సాక్షి, న్యూఢిల్లీ: ఫ్రెంచ్ కంపెనీ రెనాల్ట్ తన పాపులర్‌మోడల్ కారు డస్టర్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఆధునిక సెక్యూరీటీ ఫీచర్లతో డస్టర్ ఫేస్‌లిఫ్ట్‌ను త్వరలోనే లాంచ్ చేయనుంది. గర్వంగా ఉండండి.. ధైర్యంగా వుండండి. విసుగు చెందకండి. బోర్డర్లను బద్దలుకొట్టండి.. న్యూ రెనాల్ట్ డస్టర్ జూలై 8వ తేదీన మార్కెట్లోకి వస్తోందని రెనాల్ట్ ట్వీట్ చేసింది.
ఆర్ ఎక్స్‌ఈ, ఆర్‌ఎక్స్‌ఎస్, ఆర్‌ఎక్స్ జెడ్ మూడు వేరియంట్లలో వస్తున్న డస్టర్ ఫేస్‌లిఫ్ట్ ధరలను రూ. 8 లక్షలనుంచి రూ.13.10 లక్షలు(ఎక్స్‌షోరూం, ఢిల్లీ)గా నిర్ణయించింది. ఆర్‌ఎక్స్‌ఎస్ మోడల్ ఆల్‌వీల్ డ్రైవ్(ఏడబ్ల్యుడీ) ఆప్షన్‌ను అందిస్తోంది. బీఎస్ 6 నిబంధనలకనుగుణంగా 1.5 పెట్రోలు, డీజిల్ ఇంజీన్లలో తీసుకొస్తోంది. పెట్రోల్ , డీజీల్ ఇంజీన్ 108 బీహెచ్‌పీ పవర్‌ను, పెట్రోలు వెర్షన్ లీటరుకు 14 కి.మీలు, డీజిల్ వెర్షన్ లీటరు 19-20 కి.మీ మైలేజీనీ ఇస్తుంది. కొత్త వెర్షన్ డస్టర్ కారు హుందాయ్ క్రెటా, ఫోర్డ్ ఎక్సో స్పోర్ట్, మహీంద్ర ఎక్స్‌యూవీలకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.
Be audacious, be daring, just don't be boring. Dare to push all limits in the #NewRenaultDUSTER. #NowEvenBOLDER
— Renault India (@RenaultIndia) July 6, 2019
Know more: https://t.co/IVCIbpfpTB pic.twitter.com/uOq1UmVagX
Comments
Please login to add a commentAdd a comment