Renault India
-
ఈ కార్ల కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్స్ - పూర్తి వివరాలు
ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'రెనాల్ట్ ఇండియా' ఈ ఏడాది బ్రాండ్ కార్లను కొనుగోలు చేసేవారి కోసం అద్భుతమైన ఆఫర్లను తీసుకువచ్చింది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, లాయల్టీ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్స్, ఎక్స్చేంజ్ బోనస్ వంటి వున్నాయి. కంపెనీ అందించే ఈ బెనిఫిట్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రెనాల్ట్ కైగర్ కంపెనీ తన రెనాల్ట్ కైగర్ కొనుగోలుపైన రూ. 65,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇందులో రూ.25,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 స్పెషల్ కస్టమర్ లాయల్టీ బోనస్‌లు, రూ.12,000 కార్పొరేట్ బెనిఫిట్స్ మొదలైనవి ఉన్నాయి. 1.0 లీటర్ పెట్రోల్, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభించే ఈ మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. రెనాల్ట్ ట్రైబర్ రెనాల్ట్ ట్రైబర్ కొనుగోలుపైన కంపెనీ రూ.50000 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో రూ.20,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, రూ.10,000 లాయల్టీ కస్టమర్ ప్రయోజనాల కింద తగ్గింపు ఉన్నాయి. రూ.6.34 లక్షల ప్రారంభ ధర వద్ద లభిస్తున్న ఈ కారును ఈ నెలలో కొనుగోలు చేస్తే రూ.50,000 వరకు సేవ్ అవుతుంది. ఇదీ చదవండి: 2024లో మరింత వేగంగా భారత్ వృద్ధి - అసోచామ్ రెనాల్ట్ క్విడ్ ప్రారంభం నుంచి అత్యుత్తమ అమ్మకాలు పొందుతున్న రెనాల్ట్ క్విడ్ కొనుగోలుపైన కంపెనీ ఇప్పుడు రూ. 50000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, లాయల్టీ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్స్, ఎక్స్చేంజ్ బోనస్ వంటివి ఉన్నాయి. రూ.4.5 లక్షల ప్రారంభ ధరలో లభించే ఈ కారుని ఇప్పుడు రూ.50,000 తగ్గింపుతో ఈ నెలలో కొనుగోలు చేయవచ్చు. Note: రెనాల్ట్ కంపెనీ అందిస్తున్న ఆఫర్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా కంపెనీ అందించే తగ్గింపులు కేవలం మరో రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి వినియోగదారులు సమీపంలోని అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవాలి. -
ఫెస్టివ్ సీజన్: పలు కంపెనీల కార్లపై డిస్కౌంట్ బొనాంజా
సాక్షి,ముంబై: రానున్న పండుగల సీజన్లో కస్టమర్లను ఆకర్షించేందుకు ఆటోమొబైల్ దిగ్గజాలు ఆపర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఎంట్రీ లెవల్, చిన్న కార్లపై డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటించాయి. ఇందులో దిగ్గజ సంస్థలు కార్లుపోటీ పడుతుండటం విశేషం. మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా, హ్యుందాయ్, రెనాల్ట్ తమ కార్లను తక్కువ ధరల్లోనే కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చాయి. మారుతి సుజుకి మారుతి కొన్ని మోడల్‌లు రూ. 50,000 వరకు భారీ ఆఫర్‌తోపాటు, క్యాష్ ఎక్స్ఛేంజ్ బోనస్‌ల రూపంలో తొమ్మిది నుంచి 60వేల రూపాయల దాకా డిస్కౌంట్లను అందిస్తోంది. మారుతి సుజుకి ఆల్టో, వ్యాగన్ ఆర్, క్లెరియో, ఎస్-ప్రెస్సో, స్విఫ్ట్ , డిజైర్ వంటి మోడళ్లపై నగదు తగ్గింపులను అందిస్తోంది. అన్ని మోడల్‌లు కూడా ఎక్స్ఛేంజ్ బోనస్ లభ్యం. రెనాల్ట్ ఇండియా రెనాల్ట్ ఇండియా క్విడ్ హ్యాచ్‌బ్యాక్, ట్రైబర్ MPV, కిగర్ కాంపాక్ట్ SUV తదితర మోడళ్లపై రూ. 60,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఇంకా నగదు తగ్గింపులు, స్క్రాపేజ్ ప్రయోజనాలు ,ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో కూడా అందిస్తోంది. దీంతోపాటు ప్రత్యేక ఫ్రీడమ్ కార్నివాల్ ఆఫర్ కింద రూ. 5,000 విలువైన యాక్సెసరీలు ఉచితం. అలాగే తన అన్ని మోడళ్లలో యాక్సెసరీలపై పరిమిత ఫ్రీడమ్ కార్నివాల్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. హ్యుందాయ్ దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుందాయ్ సాంత్రో, ఐ10 నియోస్, ఔరా, ఐ20, ఎక్స్ంట్, కొనా ఈవీ వంటికార్లపై సుమారు రూ.13 వేల నుంచి రూ.50 వేల వరకు తగ్గింపును అందిస్తోంది. దీంతోపాటు క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బెనిఫిట్లు, అదనపు ఇన్సెంటివ్‌లు అందించనుంది. టాటా మోటార్స్ టాటా మోటార్స్ వివిధ మోడళ్లలో పండుగ సీజన్ డిస్కౌంట్లు 20- 40వేల రూపాయల విలువైన పథకాలను అందిస్తోంది. ప్రధానంగా టియాగో, టైగోర్, నెక్సాన్, సఫారీ వంటి మోడల్ కార్లపై రూ.40 వేల వరకు డిస్కౌంట్లు ప్రకటించింది. అలాగే ఓనం పండుగ సందర్భంగా కేరళ వాసుల కోసం బంపర్ ఆఫర్లను ప్రకటించింది. దేశీయంగా మహీంద్రా కూడా ఎక్స్‌యూవీ300, బొలెరో, బొలెరో నియో వంటి మోడల్ కార్లపై పలు ఇన్సెంటివ్‌లు, ఆఫర్లు ప్రకటించింది. గత నాలుగు నెలల్లో రిటైల్ విక్రయాలు వెనుకబడి ఉన్నాయి. ఎంట్రీ లెవల్లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు ప్రస్తుతం పుంజుకుంటున్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమోటివ్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వింకేష్ గులాటి వెల్లడించారు.దీంతోపాటు, రానున్న నెలల్లో మెరుగైన సరఫరాతో, కస్టమర్ల వెయిటింగ్ పీరియడ్ గణనీయంగా తగ్గించాలని కోరారు. దీనికి అనుగుణంగా ప్యాసింజర్ వెహికల్ ఒరిజినల్-ఎక్విప్మెంట్ తయారీదారులందరూ మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా తమ సరఫరాలను రీకాలిబ్రేట్ చేయాలని గులాటీ కోరారు. గత కొన్ని నెలలుగా తమ ప్రొడక్షన్ ప్లాంట్లలో 95 శాతం ఉత్పత్తి చేయాలని ప్రణాళికల్లో ఉన్నామని మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా కార్ల ఉత్పత్తి చేయడం కార్ల తయారీ సంస్థలకు పెద్ద సవాల్ అని పేర్కొన్నారు. -
సరికొత్తగా రెనో కైగర్.. అదిరిపోయిన ఫీచర్స్!
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ రెనో తాజాగా ఆధునీకరించిన కాంపాక్ట్ ఎస్యూవీ కైగర్‌ను విడుదల చేసింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.5.84 లక్షల నుంచి ప్రారంభం. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్‌తో 1.0 లీటర్ టర్బో ఇంజిన్, కారు లోపల స్వచ్ఛమైన గాలి కోసం పీఎం2.5 అట్మాస్ఫెరిక్ ఫిల్టర్, క్రూజ్ కంట్రోల్, మల్టీ సెన్స్ డ్రైవింగ్ మోడ్స్ వంటి హంగులు ఉన్నాయి. అలాగే, ఇందులో వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ చార్జింగ్ సదుపాయం కూడా ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా సంస్థకు తొలి అయిదు మార్కెట్లలో భారత్‌ను నిలపడంలో ఈ మోడల్ కీలకంగా ఉందని కంపెనీ ప్రకటించింది. ఫ్రెంచ్, భారత బృందాలు కారు రూపకల్పనలో పాలుపంచుకున్నాయని వివరించింది. ప్రపంచంలో ఇతర దేశాల్లో విడుదలకు ముందే రెనో నుంచి తొలిసారిగా భారత్‌లో పరిచయం అయిన మూడవ మోడల్ ఇది. 2021 ప్రారంభంలో దేశంలో అడుగుపెట్టింది. నేపాల్, దక్షిణాఫ్రికా, ఇండోనేసియాకు భారత్ నుంచి ఎగుమతి అవుతోంది. (చదవండి: సామాన్యుడు బతికేది ఎలా?.. మోత మోగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు!) -
బెస్ట్ సెల్లింగ్ కార్.. 5 లక్షల కంటే తక్కువ ధరలోనే రెనాల్ట్ క్విడ్
భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ కార్లకు భారీ ఆదరణ నెలకొంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు పలు ఆటోమొబైల్ కంపెనీలు సరికొత్త మోడల్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ ఇండియా సరికొత్తగా రెనాల్ట్ క్విడ్ MY22 ఆర్ఎక్స్(ఓ)కారును లాంచ్ చేసింది. రెనాల్ట్ క్విడ్‌ను కంపెనీ 2015లో ప్రారంభించగా ఇప్పటివరకు 4 లక్షలకు పైగా క్విడ్ యూనిట్లు అమ్ముడయ్యాయి. క్విడ్ అమ్మకాలను మరింత పెంచేందుగాను రెనాల్ట్ ఇండియా సరికొత్త MY22 రెనాల్ట్ క్విడ్‌ను RXL(O) వేరియంట్‌ను తీసుకొచ్చింది. ఈ కారు 1.0L MT, 0.8L రెండు ఎంపికలలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. డిజైన్‌లో సరికొత్తగా..! క్విడ్ క్లైంబర్ ఎడిషన్ కొత్త ఇంటీరియర్, ఎక్స్టీరియర్ కలర్‌తో స్పోర్టీ వైట్ యాక్సెంట్లను కలిగి ఉంది. 8 అంగుళాల టచ్‌స్క్రీన్ MediaNAV ఎవల్యూషన్‌తో ఇన్ఫోటైన్మెంట్ రానుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వీడియో ప్లేబ్యాక్, వాయిస్ రికగ్నిషన్‌కు సపోర్ట్ చేయనుంది. ఈ కారుకు సిల్వర్ స్ట్రీక్ ఎల్ఈడీ డీఆర్ఎల్తో మరింత ఆకర్షణగా నిలవనుంది. దీంతో పాటుగా రివర్స్ పార్కింగ్ కెమెరా , ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ఓఆర్వీఎమ్ ఉన్నాయి. ధర ఎంతంటే..! 2022 రెనాల్ట్ క్విడ్ లాంచ్ ధర రూ. 4.49 లక్షలుగా(ఎక్స్‌షోరూమ్) ఉంది. డ్యూయల్ టోన్ బ్లాక్ రూఫ్‌తో మెటల్ మస్టర్డ్ , ఐస్ కూల్ వైట్, మోనోటోన్ మూన్లైట్ సిల్వర్, జన్స్కార్ బ్లూ కలర్ ఆప్షన్లలో 2022 MY22 రెనాల్ట్ క్విడ్ అందుబాటులో ఉండనుంది. ఇంజన్ విషయానికి వస్తే..! కొత్త క్విడ్‌లో ఎలాంటి మెకానికల్‌గా ఎలాంటి మార్పులు చేయలేదు. రెండు పెట్రోల్ ఇంజన్ల ఎంపికతో అందుబాటులో ఉండనుంది. 0.8-లీటర్ ఇంజన్ క్విడ్ 53 బిహెచ్పి, 72 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. మరొక వేరియంట్ 1.0-లీటర్ ఇంజన్67 బీహెచ్పీ, 91 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కారు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో స్టాండర్డ్‌గా వస్తుంది. చదవండి: మహీంద్రా థార్‌కు పోటీ..! సరికొత్తగా రానున్న ఫోర్స్ గుర్ఖా..! -
లక్ష మార్కును దాటిన రెనో ట్రైబర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీ పర్పస్ వెహికల్ ట్రైబర్ ఒక లక్ష యూనిట్ల విక్రయాల మార్కును దాటిందని వాహన తయారీ సంస్థ రెనో ఇండియా శుక్రవారం ప్రకటించింది. ఈ మైలురాయిని పురస్కరించుకుని ట్రైబర్ లిమిటెడ్ ఎడిషన్‌ను కంపెనీ విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.7.24 లక్షలు. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో తయారైంది. మాన్యువల్‌తోపాటు ఈజీ–ఆర్ ఆటోమేటెడ్ మాన్యువ ల్ ట్రాన్స్‌మిషన్స్‌తో లభిస్తుంది. స్టీరింగ్ మౌం టెడ్ ఆడియో, ఫోన్ కంట్రోల్స్, సిక్స్ వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, గైడ్‌లైన్స్‌తో రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి హంగులు ఉన్నాయి. 2019 ఆగస్ట్‌లో దేశంలో ట్రైబర్ రంగ ప్రవేశం చేసింది. రెనోకు చెందిన ఫ్రాన్స్, భారత బృం దాలు ఈ కారు రూపకల్పనలో పాలుపంచుకున్నాయి. -
కార్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్లు, రైతులకు అదనంగా!
కార్ల కొనుగోలు దారులకు బంపర్ ఆఫర్. మన దేశంలో ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఫ్రాన్స్ కార్ల కంపెనీ రెనాల్ట్' రెనాల్ట్ ఇండియా' కార్ల కొనుగోలు దారులకు కళ్లు చెదిరేలా డిస్కౌంట్ అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. జనవరి ఫెస్టివల్ సీజన్ సందర్భంగా రెనాల్ట్ ఇండియా పలు కార్లపై భారీ డిస్కౌంట్ అందిస్తుంది. డిస్కౌంట్‌తో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. ఇక రెనాల్ట్ ఇండియా కార్లపై డిస్కౌంట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. రెనాల్ట్ క్విడ్ రెనాల్ట్ క్విడ్ రెండు వెర్షన్ల కారు కొనుగోలు దారులు డిస్కౌంట్‌తో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. మోడల్ 1.0-లీటరు వెర్షన్ కారు కొనుగోలుపై రూ 5,000 మై 2022 మోడళ్ల (08.లీటర్ వెర్షన్లు తప్ప)పై రూ 10,000 డిస్కౌంట్‌తో పాటు అదనంగా రూ.15,000 వరకు ఎక్ఛేంజ్ బోనస్‌ను దక్కించుకోవచ్చు.కార్పొరేట్, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 10,000, రూ. 5,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఆర్ఎక్స్ఈ 0.8 లీటర్ వేరియంట్ పై రూ.10,000 లాయల్టీ ప్రయోజనాల్ని పొందవచ్చు. రెనాల్ట్ కిగర్ రెనాల్ట్ కిగర్ కారు కొనుగోలు దారులకు లాయల్టీ బెన్ఫిట్ కింద రూ.10వేల వరకు తగ్గింపు పొందవచ్చు.దీంతో పాటు కార్పొరేట్ డిస్కౌంట్, గ్రామీణ ప్రాంతాల్లో ఈ కారు కొనుగోలు దారులకు రూ.10,000, రూ.5,000 డిస్కౌంట్ పొందవచ్చు. రెనాల్ట్ ట్రైబర్ రెనాల్ట్ ట్రైబర్ కొనుగోలు దారులు ఎంవై 2021 మోడల్‌పై రూ. 10,000 (ఆర్ఎక్స్ఈ వేరియంట్ మినహా) డిస్కౌంట్, ఎక్ఛేంజ్ కింద రూ.20,000 వరకు ఆఫర్‌ను సొంతం చేసుకోవచ్చు. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎక్స్ఈ వేరియంట్‌పై లాయల్టీ బోనస్ రూ.10,000, రైతులు, సర్పంచ్, గ్రామ పంచాయితీ సభ్యులకు రూ.5,000 డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. సెలక్ట్ చేసిన వేరియంట్లపై కార్పొరేటర్లు,పీఎస్‌యూల(ప్రభుత్వ ఉద్యోగస్తులకు) రూ.10,000 వరకు కార్పొరేట్ తగ్గింపును కూడా ఎంచుకోవచ్చు రెనాల్ట్ డస్టర్ రెనాల్ట్ డస్టర్ అన్ని వేరియంట్లపై (ఆర్ఎక్స్ జెడ్1.5 ట్రిమ్ మినహా) రూ.50,000 ఎక్ఛేంజ్ ఆఫర్, రూ.50,000 డిస్కౌంట్ పొందవచ్చు. కార్పొరేట్, ప్రభుత్వ ఉద్యోగులకు ఎంపిక చేసిన వేరియంట్లలో రూ.30,000, గ్రామీణ ప్రాంతాల కొనుగోలు దారులు రూ.15,000 వరకు సొంతం చేసుకోవచ్చు. చదవండి: బంపరాఫర్..! మహీంద్రా కార్లపై రూ. 82 వేల వరకు భారీ తగ్గింపు.! -
రెనాల్ట్ కార్లపై బంపరాఫర్.. రూ.40 వేల వరకు డిస్కౌంట్!
మీరు ఈ కొత్త ఏడాదిలో కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. రెనాల్ట్ ఇండియా ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న కిగర్, ట్రైబర్, క్విడ్ , డస్టర్ వంటి 4 మోడళ్లపై భారీగా డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్లో భాగంగా కస్టమర్లు రూ.40,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ కొత్త సంవత్సరంలో రెనాల్ట్ కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మీకు మంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చు. రెనాల్ట్ క్విడ్ రెనాల్ట్ క్విడ్ మీద ప్రస్తుతం రూ. 35,000 వరకు కంపెనీ డిస్కౌంట్ అందిస్తుంది. ఇందులో ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ బోనస్, రైతులకు ప్రత్యేక ఆఫర్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. అలాగే, ఈ నెలలో క్విడ్‌ను కొనుగోలు చేస్తే రూ. 10,000 ప్రత్యేక లాయల్టీ బోనస్ తో పాటు, స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద, రూ. 10,000 ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. రెనాల్ట్ కిగర్ రెనాల్ట్ కిగర్ గత నెలలో భారత మార్కెట్లో ఫ్రెంచ్ ఆటోమేకర్ రెండవ అత్యధికంగా అమ్ముడైన మోడల్. అయితే ఈ నెలలో ఈ కారు మీద రూ.10,000 ప్రత్యేక లాయల్టీ బోనస్, రూ.10,000 కార్పొరేట్ బెనిఫిట్ అందిస్తుంది. రెనాల్ట్ ట్రైబర్ రెనాల్ట్ ట్రైబర్ కొనుగోలుపై రూ.40,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇందులో ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ప్రయోజనాలు, నగదు ప్రోత్సాహకాలు, రైతులకు ప్రత్యేక రాయితీలు ఉన్నాయి. అయితే, విఎన్ 2021 మోడల్ కొనుగోలు చేసినప్పుడు ప్రయోజనాలు రూ.30,000కు తగ్గుతాయి. ఇది కాకుండా స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద రూ. 10,000 లాయల్టీ బోనస్, రూ. 10,000 ప్రయోజనం కూడా పొందవచ్చు. రెనాల్ట్ డస్టర్ రెనాల్ట్ డస్టర్ పై రూ.1.10 లక్షల విలువైన ప్రత్యేక లాయల్టీ ప్రయోజనాలు అందిస్తుంది. రూ. 1.30 లక్షల ముందస్తు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద, రూ. 10,000 ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. -
కార్ల కొనుగోలుపై లక్షకు పైగా భారీ డిస్కౌంట్లు, రైతులకు అదనంగా
జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. న్యూఇయర్ సందర్భంగా రెనాల్ట్ ఇండియా కార్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతులకు, సర్పంచ్, గ్రామ పంచాయతీ సభ్యులకు క్యాష్ డిస్కౌంట్లు,ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు వెల్లడించింది. రెనాల్ట్ ట్రైబర్ ప్రీ ఎంఐ 2021, ఎంఐ 2021 రెనాల్ట్ ట్రైబర్ ఎంఐ 2021 మోడల్ కొనుగోలుపై రూ.25,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్ (కార్పొరేట్, ప్రభుత్వ రంగ సంస్థల జాబితా) పొందవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, సర్పంచ్, గ్రామ పంచాయతీ సభ్యులకు ప్రీ ఎంఐ 2021, ఎంఐ 2021 మోడల్‌లపై రూ.5,000 తగ్గింపు పొందవచ్చు. రెనాల్ట్ డస్టర్ నవంబర్ 2021 లో డస్టర్ ఆఫర్లలో రూ. 50,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 50,000 నగదు తగ్గింపు, రూ. 30,000 వరకు కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి. రైతులు, సర్పంచ్ గ్రామ పంచాయతీ సభ్యులకు రూ.15,000 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా, డస్టర్ 1.5 ఆర్ ఎక్స్ జెడ్ ట్రిమ్ ఇటీవల రూ. 46,060 ధర తగ్గింపును పొందింది. ఈ విధంగా, ఈ వేరియంట్‌పై ఆఫర్ రూ. 50,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 30,000 కార్పొరేట్ తగ్గింపును అందిస్తుంది. రెనాల్ట్ క్విడ్ హ్యాచ్‌బ్యాక్‌పై రూ. 10,000 వరకు నగదు తగ్గింపు, రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ (1.0-లీటర్ మోడల్‌కు రూ. 15,000 మరియు 0.8-లీటర్ వెర్షన్లకు రూ. 10,000), రూ. 10,000 వరకు కార్పొరేట్ తగ్గింపు ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాహనం కొనుగోలుపై రూ. 5,000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. స్టాక్ సప్లయ్ డిమాండ్‌కు తగ్గట్లు 2020 మోడల్లకు రూ. 10,000 తగ్గింపు వర్తిస్తుంది. రెనాల్ట్ కిగర్ రెనాల్ట్ కిగర్, కాంపాక్ట్ ఎస్యూవీ రూ 10,000, రూ 10,000 వరకు ఒక కార్పొరేట్ డిస్కౌంట్ ,రూ 5,000 గ్రామీణ ఆఫర్ వరకు ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చు. పైన పేర్కొన్న ఆఫర్లు 31 డిసెంబర్ 2021 మాత్రమే అందుబాటులో ఉంటాయని రెనాల్ట్ ప్రతినిధులు వెల్లడించారు. చదవండి: సర్వే: యువతకు ఏ కార్లు అంటే ఇష్టం, వాళ్లకి కారు కొనే సామర్ధ్యం ఉందా?! -
రెనాల్ట్ కార్ల కొనుగోలుపై రూ.80 వేల వరకు బంపర్ ఆఫర్స్..!
ఫ్రాన్స్‌కు చెందిన మల్టీనేషనల్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ ఇండియా వాహన కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. రెనాల్ట్ శ్రేణిలోని కార్ల కొనుగోలుపై బంపర్ ఆఫర్లను కంపెనీ ప్రకటించింది. ఈ ఆఫర్స్ ఈ నెల చివరి వరకు అందుబాటులో ఉండనున్నాయి. రెనాల్ట్ ఇండియా తన మోడల్ లైనప్‌లో పలు ప్రయోజనాలను ప్రకటించింది. రెనాల్ట్ సుమారు రూ 80 వేల వరకు క్యాష్ బెనిఫిట్స్, లాయల్టీ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లను అందించనుంది. చదవండి: Puncture - Proof Tires: ఈ టైర్లు అసలు పంక్చరే కావు..! రెనాల్ట్ అందిస్తోన్న ఆఫర్లు ఆయా మోడల్, ప్రాంతాల్లో మారుతూ ఉంటాయి. ‘బై నౌ, పే ఇన్ 2022’ అనే సరికొత్త స్కీమ్‌తో రెనాల్ట్ ముందుకొచ్చింది. ఈ స్కీమ్ సెలక్టెడ్ కార్లపై మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ఈ స్కీమ్‌లో భాగంగా తొలి ఆర్నెల్ల సమయంలో ఈఎమ్ఐ చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే కారు కొన్న వెంటనే ఈఎమ్ఐ చెల్లించనక్కర్లేదు. రెనాల్ట్ తన RELi.VE స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద సుమారు రూ. 10 వేల వరకు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్ క్విడ్ , ట్రైబర్ లేదా డస్టర్‌పై వర్తిస్తుంది. రెనాల్ట్ క్విడ్ క్విడ్ హ్యాచ్‌బ్యాక్ సేల్‌లో రూ.40 వేల వరకు గరిష్ట ప్రయోజనాలతో అమ్మకానికి ఉంది. ఈ ఆఫర్లలో పదివేల వరకు క్యాష్ డిస్కౌంట్, 20 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, పదివేల వరకు కార్పొరేట్ బోనస్ ఉన్నాయి. రెనాల్ట్ ట్రైబర్ ట్రైబర్ ఎమ్పీవీపై రెనాల్ట్ విభిన్న ప్రయోజనాలను అందిస్తోంది. రెనో 2020 మోడల్ ట్రైబర్‌పై కొనుగోలుదారులు సుమారు రూ. 60 వేల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. వీటిలో రూ. 25 వేల వరకు క్యాష్ బెనిఫిట్, రూ. 25 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 10 వేల వరకు కార్పొరేట్ బోనస్ ఉన్నాయి. 2021 మోడల్ ఇయర్ ట్రైబర్ కొనుగోలు చేసే కస్టమర్లు సుమారు రూ. 50 వేల వరకు ప్రయోజనాలను పొందుతారు. వీటిలో రూ. 15 వేల వరకు క్యాష్ బెనిఫిట్, రూ. 25 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 10 వేల వరకు కార్పొరేట్ బోనస్ ఉన్నాయి. రెనాల్ట్ డస్టర్ రెనాల్ట్ డస్టర్ కొనుగోలుపై సుమారు రూ. 80 వేల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. వీటిలో రూ. 30 వేల వరకు క్యాష్ బెనిఫిట్, రూ. 20 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 30 వేల వరకు కార్పొరేట్ బోనస్ ఉన్నాయి. ఈ మూడు మోడళ్లకు ‘ఇప్పుడు కొనండి 2022లో చెల్లించండి’ స్కీమ్ వర్తించనుంది. చదవండి: 20 నిమిషాల ఛార్జింగ్‌తో 482 కి.మీ ప్రయాణం..! -
మేరీకోమ్‌కు ఖరీదైన కారు గిఫ్ట్‌గా
ఢిల్లీ: 2012 లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత.. ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ మేరీకోమ్‌కు రినాల్డ్ ఇండియా ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చింది. టోక్యో ఒలింపిక్స్ 2020 ఫ్లాగ్ బేరర్‌గా(పతాకధారి) వ్యవహరించిన మేరీకోమ్‌కు రినాల్డ్ ఇండియా కైగర్ కంపాక్ట్ ఎస్యూవీ మోడల్ కారును అందించింది. అంతకముందు టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత.. భారత మహిళ వెయిట్‌లిఫ్టర్ మీరాభాయి చానుకు కూడా రినాల్డ్ కైగర్ కంపాక్ట్ ఎస్యూవీ మోడల్ కారునే గిఫ్ట్‌గా అందించింది. కాగా షినీ విల్సన్, అంజూ బాబీ జార్జీ తర్వాత మేరీకోమ్ ఒలింపిక్స్‌లో ఫ్లాగ్‌బేరర్‌గా వ్యవహరించిన మూడో భారత మహిళ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో కచ్చితంగా పతకం తెస్తుందనుకున్న మేరీకోమ్ క్వార్టర్స్ చేరకుండానే రెండో రౌండ్లోనే తిరుగుముఖం పట్టింది. రౌండ్ 16 పోరులో కొలంబియన్ బాక్సర్ వాల్నసీయా విక్టోరియా చేతిలో మేరి కోమ్ ఓటమి పాలైంది. 3-2 తేడాతో మేరీ కోమ్ ఓటమి పాలైంది. కాగా లండన్ ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌లో మేరీకోమ్ క్యాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. అయితే వయసు రిత్యా చూస్తే మాత్రం మేరీకోమ్‌కు ఇవే ఆఖరి ఒలింపిక్స్ అని అంతా భావించారు. కానీ తాను 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కచ్చితంగా పాల్గొంటానని మేరీకోమ్ ధీమా వ్యక్తం చేసింది. చదవండి: Mary Kom: నాకింకా వయసైపోలేదు. మరో నాలుగేళ్లు ఆడతా -
రెనో క్విడ్ నియోటెక్ ఎడిషన్ ఆవిష్కరణ
సాక్షి, ముంబై: రెనో ఇండియా క్విడ్ నియోటెక్ పేరుతో లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఈ క్విడ్‌కు మంచి డిమాండ్ ఉంటుందని రెనో ఆశిస్తోంది. ఈ మోడల్ మూడు వేరియంట్లలో విడుదల కానుంది. 800 సీసీ, 1.0 లీటర్ మాన్యువల్, 1.0 లీటర్ ఏటీఎంల రూపంలో లభ్యమయ్యే ఈ వేరియంట్ల ధరలు వరుసగా రూ.4,29,800 రూ.4,51,800, రూ.4,83,800 గా ఉన్నాయి. ఈ స్పెషల్ ఎడిషన్ రెండు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. దీని ఇంజిన్ 0.80 లీటర్ యూనిట్, 1.0 లీటర్ యూనిట్ ఆప్షన్లలో ఉన్నాయి. ఇందులో 0.80 లీటర్ యూనిట్ 53 బీహెచ్పీ శక్తిని, 72 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. మరొకటి 1.0 లీటర్ యూనిట్ 67 బీహెచ్పీ శక్తిని, 91 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. వీటితో పాటు స్టాండర్డ్ 5–స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఇందులో ఉంది. అక్టోబర్ 1న బుకింగ్స్ మొదలయ్యాయి. డెలివరీలు తొందర్లోనే ప్రారంభమవుతాయి. పండుగ సీజన్ సందర్భంగా కంపెనీ బ్రాండ్ శ్రేణి ధరల్ని స్వల్పంగా పెంచింది. Slide into the driver’s seat of the New #RenaultKWID NEOTECH EDITION, and take control with the steering wheel that comes with stylish Zanskar Blue and Chrome accents. Know more: https://t.co/6wwDGiaKTr pic.twitter.com/TNWIP6PvS9 — Renault India (@RenaultIndia) October 2, 2020 -
రెనాల్ట్ ట్రైబర్ ఇండియా ధరల వాత
సాక్షి, ముంబై: రెనాల్ట్ ఇండియా తన పాపులర్ ఎంపీవీ ట్రైబర్ ధరలను పెంచేసింది. గత ఏడాది ఆగస్టులో భారత మార్కెట్ లో రెనాల్ట్ ట్రైబర్ లాంచ్ చేసింది. ఆ తరువాత కొత్త నిబంధనలకు అనుగుణంగా అప్ డేట్ చేసి బీఎస్-6 వేరియంట్ ట్రైబర్‌ను 4.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ఈ ఏడాది జనవరిలో తీసుకొచ్చింది. ఈ సందర్భంగా 29 వేల రూపాయల మేర ధర పెంచింది. తాజాగా మరోసారి పెంపుతో 11,500 నుండి 13,000 మేర వినియోగదారులపై భారం మోపనుంది. దేశంలో రెనాల్ట్ ట్రైబర్ ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండనుంది. ఈ కారును లాంచ్ చేసినప్పటినుంచి ఇప్పటికి నాలుగు సార్లు ధర పెంచడం గమనార్హం. ప్రధానంగా ఆర్ఎక్స్ఈ మోడల్ ధరను 13 వేల రూపాయలు పెంచింది. దీంతో దీని ధర ఇప్పుడు 5.12 లక్షలుగా ఉంది. అలాగే 12,500 పెంపుతో ఆర్ఎక్స్ జెడ్, ఆఎక్స్ జెడ్ ఏఏంటీ వేరియంట్ ధరలు 6.94 లక్షలు, 7.34 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) రూపాయలు. రెనాల్ట్ ట్రైబర్ ఎంపీవీ సింగిల్ పవర్ ట్రెయిన్ ఆప్షన్‌తో వస్తుంది. 1.0 లీటర్, 3 సిలిండర్ ఇంజిన్, 5 స్పీడ్ ఏఎంటీ, 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభ్యం. -
స్పోర్టీ లుక్ లో కొత్త రెనాల్ట్ డస్టర్
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఫ్రెంచ్ కార్ల తయారీదారు రెనాల్డ్ తన పాపులర్ కారులో రెనాల్ట్ డస్టర్ టర్బో 2020 మోడల్ కారును భారతదేశంలో లాంచ్ చేసింది. తమ కొత్త డస్టర్ ఎస్యూవీ మోడల్ ఇప్పుడు దేశంలో ఈ విభాగంలో అత్యంత శక్తివంతమైనది నిలిచిందనీ, ఆటోమోటివ్ మార్కెట్లలో ఐకానిక్ హోదాను సాధించిందని కంపెనీ సీఈఓ వెంకట్రావ్ మామిళ్ల పల్లె ప్రకటించారు. రెనాల్ట్ డస్టర్ టర్బో వేరియంట్లు 1.3 లీటర్ బీఎస్-6- కంప్లైంట్ మోటర్ఇన్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు సీఈటీ ఆప్షన్‌తో ఐదు వేరియంట్లలో లభిస్తుంది.1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆర్ఎక్స్ఈ, ఆర్ఎక్స్ఎస్, ఆర్ఎక్స్ జెడ్ మోడళ్లను తీసుకురాగా, సీవీటిలో ఆర్ఎక్స్ఎస్ , ఆర్ఎక్స్ జెడ్ వేరియంట్లలో మాత్రమే లభించనుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో బేస్ మోడల్ రెనాల్ట్ డస్టర్ టర్బో మోడల్ ధర 10.49 లక్షల రూపాయలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. సీవీటి వెర్షన్ ధరలు 12.99 లక్షలతో ప్రారంభం 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ సామర్ధ్యంతో లభిస్తున్న రెనాల్డ్ డస్టర్ ధరలు 8.59 లక్షల రూపాయలనుంచి 9.99 లక్షల మధ్య ఉండ నున్నాయి. 500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 154 బిహెచ్పి శక్తిని, 1,600 ఆర్‌పిఎమ్ వద్ద 254 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను అందిస్తుంది. మాన్యువల్ వేరియంట్ లో ఇంధన సామర్ధ్యం లీటరు 16.5 కిలోమీటర్లు, సీవీటీ మోడల్ కారు 16.42 కిలోమీటర్ల ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. రిమోట్ ప్రీ-కూలింగ్ ఫంక్షన్‌తో క్యాబిన్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో 7అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లాంటి ఫీచర్లను రెనాల్ట్ డస్టర్ టర్బోలో జోడించింది. -
ఉద్యోగులకు రెనాల్ట్ ఇండియా వరాలు
సాక్షి, ముంబై: కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభంతో ఆదాయాలను కోల్పోయిన పలు సంస్థలు ఉద్యోగాల కోత, వేతనాలు తగ్గింపు లాంటి నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న తమ ఉద్యోగులకు అండగా నిలవాలని భావించింది. వేతనాలు పెంపు, పదోన్నతులు ప్రకటించి ప్రత్యేకంగా నిలిచింది. తన సిబ్బంది మనోస్థైర్యాన్ని పెంచడం కీలకమని, అందుకే ఈనిర్ణయం తీసుకున్నామని రెనాల్ట్ ఇండియా తెలిపింది. 2020 ఆర్థిక సంవత్సరంలో 10-12 శాతం పోలిస్తే ఈ పెంపు ఎక్కువగా ఉండటం మరో విశేషం. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం కరోనా, లాక్ డౌన్ ప్రభావం ఉన్నప్పటికీ రెనాల్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ఐపిఎల్) తన ఉద్యోగులకు 15 శాతం వేతన పెంపును అమలు చేయనుంది. 2021 ఆర్థిక సంవత్సరానికి పదోన్నతులు కూడా ఇస్తోంది. ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చేలా 250 మంది ఉద్యోగులకు 15 శాతం వేతన పెంపును ప్రకటించింది. అలాగే 30 మందికి పైగా అధికారులకు పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే జీతాల పెంపు నుంచి తన భాగస్వాములైన నిస్సాన్, రెనాల్ట్ నిస్సాన్ టెక్నాలజీ బిజినెస్ సెంటర్ ఇండియాను మినహాయించింది. మరోవైపు ఉద్యోగులకు జీతాలందించేందుకుగాను తన డీలర్లకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. కార్లు, విడిభాగాలపై మార్జిన్‌ను 200-300 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. చదవండి : మారుతికి షాక్ : టాప్ సెల్లింగ్ కార్ ఇదే! -
ధైర్యంగా ఉండండి.. డస్టర్ - 2019 కమింగ్!
సాక్షి, న్యూఢిల్లీ: ఫ్రెంచ్ కంపెనీ రెనాల్ట్ తన పాపులర్మోడల్ కారు డస్టర్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఆధునిక సెక్యూరీటీ ఫీచర్లతో డస్టర్ ఫేస్‌లిఫ్ట్‌ను త్వరలోనే లాంచ్ చేయనుంది. గర్వంగా ఉండండి.. ధైర్యంగా వుండండి. విసుగు చెందకండి. బోర్డర్లను బద్దలుకొట్టండి.. న్యూ రెనాల్ట్ డస్టర్ జూలై 8వ తేదీన మార్కెట్లోకి వస్తోందని రెనాల్ట్ ట్వీట్ చేసింది. ఆర్ ఎక్స్ఈ, ఆర్ఎక్స్ఎస్, ఆర్ఎక్స్ జెడ్ మూడు వేరియంట్లలో వస్తున్న డస్టర్ ఫేస్‌లిఫ్ట్ ధరలను రూ. 8 లక్షలనుంచి రూ.13.10 లక్షలు(ఎక్స్‌షోరూం, ఢిల్లీ)గా నిర్ణయించింది. ఆర్ఎక్స్ఎస్ మోడల్ ఆల్‌వీల్ డ్రైవ్(ఏడబ్ల్యుడీ) ఆప్షన్‌ను అందిస్తోంది. బీఎస్ 6 నిబంధనలకనుగుణంగా 1.5 పెట్రోలు, డీజిల్ ఇంజీన్లలో తీసుకొస్తోంది. పెట్రోల్ , డీజీల్ ఇంజీన్ 108 బీహెచ్పీ పవర్‌ను, పెట్రోలు వెర్షన్ లీటరుకు 14 కి.మీలు, డీజిల్ వెర్షన్ లీటరు 19-20 కి.మీ మైలేజీనీ ఇస్తుంది. కొత్త వెర్షన్ డస్టర్ కారు హుందాయ్ క్రెటా, ఫోర్డ్ ఎక్సో స్పోర్ట్, మహీంద్ర ఎక్స్‌యూవీలకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. Be audacious, be daring, just don't be boring. Dare to push all limits in the #NewRenaultDUSTER. #NowEvenBOLDER Know more: https://t.co/IVCIbpfpTB pic.twitter.com/uOq1UmVagX — Renault India (@RenaultIndia) July 6, 2019 -
స్టయిలిష్‌గా కొత్త రెనాల్ట్ క్విడ్
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ కొత్త కారును లాంచ్ చేసింది. తన ఎంట్రీ లెవల్ కారు రెనాల్ట్ క్విడ్ లో కొత్త కారును సోమవారం భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ.2.67-4.63 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) గా నిర్ణయించింది, మెరుగైన భద్రతా ఫీచర్స్‌తో దీన్ని భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చామని రెనాల్ట్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. 0.8 లీటర్, 1లీటరు పెట్రోల్ ఇంజిన్లలో మాన్యువల్, ఆటోమేటెడ్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో కొత్త క్విడ్ లభించనుంది. అత్యాధునిక భద్రత నిబంధనలతోపాటు, పాదచారుల భద్రతకు అనుగుణంగా తమ కొత్తకారు ఉంటుందనీ, ముఖ్యంగా ఏబీఎస్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ లాంటి ఫీచర్లను ఇందులో జోడించినట్టు కంపెనీ తెలిపింది. అలాగే స్పీడ్, ఎయిర్‌బ్యాగ్ రిమైండర్ ఫీచర్, 17.64 సెం.మీ టచ్ స్క్రీన్ మీడియా, నావిగేషన్ సిస్టం, కెపాసిటివ్ టచ్‌స్క్రీన్‌తోపాటు ఆండ్రాయిడ్ , ఆపిల్ కార్ ప్లేలకు అనుగుణంగా ఫుష్ టు టాక్ ఫీచర్ అందించినట్టు తెలిపింది. కాగా 2.75లక్షలకు పైగా యూనిట్ల అమ్మకాలతో భారత్ మార్కెట్లో రెనాల్ట్కు క్విడ్ విజయవంతమైన కారుగా నిలిచింది. Presenting the #Stylish #FeatureLoaded #RenaultKWID with a host of best-in-class safety features that ensure every ride is safe, comfortable and convenient. Know more: https://t.co/9gTCUKaJQA pic.twitter.com/TqrvkqdVLN — Renault India (@RenaultIndia) February 2, 2019 -
4 ఏళ్లలో లక్ష కిలోమీటర్ల వారెంటీ
న్యూఢిల్లీ : రెనాల్ట్ ఇండియా తన బెస్ట్ సెల్లింగ్ కారు క్విడ్‌కు కొత్త వారెంటీ, రోడ్‌సైడ్ అసిస్టెన్సీ స్కీమ్‌ను ప్రకటించింది. ఈ స్కీమ్ కింద క్విడ్ వారెంటీ నాలుగేళ్లలో లక్ష కిలీమీటర్లుగా కంపెనీ నిర్ణయించింది. దీనిలో రెండేళ్లు 50 వేల కిలోమీటర్లు స్టాండర్డ్ వారెంటీ కాగ, మిగతా రెండేళ్లు 50 వేల కిలోమీటర్ల ఎక్స్టెండెడ్ వారెంటీ ఉంది. అన్ని క్విడ్ మోడల్స్‌కు ఈ వారెంటీ వర్తిస్తుందని రెనాల్ట్ పేర్కొంది. దేశీయ ఆటో దిగ్గజమైన మారుతీ సుజుకీ తన పాపులర్ మోడల్ ఆల్టోకు రెండేళ్లలో కేవలం 40వేల కిలోమీటర్ల స్టాండర్డ్ వారెంటీనే అందిస్తోంది. హ్యుందాయ్ అయితే తన ఇయాన్కు మూడేళ్లలో లక్ష వారెంటీని ఆఫర్ చేస్తోంది. ఈ వారెంటీ పెంపుతో, క్విడ్ స్టాండర్డ్ వారెంటీ, ఇప్పటి వరకు ఈ సెగ్మెంట్లో ఉన్న ఇతర కార్ల కంటే అధికంగా ఉంది. రెనాల్ట్ ముందు నుంచి డ్యూరేషన్ లేదా మైలేజీ విషయంలో తన ప్రత్యర్థుల కంటే మెరుగైన స్టాండర్డ్ వారెంటీనే అందిస్తోంది. అయితే రెడీ-గో మాత్రం రెండేళ్లలో అపరిమిత వారెంటీని ఆఫర్ చేస్తోంది. కొనుగోలుదారుల పరంగా చూసుకుంటే క్విడ్ వారెంటీ ఎక్కువ రక్షణగా ఉందని తెలుస్తోంది. 2017 క్విడ్ మోడల్స్‌పై కంపెనీ ఈ నెలలో పలు డిస్కౌంట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ మాన్యువల్, ఏఎంటీ వెర్షన్లకు రూ.20వేల వరకు నగదు డిస్కౌంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. -
ఈ కారుపై లక్ష వరకు ధర తగ్గింపు
ఆటోమేకర్ రెనాల్ట్ ఇండియా తన ఎస్యూవీ డస్టర్‌పై భారీగా ధర తగ్గించింది. ఈ కారుపై 29,746 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ధర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. తక్షణమే ఈ ధర తగ్గింపు అమల్లోకి వస్తుందని గురువారం రెనాల్ట్ ఇండియా తెలిపింది. ధర తగ్గింపు అనంతరం పెట్రోల్‌తో నడిచే డస్టర్ ప్రస్తుతం ఎక్స్‌షోరూంలో 7.95 లక్షల రూపాయల నుంచి 9.95 లక్షల రూపాయల వరకు ఉంది. అంతకముందు ఇది 8.5 లక్షల రూపాయల నుంచి 10.24 లక్షల రూపాయలకు లభ్యమయ్యేది. డీజిల్‌తో నడిచే డస్టర్ ప్రస్తుతం ఎక్స్‌షోరూంలో రూ.8.95 లక్షల నుంచి రూ.12.79 లక్షలకు అందుబాటులోకి వచ్చింది. దీని ధర కూడా అంతకముందు 9.45 లక్షల రూపాయల నుంచి 13.79 లక్షల రూపాయల వరకు ఉండేది. తాము ఆఫర్ చేసే వాహనాల రేంజ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చడం కోసం, కొత్త డస్టర్ కస్టమర్లకు ఈ ప్రయోజనాలను అందించడం తమకెంతో సంతోషాన్ని కలిగిస్తుందని రెనాల్ట్ ఇండియా ఆపరేషన్స్ దేశీయ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ సావ్నీ తెలిపారు. హ్యుందాయ్ క్రిటా, మారుతీ విటారా బ్రిజా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వంటి ఎస్‌యూవీలకు డస్టర్ గట్టి పోటీగా ఉంది. చెన్నైలో ఉన్న తయారీ యూనిట్ నుంచి ఈ డస్టర్‌ను రెనాల్ట్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. -
ఈ కార్ల ధరకు రెక్కలు
సాక్షి,న్యూఢిల్లీ: కొత్త ఏడాది కార్ల ధరలను పెంచనున్నట్టు పలు వాహన కంపెనీలు ప్రకటించగా, తాజాగా ఫ్రెంచ్ కార్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ రెనాల్ట్ తమ కార్లు క్విడ్, డస్టర్, లాడ్జీ వెరైటీలను మూడు శాతం మేర పెంచనున్నట్టు ప్రకటించింది. జనవరి 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది. ముడిపదార్ధాల ధరలు పెరగడంతోనే వాహన ధరల పెంపు అనివార్యమైందని రెనాల్ట్ పేర్కొంది. అయితే ఇటీవల మార్కెట్లో ప్రవేశపెట్టిన ప్రీమియం ఎస్యూవీ క్యాప్చర్ ధరలు మాత్రం యథాతథంగా ఉంటాయని స్పష్టం చేసింది. మహీంద్ర అండ్ మహీంద్ర, వోక్స్వ్యాగన్లు భారత్‌లో తమ వాహన ధరలను పెంచుతున్నట్టు గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. పాసింజర్, కమర్షియల్ వాహనాల ధరలను మూడు శాతం పెంచుతున్నట్టు మహీంద్ర వెల్లడించగా, తమ వాహన ధరలను రూ 20,000 వరకూ పెంచనున్నట్టు వోక్స్వ్యాగన్ తెలిపింది. -
టాటా, రెనో వాహన ధరలు తగ్గాయ్..
రూ. 2.17 లక్షల వరకు తగ్గింపు న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీలు ‘టాటా మోటార్స్’, ‘రెనో ఇండియా’ తాజాగా వాహన ధరలను రూ.2.17 లక్షల వరకు తగ్గించాయి. జీఎస్టీ ప్రయోజనాలను కస్టమర్లకు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. టాటా మోటార్స్ తన ప్యాసెంజర్ వాహన ధరలను రూ.3,300–రూ.2.17 లక్షల శ్రేణిలో తగ్గించింది. ఎస్యూవీ హెక్జా ధరలో రూ.1.04 లక్షలు–రూ.2.17 లక్షల శ్రేణిలో కోత విధించింది. హ్యాచ్‌బ్యాక్ టియాగో ధరను రూ.52,000 వరకు, కాంపాక్ట్ సెడాన్ టిగోర్ ధరను రూ.60,000 వరకు తగ్గించింది. ఇక రెనో వాహన ధరల తగ్గుదల రూ.5,200–రూ.1.04 లక్షల శ్రేణిలో ఉంది. కంపెనీ తన హ్యాచ్‌బ్యాక్ క్విడ్ క్లింబర్ ఏఎంటీ ధరను రూ.5,200–రూ.29,500 శ్రేణిలో, ఎస్యూవీ డస్టర్ ఆర్ఎక్స్జెడ్ ఏడబ్ల్యూడీ ధరను రూ.30,400–రూ.1.04 లక్షల శ్రేణిలో, లాడ్జీ స్టెప్‌వే ఆర్ఎక్స్జెడ్ ధరను రూ.25,700–రూ.88,600 శ్రేణిలో తగ్గించింది. -
1000 సీసీ సామర్థ్యంతో రెనో క్విడ్..
♦ ధరలు రూ.3.82-3.95 లక్షల రేంజ్లో ♦ మైలేజీ 23 కిమీ. న్యూఢిల్లీ: రెనో ఇండియా కంపెనీ చిన్న కారు క్విడ్ మోడల్లో కొత్త వేరియంట్లను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ 1.0 లీటర్ క్విడ్ మోడల్లో రెండు వేరియంట్లను-ఆర్ఎక్స్టీ, ఆర్ఎక్స్టీ(ఓ) పేరిట అందిస్తున్నామని కంపెనీ తెలిపింది. ఆర్ఎక్స్టీ ధర రూ.3.82 లక్షలు, ఆర్ఎక్స్టీ(ఓ)ధర రూ.3.95 లక్షలని (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) తెలియజేసింది. మంచి పనితీరు కనబరిచేలా ఈ కొత్త వేరియంట్లను తీర్చిదిద్దామని కంపెనీ సీఈఓ, ఎండీ సుమిత్ సాహ్ని తెలిపారు. డోర్ల మీద స్పోర్ట్స్ డిజైనర్ గ్రాఫిక్స్, ప్రొ-సెన్స్ సీట్ బెల్ట్, ప్రి-టెన్షనర్ష్ విత్ లోడ్ లిమిటర్స్, 300 లీటర్ల బూట్ స్పేస్ తదితర ఫీచర్లున్నాయని పేర్కొన్నారు. ఆర్ఎక్స్టీ(ఓ) వేరయంట్లో పవర్ విండోలు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ నావిగేషన్, యూఎస్బీ, ఏయూఎక్స్ సపోర్ట్, డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్(ఆప్షనల్) తదితర ప్రత్యేకతలున్నాయని వివరించారు. మైలేజీ 23 కిలోమీటర్లు ఇస్తుందని ఏఆర్ఏఐ (ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ధ్రువీకరించినట్లు తెలిపారు. మారుతీ సుజుకి ఆల్టో కే10, హ్యుందాయ్ ఇయాన్, టాటా టియాగోలకు గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఏడాదికొక కొత్త మోడల్... ప్రస్తుతం రెనో కంపెనీ 800 సీసీ ఇంజిన్ కెపాసిటితో క్విడ్ కారును రూ.2.64 లక్షలు నుంచి రూ.3.73 లక్షల రేంజ్లో విక్రయిస్తోంది. కాగా ప్రధాన పోటీ కారు అయిన ఆల్టో కె10 కార్ల ధరలు రూ.3.25 లక్షల నుంచి రూ.3.82 లక్షల రేంజ్లో ఉన్నాయి. ఈ కొత్త వేరియంట్లతో మరింత మంది వినియోగదారులకు చేరువ కానున్నామని సుమిత్ సాహ్ని అశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్ల ఉత్పత్తిని మరింతగా పెంచామని, దీంతో ఈ కారు వెయిటింగ్ పీరియడ్ 2-3 నెలల కాలం నుంచి 1-2 నెలల కాలానికి తగ్గుతుందని తెలిపారు. ప్రస్తుతం నెలకు పదివేల క్విడ్కార్లను తయారు చేస్తున్నామని, కొత్త వేరియంట్లు కూడా వచ్చాక, డిమాండ్‌ను బట్టి ఉత్పత్తిని మరింత పెంచుతామని వెల్లడించారు. ఆటో గేర్ స్విఫ్ట్ ట్రాన్సిమిషన్ మోడల్‌ను కూడా తేవాలనుకుంటున్నామని తెలిపారు. రానున్న కొన్నేళ్లలో ఏడాదికొక కొత్త మోడల్‌ను భారత మార్కెట్లోకి తెస్తామని చెప్పారాయన. గత ఏడాదిలో మార్కెట్లోకి క్విడ్‌ను తెచ్చామని, ఇప్పటికే 1.65 లక్షల కార్లను విక్రయించామని, క్విడ్ కారు మంచి విజయాన్ని సాధించిందని వివరించారు. ఈ ఏడాది చివరికల్లా 5 శాతం మార్కెట్ వాటా సాధించడం లక్ష్యమని పేర్కొన్నారు. డీలర్ల నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరిస్తున్నామని సాహ్ని తెలిపారు. -
జోరుగానే వాహన విక్రయాలు
♦ మారుతీ, రెనో ఇండియాల జోరు ♦ రేట్ల కోతపై కంపెనీల ఆశలు న్యూఢిల్లీ: వాహన విక్రయాలు ఈ ఏడాది మార్చి నెలలో జోరుగా ఉన్నాయి. మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టీవీఎస్ మోటార్, హీరో మోటొకార్ప్, అశోక్ లేలాండ్ కంపెనీల వాహన విక్రయాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. హోండా కార్స్ ఇండియా, హీరో మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఆఫ్ ఇండియాల వాహన అమ్మకాలు మాత్రం తగ్గాయి. ఆర్బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలున్నాయని, దీంతో వడ్డీరేట్లు తగ్గుతాయని, అమ్మకాలు పుంజుకునే అవకాశాలున్నాయని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్, ప్రెసిడెంట్(ప్రవీణ్ షా) వ్యాఖ్యానించారు. గత ఆర్థిక సంవత్సరం పరిశ్రమ పనితీరు మిశ్రమంగా ఉందని హీరో మోటొకార్ప్ పేర్కొంది. వర్షాలు మంచిగా కురిస్తే, సకాలంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు బాగా ఉంటాయని వివరించింది. అన్ని మోడళ్లను బీఎస్-4 పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా అందుబాటులోకి తెస్తామని హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా తెలిపింది. మరింతగా గ్రామీణ మార్కెట్లలోకి విస్తరిస్తామని పేర్కొంది. గత నెలలో 50వేలకు పైగా బైక్‌లు విక్రయించామని, ఒక్క నెలలో 50వేల బైక్‌లు విక్రయించడం చెప్పుకోదగ్గ మైలురాయని రాయల్ ఎన్ఫీల్డ్ పేర్కొంది. మారుతీ, హ్యుందాయ్ రికార్డ్ వార్షిక అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్ కంపెనీలు రికార్డ్ స్థాయి అమ్మకాలను సాధించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ, హోండా కార్స్ కూడా మంచి అమ్మకాలు సాధించాయి. మారుతీ సుజుకీ అమ్మకాలు 11 శాతం వృద్ధితో 14.2 లక్షలకు, హ్యుందాయ్ అమ్మకాలు 15 శాతం వృద్ధితో 4.8 లక్షలకు చేరాయి. దేశీయంగా వాహన పరిశ్రమ 7 శాతం వృద్ధి సాధిస్తే తమ అమ్మకాలు 11 శాతం వృద్ధి చెందాయని మారుతీ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో 13,05,351 దేశీయంగా అమ్మకాలు సాధించామని, గత ఆర్థిక సంవత్సరంలో తమ అమ్మకాలు 2 శాతం పెరిగాయని హోండా కార్స్ పేర్కొంది. -
క్విడ్ 1,000 సీసీ ఈ ఏడాదే..
♦ మార్చిలో మార్కెట్లోకి కొత్త డస్టర్ ♦ 2016లో లక్ష యూనిట్లు దాటేస్తాం ♦ రెనో ఇండియా సీఈవో సుమిత్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ రెనో (రెనాల్ట్) ఇండియాకు క్విడ్ మోడల్ బాగా కలిసొచ్చింది. ఇదే ఊపుతో ఇప్పుడు క్విడ్ సిరీస్‌లో 1,000 సీసీతోపాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో మోడళ్లను రూపొందిస్తోంది. ఈ ఏడాదే వీటిని భారత్‌లో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న క్విడ్ కారు 800 సీసీ సామర్థ్యం గలది. గతేడాది సెప్టెంబరు నుంచి క్విడ్ అందుబాటులోకి వచ్చింది. కంపెనీ ఇప్పటిదాకా 32,000 పైచిలుకు క్విడ్ కార్లను విక్రయించింది. మరో లక్ష కార్లకు బుకింగ్స్ నమోదయ్యాయని రెనో ఇండియా సీఈవో సుమిత్ సాహ్నీ శుక్రవారం తెలిపారు. రెనో బేగంపేట్ షోరూంను ప్రారంభించిన సందర్భంగా రీజినల్ బిజినెస్ హెడ్ షహల్ ఎం షంషుద్దీన్, ఆటోలాజిక్ మోటార్స్ ఎండీ జగదీష్ రామడుగుతో కలిసి మీడియాతో మాట్లాడారు. వచ్చే నెల నుంచి క్విడ్ కార్లను ఎగుమతి చేస్తామని చెప్పారు. 32 రకాల మార్పులతో కొత్త డస్టర్ కారును మార్చిలో విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. ఇందులో 10 రకాల వేరియంట్లు రానున్నాయన్నారు. మూడంకెల వృద్ధి.. రెనో 2015లో దేశంలో అన్ని మోడళ్లు కలిపి 54,000 యూనిట్లు విక్రయించింది. పరిశ్రమ 8.5 శాతం వృద్ధి చెందితే తమ కంపెనీ 20% వృద్ధి నమోదు చేసిందని సుమిత్ వెల్లడించారు. ‘2016లో 100 శాతం వృద్ధితో లక్షకుపైగా యూనిట్లను విక్రయిస్తాం. ప్రస్తుతం భారత కార్ల మార్కెట్లో రెనోకు 3.5-4% వాటా ఉంది. 2017 చివరినాటికి 5%కి చేర్చాలనేది మా లక్ష్యం. కానీ దీన్ని ఈ ఏడాదే చేరుకుంటాం. ప్రస్తుతం మా ర్యాంకు మెరుగుపడి 8 నుంచి 7కు వచ్చాం’ అని తెలిపారు. డాలరు బలపడడం, అధిక ముడి పదార్థాల ధర కారణంగా వాహనాల ధర పెరిగే అవకాశం ఉందని సుమిత్ చెప్పారు. అన్ని కంపెనీలు బడ్జెట్ కోసం ఎదురు చూస్తున్నాయన్నారు. దేశీయంగా అమ్మకాలను పెంచేందుకు పాత వాహనాలను తుక్కుగా మార్చే పథకంతోపాటు రాయితీలు ప్రకటించాలని కోరారు. క్విడ్‌లో 98% విడిభాగాలు దేశీయంగా తయారైనవేనని గుర్తు చేశారు. కంపెనీ అమ్మకాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా 6%.