న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ రెనో తాజాగా ఆధునీకరించిన కాంపాక్ట్ ఎస్‌యూవీ కైగర్‌ను విడుదల చేసింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.5.84 లక్షల నుంచి ప్రారంభం. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్‌తో 1.0 లీటర్ టర్బో ఇంజిన్, కారు లోపల స్వచ్ఛమైన గాలి కోసం పీఎం2.5 అట్మాస్ఫెరిక్ ఫిల్టర్, క్రూజ్ కంట్రోల్, మల్టీ సెన్స్ డ్రైవింగ్ మోడ్స్ వంటి హంగులు ఉన్నాయి. అలాగే, ఇందులో వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ చార్జింగ్ సదుపాయం కూడా ఉన్నది.
ప్రపంచవ్యాప్తంగా సంస్థకు తొలి అయిదు మార్కెట్లలో భారత్‌ను నిలపడంలో ఈ మోడల్ కీలకంగా ఉందని కంపెనీ ప్రకటించింది. ఫ్రెంచ్, భారత బృందాలు కారు రూపకల్పనలో పాలుపంచుకున్నాయని వివరించింది. ప్రపంచంలో ఇతర దేశాల్లో విడుదలకు ముందే రెనో నుంచి తొలిసారిగా భారత్‌లో పరిచయం అయిన మూడవ మోడల్ ఇది. 2021 ప్రారంభంలో దేశంలో అడుగుపెట్టింది. నేపాల్, దక్షిణాఫ్రికా, ఇండోనేసియాకు భారత్ నుంచి ఎగుమతి అవుతోంది.
(చదవండి: సామాన్యుడు బతికేది ఎలా?.. మోత మోగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు!)
Comments
Please login to add a commentAdd a comment