చెప్పారు. మరో ఐదేళ్లల్లో ఆమెకు 50 ఏళ్లొచ్చేస్తాయి. ప్రస్తుతం ఆమె ఓ సౌందర్య సాధనానికి ప్రచారకర్తగా చేస్తున్నారు. మామూలుగా ఇలాంటి అవకాశం కుర్ర తారలకు వస్తుంటుంది. కానీ, వయసు పెరుగుతున్నకొద్దీ జూలియా అందం పెరుగుతోందని, ఆమే ప్రచారకర్తగా కరెక్ట్ అని ఆ ఉత్పత్తిదారులు భావించారట. ఈ ప్రతిపాదన అంగీకరించే ముందు జూలియా ఓ విషయాన్ని స్పష్టంగా చెప్పారట. ‘‘నేనెలా ఉన్నానో అలానే కనిపిస్తా. కానీ ముడతలు తీయిస్తే ఇంకా బాగుంటారని మీరనకూడదు’’ అని కరాఖండీగా జూలియా చెప్పేశారట. అందుకు వారు సమ్మతించిన తర్వాతనే ఒప్పంద పత్రంలో సంతకం పెట్టారట. ‘‘వయసు పైబడిన తర్వాత ముడతలు తీయించుకుంటారు. కానీ, అందుకు ఇష్టపడక పెద్ద రిస్క్ చేశా. ప్రకృతి పరంగా వచ్చే దేన్నయినా స్వీకరించడం నా అలవాటు. అందుకే, ముడతలు తీయించుకోవడానికి ‘ఫేస్ లిఫ్ట్’ చేయించుకోలేదు. భవిష్యత్తులో కూడా ఇలానే ఉంటా’’ అన్నారు.